పునిత్ రాజ్ కుమార్ జేమ్స్ తో పాటు ఈవారం రిలీజ్ కాబోతున్న సినిమాలివే..

Published : Mar 14, 2022, 06:46 PM IST

ఈవారం ఓటీటీ కంటే థియేటర్లలోనే సినిమా రిలీజ్ లు ఎక్కువగా ఉన్నాయి. కరోనా భయం పూర్తిగా పోవడంతో పెద్ద సినిమాలతో పాటు.. చిన్న చిన్న సినిమాలు కూడా ఏదో ఒక టైమ్ చూసుకుని థియేటర్ రిలీజ్ కే మొగ్గు చూపిస్తున్నాయి.

PREV
16
పునిత్ రాజ్ కుమార్ జేమ్స్ తో పాటు ఈవారం రిలీజ్ కాబోతున్న సినిమాలివే..

ఈవారం థియేటర్స్ లో దివంగత కన్నడ పవర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్ జేమ్స్ తో పాటు మరికొన్ని తెలుగు సినిమాలు థియేటర్లను పలకరించబోతున్నాయి. కొన్ని థియేటర్ రిలీజ్ సినిమాలు కూడా ఓటీటీ గుమ్మం తొక్కబోతున్నాయి. 

26

దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్‌ నటించిన చివరి సినిమా జేమ్స్. చేతన్‌కుమార్‌ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కిశోర్‌ పత్తికొండ నిర్మించారు. పునిత్ కు భారీ నివాళి అర్పించాలని ఫ్యాన్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.ఈ సినిమాలో  పునీత్‌ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు.  తెలుగు ఫ్యామిలీ హీరో శ్రీకాంత్‌ ఈ మూవీలో విలన్‌గా నటించాడు. పునీత్‌ రాజ్‌కుమార్‌ జయంతిని పురస్కరించుకుని ఈ సినిమాను మార్చి 17న పాన్ ఇండియా రేంజ్ లో రీలీజ్ చేయబోతున్నారు. 

36

చాలా కాలంగా హిట్ కు దూరంగా ఉన్నాడు యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌. ఎన్ని ప్రయత్నాలు చేసినా హిట్ సినిమా చేయలేకపోతున్నాడు. ఇక మరో ప్రయత్నంగా  వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా స్టాండప్‌ రాహుల్‌. శాంటో మోహన్‌ వీరంకి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను నందకుమార్‌ అబ్బినేని, భరత్‌ మాగలూరి నిర్మించారు. స్టాండప్‌ కామెడీ విత్ లవ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 18న రిలీజ్ కాబోతోంది. 
 

46

బిగ్ బాస్ ఫేమ్ అమిత్‌ తివారి, భానుశ్రీ జంటగా నటించిన సినిమా నల్లమల. రవి చరణ్‌ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తెరకెక్కించిన ఈ సినిమాలో నాజర్‌, తనికెళ్ల భరణి, కాలకేయ ప్రభాకర్‌, అజయ్‌ ఘోష్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను మార్చి 18న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన  టీజర్‌ తో పాటు పాటకు మంచి స్పందన వచ్చింది.కరోనా వల్ల డిలై అవుతూ వచ్చింది ఈ సినిమా రిలీజ్.  

56

ఇక బాలీవుడ్ విషయానికి వస్తే.. స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌, కృతి సనన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా బచ్చన్‌ పాండే. తమిళంలో సూపర్ సక్సెస్ సాధించిన జిగర్తాండ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిందిమూవీ. ఈ మూవీ మార్క్ 18న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇక ఇదే సినిమా తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా గద్దలకొండ గణేశ్‌ టైటిల్ తో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక బాలీవుడ్ స్క్రీన్ పై సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి. 

66

ఇక ఈ వారం ఓటీటీలో తెలుగు సినిమాల సందడి తక్కువే అనుకోవాలి. ముఖ్యగా ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ లు చాలా వరకు తగ్గాయి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో. ఈ వారం ఒకే ఒక సినిమా ఆహా ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన సెబాస్టియన్ మూవీ 18న ఆహాల్ స్ట్రీమింగ్ కాబోతోంది. మార్చ్ 4న రిలీజ్ అయిన ఈసినిమ కిరణ్ కు హ్యాట్రిక్ హిట్ ఇస్తుంది అనుకుంటే నిరాశపరిచింది. 

click me!

Recommended Stories