బ్రహ్మానందం కాకుండా చిరంజీవి కారణంగా స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఎవరో తెలుసా?

Published : Oct 30, 2025, 11:35 AM IST

చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి, స్టార్స్ గా ఎదిగారు. కానీ మెగాస్టార్ ఒక్క మాట వల్ల 400 సినిమాలకు పైగా చేసిన స్టార్ కమెడియన్ ఎవరో తెలుసా?

PREV
16
చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఎదిగిన స్టార్స్

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్‌లో ఎంతో మందికి ప్రేరణగా నిలిచిన వ్యక్తి. ఎటువంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తన కష్టంతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఆయనను చూసి ఎంతో మంది నటులుగా, టెక్నీషియన్స్ గా సినిమాల్లోకి అడుగుపెట్టారు. చిరంజీవి మాటలు, ప్రోత్సాహం ఎంతో మందికి కొత్త దారిని చూపాయి. అలాంటి వారిలో బ్రహ్మానందం, సునిల్ లాంటి స్టార్ కమెడియన్స్ కూడా ఉన్నారు. మెగాస్టార్ అవకాశం ఇవ్వడంతోనే బ్రహ్మానందం ఈ స్థాయిలో ఉన్నారు. సునిల్ కూడా చిరంజీవిని చూసే నటుడు అవ్వాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఇక వీరు కాకుండా చిరంజీవి ఒక్క మాట వల్ల వరుసగా అవకాశాలు సాధించిన కమెడియన్ ఎవరో తెలుసా?

26
రఘుబాబుకు గుర్తింపు తెచ్చిన పాత్ర

చిరంజీవి వల్ల స్టార్ గా మారిన వారిలో ప్రముఖ హాస్య నటుడు రఘుబాబు కూడా ఉన్నారు. రఘుబాబు గతంలో ఒక ఈవెంట్‌లో మాట్లాడుతూ మెగాస్టార్ తన గురించి చేసిన ఓ చిన్న కామెంట్ తన కెరీర్ కు పెద్ద ప్రచారంలా మారిందని, అది తన తన జీవితాన్ని మార్చేసిందని వెల్లడించారు. విలన్ పాత్రలతో కెరీర్‌ను ప్రారంభించిన రఘుబాబు.. సహజమైన నటన, ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా నటించిన రఘుబాబు.. ఆ తర్వాత వచ్చిన బన్నీ సినిమాతో కమెడియన్ గా మారాడు. ఈసినిమా వల్ల రఘుబాబు కెరీర్ కొత్త మలుపు తిరిగింది. అల్లు అర్జున్ హీరోగా, వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో.. రఘుబాబు పోషించిన కామెడీ పాత్ర ఆయనకు విపరీతమైన గుర్తింపు తెచ్చిపెట్టింది.

36
రఘుబాబును ఎవరు గుర్తించలేదు..

ఆ సినిమా విడుదల తర్వాత జరిగిన సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా హాజరయ్యారు. ఆ ఈవెంట్‌లో అందరూ హీరో, డైరెక్టర్, ఇతర టెక్నీషియన్ల గురించి మాట్లాడుతుండగా రఘుబాబు గురించి మాత్రం ఎవరూ ప్రస్తావించలేదు. దర్శకుడు వినాయక్ కూడా రఘుబాబుతో "నీ వల్లే సినిమా కామెడీ హైలైట్ అయింది. కానీ ఎవరూ నీ గురించి మాట్లాడడం లేదేంటయ్య" అని అన్నారట. ఎవరు మాట్లాడకపోయినా.. మెగాస్టార్ చిరంజీవి మాత్రం రఘుబాబు గురించి చాలా గొప్పగా మాట్లాడారట.

46
చిరంజీవి ఒక్క మాటతో.. రఘుబాబు కెరీర్ మారిపోయింది..

బన్నీ సక్సెస్ మీట్ లో మైక్ తీసుకున్న చిరంజీవి అందరినీ ఆశ్చర్యపరిచేలా ముందుగా రఘుబాబు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ.. “ఈ సినిమాను నేను చాలా సార్లు చూశాను. ప్రతి సారి నవ్వకుండా ఉండలేకపోయాను. రఘుబాబు కామెడీ కోసం నేనే ఈ సినిమా ఎన్నోసార్లు చూశాను. అంతే కాదు నా భార్య సురేఖ తో కలిసి రఘుబాబు కోసమే ఈమూవీ చూశాను.. ఆయన అద్భుతంగా చేశారు” అని చిరంజీవి అన్నారు. ఆ మాటలు రఘుబాబుపై ఎంతో ప్రభావం చూపించాయి. చిరంజీవి ఆ రోజు లైవ్ లో ఆ మాట అనడంతో.. వరుసగా అవకాశాలు రఘుబాబును వెతుక్కుంటూ వచ్చాయి. విలన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రఘుబాబుకు వరుసగా కామెడీ పాత్రలు స్టార్ట్ అయ్యాయి.

56
రఘుబాబు ఎమోషనల్ కామెంట్స్

చిరంజీవి గురించి ఓ ఈవెంట్ లో ఈ విషయాలన్నీ చెప్పారు రఘుబాబు. ఆయన మాట్లాడుతూ, “ఆ రోజు చిరంజీవి గారు అన్న మాటలే నా జీవితాన్ని మార్చేశాయి. ఆ తర్వాత వరుసగా నాకు కామెడీ రోల్స్ వచ్చాయి. తెలియకుండానే 400 సినిమాలకు పైగా చేశాను. అది అంతా మెగాస్టార్ ఆశీస్సులే, జీవితంలో ఆయన మేలుమర్చిపోను, చనిపోయేవరకు గుర్తు పెట్టుకుంటాను ” అని రఘబాబు అన్నారు. ఆయన వ్యాఖ్యలు అక్కడి అభిమానులను, సినీ ప్రముఖులను కదిలించాయి.

66
సొంత టాలెంట్ తో ఎదిగిన నటుడు

రఘుబాబు నటుడిగా మాత్రమే కాకుండా కమెడియన్‌గా కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బ్రహ్మానందం తరువాత అత్యధికంగా సినిమాలు చేసిన హాస్య నటులలో ఆయన ఒకరు. తన సహజమైన హాస్యంతో, టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నారు. సినీ కుటుంబం నుంచి వచ్చినా.. రఘబాబు ఎప్పుడూ తన తండ్రి గిరిబాబు పేరును వాడుకోకుండా.. సొంత ప్రతిభతో ఎదిగారు. రఘుబాబు తండరి గిరిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆయన నీనియర్ నటుడు, ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి మహేష్ బాబు వరకు మూడు తరాల హీరోలతో నటించారు. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించినా, రఘుబాబు మాత్రం టాలీవుడ్‌లో తన మార్క్ ను ప్రత్యేకంగా చూపించాడు.

Read more Photos on
click me!

Recommended Stories