చిరు, బాలయ్య, మహేష్, నానీ, నితిన్.. స్టార్ హీరోలంతా షూటింగ్స్ తో బిజీ.. ఎక్కడెక్కడ షూటింగ్ చేస్తున్నారు..?

Published : Mar 14, 2022, 09:19 PM IST

స్టార్ హీరోలంతా ఎవరి షూటింగ్ బిజీలో వారు ఉన్నారు. పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకూ అంతా ఫుల్ బిజీ అయిపోయారు. ఒక్కొక్కళ్లు.. రెండు నుంచి ఐదు సినిమాలు ఖాతాలో వేసుకుని... ఒక్కొక్క సినిమను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. మరి ఏ స్టార్ ఎక్కడెక్కడ షూటింగ్ చేసుకుంటున్నారో చూద్దాం. 

PREV
19
చిరు, బాలయ్య, మహేష్, నానీ, నితిన్.. స్టార్ హీరోలంతా షూటింగ్స్ తో బిజీ.. ఎక్కడెక్కడ షూటింగ్ చేస్తున్నారు..?

మెగాస్టార్ చిరంజీవి ముంబయ్ లో.. బాలకృష్ణ,నానీ ఇలా హీరోలంతా లోకల్ గా తమ సినిమాలు పూర్తి చేస్తుంటే.. నాగార్జున, రవితేజ మాత్రం ఫారెన్ షెడ్యూల్స్ లో బిజీగా ఉన్నారు. a

29

మెగాస్టార్ చిరంజీవి ఐదు సినిమాలతో బిజీగా ఉన్నారు అందులో ఆచార్య కంప్లీట్ అవ్వగా.. గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ కోసం మెగాస్టార్ ముంబయ్ వెళ్లారు. అక్కడ ఎన్డీ స్టూడియోస్ లో సల్మాన్  తో కలిసి యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గోంటున్నారు

39

ఇక ఇక్కడ హైదరాబాద్ లో మెగాస్టార్ , బాబీ కాంబినేషన్ మూవీ షూటింగ్  అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుంది. అయితే మెగాస్టార్ లేకుండానే మిగతా ఆర్టిస్ట్ లతో ఇంపార్టెంట్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు బాబీ అండ్ టీమ్. 
 

49

ఇక నట సింహాం నందమూరి బాలకృష్ణ,మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈ మూవీ షూటింగ్ సిరిసిల్లలో స్టార్ట్ అయ్యి శంషాబాద్ చేరింది. ప్రస్తుతం ఇంపార్టెంట్ సీన్స్ ను శంషాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. 
 

59

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్ మూవీ సర్కారు వారి పాట. ఈ  సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. సూపర్ స్టార్ యాక్షన్ సీన్స్ ను ఇక్కడ తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. 

69

ఇక  కింగ్ నాగార్జున ఫారెన్ షూట్ లో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు, నాగ్  కాంబినేషన్ లో రూపొందుతున్న ఘోస్ట్ మూవీ షూటిగ్  దుబాయ్ లో జరుగుతుంది. దీనికి సంబంధించిన స్టిల్స్ ను రీసెంట్ గా  రిలీజ్ చేశారు టీమ్. 

79

మాస్ మహారాజ్ రవితేజ కూడా ఫారెన్ షెడ్యూల్లోనే బిజీగా ఉన్నాడు. యంగ్ హీరో  సుశాంత్ కాంబినేషన్ లో రవితేజ నటిస్తున్న సినిమా రామారావు అన్ డ్యూటీ. శరత్ మడవ డైరెక్షన్ ల్ తెరకెక్కుతోన్న ఈమూవీ షూటింగ్ స్పెయిన్ లో జరుగుతుంది.

89

నేచురల్ స్టార్ నాని కూడా వరుసగా సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్నాడు. ప్రస్తుతం నానీ డిఫరెంట్ క్యారెక్టర్ లోకనిపించబోతున్న సినిమా దసరా. ఈ సినిమా షూటింగ్  హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో  జరుగుతుంది.

99

మరో వైపు యంగ్ హీరోలు కూడా తమ షూటింగ్ నితిన్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా, ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఇలా స్టార్స్ అంతా తమ తమ షూటింగ్స్ లో బిజీ అయిపోయారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories