నాని సినిమా చూసి, పెద్ద మెసేజ్ పెట్టిన రాజమౌళి, ఏమని సలహా ఇచ్చాడంటే?

Published : Oct 30, 2025, 09:57 AM IST

నేచురల్ స్టార్ నాని వరుసగా హిట్ సినిమాలు చేసకుంటూ వెళ్తున్నాడు. ఆయన సక్సెస్ లు చూసిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. ఓ పెద్ద మెసేజ్ పెట్టాడట. ఇంతకీ ఆ మెసేజ్ లో ఏముంది? నానికి జక్కన్న ఇచ్చిన సలహా ఏంటి?

PREV
15
డిఫరెంట్ గా ఆలోచిస్తున్న నాని..

టాలీవుడ్ లో నేచురల్ యాక్టింక్ అంటే నాని అందరికి గుర్తొస్తాడు. పక్కింటి కుర్రాడిలా.. మన ఇంట్లో అబ్బాయిలా.. ఆడియన్స్ మనసుకు చాలా దగ్గరగా ఉండే హీరో నాని. ఫ్యామిలీ ఆడియన్స్ లో నానికి ఉన్న క్రేజ్ మరే హీరోకు లేదనే చెప్పాలి. క్యూట్ లవ్ స్టోరీస్ తో పాటు, కుటుంబ కథా చిత్రల్లో నటిస్తూ..టాలీవుడ్ లో తనకంటూ ఓ స్పెషల్ మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు నేచురల్ హీరో. అయితే రాను రాను నాని సినిమాలు మోనాటనీ అనిపించి, బోర్ కొట్టించాయి. దాంతో రూట్ మార్చి కొత్తగా ట్రై చేస్తున్నాడు నాని.

25
రూట్ మార్చి కొత్తగా ట్రై చేస్తోన్న నాని..

నాని సినిమాలన్నీ మూస ధోరణిలో ఉంటున్నాయన్న పేరు వచ్చింది. దాంతో వరుసగా సినిమాలు ప్లాప్ అయ్యాయి. రెండు మూడు ఫెయిల్యూర్స్ చూసిన తరువాత తనను తాను మార్చుకున్నాడు స్టార్ హీరో.. కాస్త రూట్ మార్చి కొత్తగా ప్రయోగాలు చేస్తున్నాడు. అలా చేసిన వాటిలో దసరా మూవీ ఒకటి. నాని తన ఇమేజ్ కు పూర్తి భిన్నంగా ప్రయత్నించిన సినిమా ఇది. క్లాస్ హీరో పక్కా మాస్ లుక్ ట్రై చేస్తే ఎలా ఉంటుంది అనేది దసరా సినిమా చూస్తే అర్ధం అవుతుంది. ఈమూవీ కోసం ఎంతో కష్టపడ్డాడు నాని. ఇది ఒక్కటే కాదు శ్యామ్ సింగరాయ్, హిట్3, హాయ్ నాన్న, తాజాగా పారడైజ్.. ఇలా ప్రతీ సినిమా, చేసే ప్రతీ పాత్ర కొత్తదనం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు నాని. దాంతో నానీ రేంజ్ మారిపోయింది. హిట్ మీద హిట్ కోడుతూ.. టైర్ 1 హీరోల లిస్ట్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

35
రాజమౌళి కామెంట్స్..

నాని వరుస సక్సెస్ లు చూసిన రాజమౌళి.. నానికి ఓ పెద్ద మెసేజ్ పెట్టాడు.ఈ విషయాన్ని హిట్ సినిమా ఈవెంట్ లో స్వయంగా వెల్లడించారు జక్కన్న.  ఆయన మాట్లాడుతూ..'' నానికి ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు వస్తున్నాయి. ఎన్ని హిట్లు కొడుతున్నాడో నాకైతే గుర్తులేదు, నానికి అయినా గుర్తుందో లేదో.. అన్ని హిట్లు కొడుతున్నాడు. అయితే ఒక హిట్ సినిమా తరువాత నేను నానికి ఓ మెసేజ్ పెట్టాను.. నాని వెరీగుడ్ వరుసగా సక్సెస్ కొడుతున్నావు... చాలా హ్యాపీగా ఉంది.. అందరికి కావాల్సింది అదే.. బట్ ఇక్కడితో సరిపోదు.. నువ్వు ఇది దాటి ఇంకా సాధించాలి.. దాని కోసం నేను ఎదురు చూస్తున్నాను అని మెసేజ్ పెట్టాను. ఖచ్చితంగా సార్.. మీరు అనుకున్నది సాధిస్తాను అని రిప్లే ఇచ్చాడు.. చూస్తుంటే అంతకు మించి సాధిచేలా కానిపిస్తున్నాడు. నానితో సినిమా అంటే అది హిట్టే అనే రేంజ్ కు వచ్చాడు. ఇలానే ఇంకా ముందుకు వెళ్తాడని కోరుకుంటున్నాను '' అని అన్నారు రాజమౌళి.

45
నానితో జక్కన్న అనుబంధం...

రాజమౌళి స్టార్ హీరోలతో పాటు..చిన్న హీరోలతో కూడా సినిమాలు చేశారు. ఆయన విజన్ కు సరిపోయే హీరోలను సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తుంటాడు జక్కన్న. నానితో ఈగ సినిమా చేశాడు రాజమౌళి. ఈసినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికి తెలిసిందే. అంతే కాదు ఓ సారి నాని సినిమాలో చిన్న గెస్ట్ రోల్ కూడా చేశాడు స్టార్ డైరెక్టర్. నాని సినిమా ఈవెంట్స్ కు గెస్ట్ గా వెళ్లడం.. కెరీర్ లో ముందుకు వెళ్లడానికి.. ఎప్పటికప్పుడు నేచురల్ స్టార్ కు సలహాలు ఇస్తుంటాడు రాజమౌళి. ఈగ సినిమా నుంచి వీరి అనుబంధం కొనసాగుతోంది. ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ లాంటి స్టార్స్ తరువాత రాజమౌళి నానితోనే చాలా క్లోజ్ గా ఉంటుంటారు.

55
అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ట్ అయ్యి..

నాని హీరో అవ్వాలని అనుకోలేదు. టాలీవుడ్ లో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నారు. అనుకోకుండా హీరో అవకావం రావడంతో అష్టచమ్మ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టాడు నాని. ఈసినిమా హిట్ అవ్వడంతో వరుసగా అవకాశాలు వచ్చిపడ్డాయి. ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుని.. తన కెరీర్ ను అద్భుతంగా మలుచుకున్నాడు నాని, ఈక్రమంలో ఎన్నో అవమానాలు కూడా ఫేస్ చేశాడు స్టార్ హీరో. డైరెక్టర్ అవ్వాలనుకున్న తన కల నెరవేరకపోయినా.. నిర్మాతగా మారి.. హిట్ సినిమాలను నిర్మిస్తున్నాడు నాని. తాజాగా ఆయన నటించిన ప్యారడైజ్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories