స్టార్ హీరోలకు, వారి లైఫ్ స్టైల్ కు జనాల్లో ఉండే క్రేజ్ వేరు. అభిమానులు తమకు ఇష్టమైన హీరోలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ఆసక్తి చూపుతారు. వారి సినిమాలు, డ్రెస్ స్టైల్, లైఫ్‌స్టైల్ మాత్రమే కాకుండా, ఫేవరెట్ ఫుడ్ గురించి కూడా అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. మరి మన టాలీవుడ్ టాప్ హీరోలు ఏ వంటకాలను ఎక్కువగా ఇష్టపడతారో మీకు తెలుసా?
ప్రభాస్ – నాన్ వెజ్ ప్రియుడు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మంచి భోజన ప్రియుడు. షూటింగ్‌కి గ్యాప్ వచ్చినప్పుడల్లా కొత్త వంటకాలను ప్రయత్నించడాన్ని ఇష్టపడతారు. ప్రభాస్ ఏదైనా షూటింగ్ లో ఉంటే.. అక్కడ వారందరికి ఆయన ఇంటి నుంచే భోజనం వస్తుంది. తనతో నటించే హీరోయిన్స్‌కి కూడా స్వయంగా ఫుడ్ ట్రీట్ ఇవ్వడం ప్రభాస్ కు అలవాటు. ఇక ప్రభాస్‌కి అత్యంత ఇష్టమైన వంటకం రొయ్యల పులావ్. మటన్ , చికెన్ వంటకాలను కూడా ప్రభాస్ ఇష్టంగా తింటుంటారు.
28
మహేష్ బాబు – హైదరాబాద్ బిర్యానీ
సూపర్ స్టార్ మహేష్ బాబు ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సాధారణంగా కఠినమైన డైట్ పాటించే మహేష్... చీటింగ్ డే నాడు మాత్రం తన ఫేవరేట్ డిష్ హైదరాబాద్ బిర్యానీను ఆస్వాదిస్తారని చెప్పారు. ఈ బిర్యానీ మహేష్ బాబు ఇష్టమైన వంటకం అని ఆయన భార్య నమ్రత కూడా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
38
రామ్ చరణ్ – రసం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫిట్నెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అయినప్పటికీ ఆయనకు అత్యంత ఇష్టమైన ఫుడ్ ను మాత్రం అస్సలు వదిలిపెట్టరు. చరణ్ ఎక్కువగా తినే వాటిలో రసం ఒకటి. ఆయన డైటింగ్ టేబుల్ మీదకు రాగానే రసం ఉందా అని చూస్తారట. అందుకే ఇన్ స్టాట్ రసం ఫౌడర్ తయారు చేసి.. ఎక్కడికి వెళ్లిన చరణ్ వెంట అది ఉండేలా ప్లాన్ చేసిందట చరణ్ అమ్మ సురేఖ. ఈ విషయాన్ని ఉపాసన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
జూనియర్ ఎన్టీఆర్ – చేపల పులుసు ఫేవరేట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా భోజన ప్రియుడే. నాన్ వెజ్ ఫుడ్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. హీరోగా ఫిట్ నెస్ కోసం ఎంత కష్టపడతారో.. అంతే ఇష్టంగా తింటాడు కూడా. మరీ ముఖ్యంగా ఆయనకు చేపల పులుసు అంటేచాలా ఇష్టం. ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఈ విషయాన్ని చెప్పిన ఆయన, తల్లి వండిన ఫిష్ కర్రీ తనకు ఎంతో ఇష్టంగా తింటానని వెల్లడించారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫిట్నెస్ మానియాక్ అయినప్పటికీ, బిర్యానీ అంటే మహా ఇష్టం. కెరీర్ ప్రారంభంలోనే ఆయన సిక్స్ ప్యాక్ సాధించడమే కాదు, ఆ తర్వాత కూడా ఫుడ్ కంట్రోల్‌పై దృష్టి పెట్టి.. టోన్డ్ బాడీతో మెరిసిపోతున్నాడు. అయితే చీటింగ్ డే రోజు మాత్రం బిర్యానీకి నో చెప్పడం కష్టం అంటున్నారు. ప్రత్యేక సందర్భాల్లో అల్లు అర్జున్ ఇంట్లో బిర్యానీ తప్పనిసరిగా ఉండాల్సిందేనట.
58
బాలకృష్ణ – రొయ్యల వేపుడు
నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా మంచి ఫుడీ. ఆయనకు చికెన్ బిర్యానీతో పాటు రొయ్యల వేపుడు అంటే ఎంతో ఇష్టం. షూటింగ్ గ్యాప్‌లో ఈ వంటకాలను ప్రత్యేకంగా వండించుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. బాలయ్య కొన్ని సందర్భాల్లో నాన్ వెజ్ ముట్టుకోరు. కొన్ని విషయాల్లో ఆయన తండ్రి ఎన్టీఆర్ మాదిరిగానే నియమాలు పాటిస్తుంటారు.
68
చిరంజీవి – సీ ఫుడ్ ప్రేమికుడు
మెగాస్టార్ చిరంజీవి సీ ఫుడ్ ప్రియుడు. ఆయనకు చేపలు, రొయ్యలు, పీతలు వంటివి బాగా ఇష్టమట. ఆరోగ్యం కాపాడుకునే క్రమంలో ఆయన వీటిని తక్కువ మసాలాలతో వండించుకుని తింటారు. అంతే కాదు చేపలను తన తల్లి అంజనా దేవి వండితే ఇష్టంగా తింటారట మెగాస్టార్.
78
నాగార్జున – తెలుగు భోజనం
కింగ్ నాగార్జున 66 ఏళ్ళ వయస్సులో కూడా ఎంతో ఫిట్ గా ఉంటారు. కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు కింగ్. క్రమశిక్షణతో నిండిన ఆయన జీవనశైలి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. అయితే ఆహార విషయానికి వస్తే ఆయనకు హైదరాబాద్ బిర్యానీ అంటే మహాఇష్టం. అంతే కాదు రోజు తెలుగు భోజనం చేయడం చాలా ఇష్టమట. ఆయిల్ కాస్త తక్కువగా వేసిన కూరలు, పప్పు, అన్నం, రసం, ఇష్టంగా తింటారట. కింగ్. ఇక రోజు పడుకునేముందు ఒక స్వీట్ తినడం కింగ్ కు ఎప్పటి నుంచో అలవాటు. ఈ విషయం నాగార్జున పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇక నాగచైతన్య కూడా పప్పు, రసం, ఆవకాయను ఎంతో ఇష్టంగా తింటారట. మితంగా తినడం, రెగ్యూలర్ వర్కౌట్స్ వల్ల ఫిట్ నెస్ కోల్పోకుండ కాపాడుకుంటున్నట్టు చైతు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
88
వెంకటేష్ – నాటు కోడి పులావ్
విక్టరీ వెంకటేష్ ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూనే.. తనకు ఇష్టమైన ఫుడ్ ను లాగించేస్తారట. ముఖ్యంగా వెంకటేష్ కు చికెన్ అంటే చాలా ఇష్టం. నాటు కోడి పులావ్ అంటే చాలా ఇష్టం. తరచూ ఈ నాటు కోడిని వండించుకుని తింటారట.
రానా దగ్గుబాటి కూడా..
యంగ్ హీరో రానా దగ్గుబాటికి కూడా నాటు కోడి కూర అంటే విపరీతమైన ఇష్టం. డైట్‌లో మార్పులు ఉన్నా కూడా నాటుకోడి మాత్రం వదిలిపెట్టరట రానా. నెలలో రెండు మూడు సార్లు నాటు కోడి తన మెనూలు ఉండేలా చూసుకుంటారట రానా.