ప్రతి అమ్మాయి నాగార్జునతో రొమాన్స్ చేయాలనుకుంటుందా?.. ఖుష్బూ బోల్డ్ కామెంట్‌..ఆమె ఫ్రెండ్‌కి కూడా అదే ఫీలింగ్‌

Published : Jul 12, 2024, 08:31 PM ISTUpdated : Jul 12, 2024, 10:38 PM IST

మన్మథుడు నాగార్జునపై ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయనతో ప్రతి ఉమెన్‌ ఇప్పటికీ రొమాన్స్ చేయాలనుకుంటారని చెబుతూ షాకిచ్చింది ఖుష్బూ.   

PREV
15
ప్రతి అమ్మాయి నాగార్జునతో రొమాన్స్ చేయాలనుకుంటుందా?.. ఖుష్బూ బోల్డ్ కామెంట్‌..ఆమె ఫ్రెండ్‌కి కూడా అదే ఫీలింగ్‌

 కింగ్‌ నాగార్జునకి ఇప్పుడు 65ఏళ్లు. కానీ ఇప్పటికీ ముప్పై ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తాడు. అదే ఎనర్జీ, అదే యాక్టివ్‌నెస్‌, అదే అందం, అదే స్టయిల్. ముప్పై ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో, ఇప్పుడు అలానే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడే మరింత స్టయిల్ గా, యంగ్‌గా కనిపిస్తుంటారు. `బిగ్‌ బాస్‌` షోలో ఆయన స్టయిలీష్‌ లుక్‌కి అంతా ఫిదా అవ్వాల్సిందే. అంతగా తన ఫిట్‌నెస్‌ని మెయింటేన్‌ చేస్తూ వస్తున్నాడు. 

25

నాగార్జునకి మన్మథుడు అనే ట్యాగ్‌ ఉంది. ఆ పేరుకి మరింత న్యాయం చేస్తున్నాడు. ఈ ఏజ్‌లోనూ మన్మథుడిగానే కనిపిస్తున్నారు. ఇప్పటికీ నాగ్‌ని చూస్తుంటే అమ్మాయిలు ఫిదా అయిపోతారట. ఆయనతో ప్రేమలో పడిపోతారట, ఆయనతో డేట్‌కి వెళ్లాలని, రొమాన్స్ కూడా చేయాలనుకుంటారట. ఈ సంచలన వ్యాఖ్యలు సీనియర్‌ హీరోయిన్‌ ఖుష్బూ చేయడం విశేషం. ప్రతి అమ్మాయి ఇప్పటికీ నాగ్‌తో రొమాన్స్ చేయాలనుకుంటారని చెప్పి షాకిచ్చింది ఖుష్బూ. 
 

35

ఓ ఇంటర్వ్యూలో నాగార్జున గురించి చెప్పాల్సిన రావడంతో ఆమె చెబుతూ,  నాగ్‌ ఎప్పటికీ మన్మథుడే అని, ప్రతి ఒక్క అమ్మాయి నాగ్‌తో రొమాన్స్ చేయాలనుకుంటుందని చెప్పి షాకిచ్చింది. ఆయన చాలా స్టయిలీష్‌ యాక్టర్‌ అని చెప్పిన ఖుష్బూ, తాను 1986లో `కెప్టెన్‌ నాగార్జున` చేసినప్పుడు కార్గో పాయింట్‌ వేసి అప్పుడే చాలా స్టయిలీష్‌గా ఉండేవాడని, ప్రారంభం నుంచి ఆయన అలానే ఉండేవాడని చెప్పింది ఖుష్బూ.  
 

45

అంతేకాదు ఈ సందర్భంగా మరో రహస్యాన్ని బయటపెట్టింది. ప్రతి ఒక్క ఉమెన్‌ ఆయనతో డేట్‌కి వెళ్లాలనుకుంటుందని, ఆయనతో లవ్‌లో పడిపోతుందని చెప్పింది. ఇటీవల ఖుష్బూ ఫ్రెండ్ నాగ్‌ని కలిశారట. ఆమె ఖుష్బూకి నాగ్‌ ఫోటో పంపించి `ఓ మై గాడ్‌, ఈయనతో నేను ప్రేమలో పడిపోయాను` అని చెప్పిందట. దీంతో నాగ్‌కి ఖుష్బూ.. నాగ్‌ ఇప్పటికీ నీకు అమ్మాయిల ఫాలోయింగ్‌ ఉంది. నీతో ప్రేమలో పడిపోతున్నారంటూ మెసేజ్‌ చేసిందట ఖుష్బూ. టీవీ5కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుష్బూ ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. 
 

55

ఖుష్బూ.. చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం `జబర్దస్త్` షోకి జడ్జ్ గా వ్యవహరిస్తుంది. దీంతోపాటు నటిగానూ మెరుస్తుంది. బలమైన పాత్రల్లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. అలాగే నాగ్‌ ఈ ఏడాది `నా సామిరంగ` చిత్రంతో హిట్‌ అందుకున్నాడు. ఇప్పుడు ధనుష్‌తో `కుబేర`, రజనీకాంత్‌తో `కూలీ` చిత్రాలు చేస్తున్నారు. సోలో హీరోగా సినిమాకి సంబంధించిన వర్క్ జరుగుతున్నాయి.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories