అనంత్, రాధిక పెళ్లిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మన మహేష్ బాబే ... ఏమున్నాడు బాసు..!!

Published : Jul 12, 2024, 10:01 PM ISTUpdated : Jul 12, 2024, 10:09 PM IST

Anant Ambani Radhika Merchant Wedding : ప్రపంచ కుబేరుల్లో ఒకరయిన ముఖేష్ అంబాని తనయుడు అనంత్ అంబాని పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. అంబాని కుటుంబసభ్యులు, అతిథుల మధ్య అనంత్ అంబాని, రాధిక మర్చంట్ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.  

PREV
16
అనంత్, రాధిక పెళ్లిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మన మహేష్ బాబే ...  ఏమున్నాడు బాసు..!!
Anant Ambani Radhika Merchant Wedding

అంబానీల ఇంట పెళ్లికి వ్యాపార, సినీ, రాజకీయ ప్రముఖులతో దేశవిదేశాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖుల హాజరయ్యారు. అంబాని కుటుంబసభ్యులు, అతిథుల మధ్య అనంత్ అంబాని, రాధిక మర్చంట్ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. 
 

26
Anant Ambanii Radhika Merchant Wedding

ఇలా ముఖేష్ అంబాని ఇంట పెళ్లికి బాలీవుడ్ తో పాటు సౌతిండియా సినీ స్టార్లు హాజరయ్యారు.  అయితే అందరిలోనూ టాలీవుడ్ హీరో మహేష్ బాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  బ్లాక్ ఆండ్ బ్లాక్ ఔట్ ఫిట్,  ఆకట్టుకునే హెయిర్ స్లైల్, గడ్డంతో మహేష్ బాబు సరికొత్తగా కనిపించారు.  ఆయన భార్య నమ్రత, కూతురు  సితార కూడా సాంప్రదాయ దుస్తుల్లో చక్కగా మెరిసిపోయారు.

36
Anant Ambani Radhika Merchant Wedding

మహేష్ బాబు తాజా లుక్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.  రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్న తమ హీరో లుక్ బయటకు రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.  మన రాజకుమారుడిని చూసి హిందీ జనాలు కూడా ఏమున్నాడు బాసు అంటున్నారు.  

46
Anant Ambani Radhika Merchant Wedding

ఇక అనంత్ అంబానీ పెళ్లిలో దగ్గుబాటి కుటుంబం కూడా తళుక్కున  మెరిసింది.  రానా సతీసమేతంగా పెళ్లికి హాజరయ్యారు. రానా, మిహికా కపుల్ ట్రెడిషనల్ లుక్ లో కనిపించారు. ఆరడుగుల ఈ జంట అంబానీల పెళ్లిలో అందరినీ ఆకట్టుకునేలా కనిపించారు. 

56
Anant Ambani Radhika Merchant Wedding

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ కూడా అనంత్, రాధిక పెళ్ళికి హాజరయ్యారు. ఆయన తెల్లని షేర్వానిలో ఎప్పటిలాగే ఫ్యామిలీ మెన్ లా కనిపించారు.  ఆయన కూడా అంబానీల పెళ్లిలో ఆకర్షణగా నిలిచారు.

66
Anant Ambani Radhika Merchant Wedding

ఇక మరో సౌత్ స్టార్ రజనీ కాంత్ అచ్చ తమిళ్ స్టైల్లో అనంత్ అంబానీ పెళ్లిలో దర్శనమిచ్చారు.  లుంగీలో ఆయన మాస్ లుక్ అభిమానులను ఫిదా చేసేలా వుంది.  ఇలా అనంత్ అంబాని, రాధిక మర్చంట్ పెళ్లిలో మన సౌత్ తారలు మెరిసారు.

click me!

Recommended Stories