శ్రియ సినిమా అవకాశం కోసం వెతుకుతున్నప్పుడు, ఆమె ఫోటో దర్శకుడు విక్రమ్ కుమార్ చేతికి చిక్కడంతో, ఆయన దర్శకత్వం వహించిన 'ఇష్టం' చిత్రంలో శ్రియను కథానాయికగా తీసుకున్నారు. ఈ చిత్రం 2001లో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో కలిసి నటించి ఓ ఊపు ఊపేసింది.
నాగార్జున సరసన 2002లో విడుదలైన `సంతోషం` చిత్రంలో నటించారు. ఈ సినిమా హిట్ కావడంతో పాపులర్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత బాలయ్య సరసన 'చిన్నకేశవ రెడ్డి', చిరంజీవితో `ఠాగూర్`, నాగ్‌తో `నేనున్నాను`, తరుణ్ సరసన 'నీవు నీవు' వంటి పలు చిత్రాల్లో నటించారు.