బిగ్ బాస్ 8లో ఆ ముక్కోపి క్రికెటర్.. షాకింగ్ న్యూస్ లీక్, ఇక హౌస్లో మామూలు రచ్చ కాదు!

First Published | Jul 12, 2024, 8:06 PM IST


బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్ గా స్టార్ క్రికెటర్ ఎంపికయ్యాడట. ఈ ముక్కోపి క్రికెటర్ పేరిట అనేక వివాదాలు ఉన్నాయి. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే నేచర్ వలన పలుమార్లు వార్తల్లో నిలిచాడు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో తెలుసా?
 

Bigg boss telugu 8

బిగ్ బాస్ తెలుగు 8 కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గత సీజన్ ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. రికార్డు స్థాయిలో టీఆర్పీ రాబట్టింది. ఈ జోష్ లో మేకర్స్ లేటెస్ట్ సీజన్ కి సన్నాహాలు చేస్తున్నారు. 

Bigg boss telugu 8

బిగ్ బాస్ తెలుగు 7 విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. కామనర్ కోటాలో హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టాప్ సెలెబ్స్ ని వెనక్కి నెట్టి టైటిల్ కైవసం చేసుకున్నాడు. మొదటి నుంచి టైటిల్ ఫేవరేట్ గా రేసులో ఉన్న శివాజీ మూడో స్థానానికి పడిపోయాడు. అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు. 


బిగ్ బాస్ సీజన్ 7 గత ఏడాది సెప్టెంబర్ లో మొదలై డిసెంబర్ లో ముగిసింది. సీజన్ 8 మాత్రం ఆగస్టులోనే మొదలు కానుందట. ఆగస్టు మొదటి వారం లేదా రెండో వారంలో లాంచింగ్ ఎపిసోడ్ ఉంటుందని అంటున్నారు. సీజన్ 7లో వలె రెండు లాంచింగ్ ఎపిసోడ్స్ ఉంటాయట. షో మొదలైన ఐదు వారాలకు వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయని అంటున్నారు.

Bigg boss telugu 8

ఇక బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ పలు బుల్లితెర, వెండితెర, సోషల్ మీడియా సెలెబ్స్ పేర్లు తెరపైకి వచ్చాయి. రీతూ చౌదరి, సురేఖ వాణి, నటి హేమ, కిరాక్ ఆర్పీ, బుల్లెట్ భాస్కర్, సోనియా సింగ్, అమృత ప్రణయ్, కుమారీ ఆంటీ, బర్రెలక్క హౌస్లోకి వెళుతున్నారట. వేణు స్వామి కూడా ఎంపికయ్యాడంటున్నారు. ఇది అనూహ్య పరిణామం.

Bigg boss Telugu

గతంలో ఏ కంటెస్టెంట్ కి ఇవ్వనంత రెమ్యూనరేషన్ వేణు స్వామికి బిగ్ బాస్ మేకర్స్ ఆఫర్ చేశారట. వీటన్నింటికీ మించిన ఓ సెన్సేషనల్ నేమ్ లీకైంది. ఓ స్టార్ క్రికెటర్ తెలుగు బిగ్ బాస్ హౌస్లో అడుగుపెడుతున్నాడట. అతడు ఎవరో కాదు... అంబటి రాయుడు. తెలుగువాడైన అంబటి రాయుడు ఇండియన్ క్రికెట్ టీమ్ లో చోటు సంపాదించాడు. పలు ఫార్మాట్స్ లో భారత్ కి ప్రాతినిధ్యం వహించాడు.

Ambati Rayudu Politics

అయితే సెలక్షన్ ప్రాసెస్ నచ్చని అంబటి రాయుడు తీవ్ర విమర్శలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ కి అన్ని ఫార్మాట్స్ లో రిటైర్మెంట్ ప్రకటించాడు. 2023లో ఐపీఎల్ ఆడాడు.  ఇటీవల పొలిటికల్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచాడు. మొదట వైఎస్ జగన్ వైపు చేరాడు. ఆయన పాలన అద్భుతం అని కితాబు ఇచ్చాడు. ఏమైందో తెలియదు... వైసీపీ పార్టీ నుండి బయటకు వచ్చేసి జనసేనలో చేరాడు. ఆ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు.s

అంబటి రాయుడికి ముక్కోపి అనే పేరుంది. దుందుడుకు స్వభావం కలిగిన వ్యక్తి. ముక్కుసూటిగా మాట్లాడే తత్త్వం. వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఇంత కంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి కావలసిన క్వాలిటీస్ ఏముంటాయి. అందుకే అంబటి రాయుడిని బిగ్ బాస్ మేకర్స్ సంప్రదించారట. ఆయన ఓకే చెప్పారట. ఈ మేరకు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు.. 

Latest Videos

click me!