Rajamouli on Bahubali 3: `బాహుబలి3`పై జక్కన్న క్లారిటీ.. మహేష్‌ చిత్రం తర్వాత అదేనా?

Published : Mar 14, 2022, 09:19 PM IST

దర్శకధీరుడు రాజమౌళి `బాహుబలి 3`పై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రమోషన్‌లో బిజీగా ఉన్న ఆయన `బాహుబలి` మూడో పార్ట్ పై స్పందించారు. పూనకాలు తెప్పించే అప్‌డేట్‌ ఇచ్చారు. 

PREV
16
Rajamouli on Bahubali 3: `బాహుబలి3`పై జక్కన్న క్లారిటీ.. మహేష్‌ చిత్రం తర్వాత అదేనా?

`బాహుబలి`(Bahubali) తెలుగు సినిమా సత్తాని, ఇండియన్‌ సినిమా స్టామినాని ప్రపంచానికి చాటిన చిత్రం. దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) అద్భుతమైన ఆవిష్కరణకి ప్రతిరూపం. విజువల్‌ వండర్‌గా, కలెక్షన్ల పరంగానూ సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేసింది. కలెక్షన్ల విషయంలో ఇప్పట్లో మరే సినిమా `బాహుబలి`ని రీచ్‌ కాలేదనేంతగా నిలిచింది. `బాహుబలి 2` చిత్రం ఏకంగా 1800కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. 

26

ప్రభాస్‌.. బాహుబలి, మహేంద్ర బాహుబలిగా ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నారు. యోధుడి తరహా నటనలో విశ్వరూపం చూపించారు. రానా సైతం భల్లాలదేవగా నెగటివ్‌ రోల్‌లో కనువిందు చేశారు. మరోవైపు అనుష్క, తమన్నాలు సైతం గ్లామర్‌ వైపు, యాక్షన్‌ సైడ్‌ ఆకట్టుకున్నారు. సినిమాకి కట్టప్ప పాత్రలో సత్యరాజ్‌ ప్రాణంగా నిలిచారు. రమ్యకృష్ణ శివగామి పాత్రలో విశ్వరూపం చూపించారు. సంగీతం, విజువల్స్, యాక్షన్‌ ఎపిసోడ్‌ ఇలా అన్ని కలగలిపి వండర్‌ క్రియేట్‌ చేశాయి. 

36

దాదాపు ఐదేళ్లపాటు రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఇప్పుడు మరోసారి `బాహుబలి`కి సంబంధించిన చర్చ తెరపైకి వచ్చింది. `బాహుబలి 3`(Bahubali3) ఉండే ఛాన్స్ ఉందన్న ప్రశ్నకి రాజమౌళి స్పందించారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రమోషన్‌లో భాగంగా ఆయన ఈ సినిమాపై స్పందించారు. ఏదైనా జరగొచ్చనే విషయాన్ని తెలిపారు. కచ్చితంగా `బాహుబలి 3` ఆశించవచ్చని చెప్పారు. బాహుబలి పాత్ర చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు తదుపరి `బాహుబలి`(పార్ట్ 3)లో చూపించనున్నామని చెప్పారు. 

46

అయితే దీనికి సంబంధించిన వర్క్ కూడా జరుగుతుందని రాజమౌళి చెప్పడం విశేషం. నిర్మాత శోభు యార్లగడ్డ ఈ విషయంలో పాజిటివ్‌గా ఉన్నారని, కాకపోతే ఈ సినిమా చేయడానికి ఇంకాస్త టైమ్‌ పడుతుందన్నారు. మహిష్మతి రాజ్యం నుంచి ఆసక్తికరమైన వార్త రానుందని చెప్పారు. అదే సమయంలో `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie) తర్వాత మహేష్‌తో సినిమా ఉంటుందని చెప్పారు. ఈ సినిమా కథకి సంబంధించిన వర్క్ జరుగుతుందని చెప్పారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` రిలీజ్‌ తర్వాత మహేష్‌తో చేయబోయే సినిమాపై దృష్టిపెడతానని చెప్పారు జక్కన్న. దీంతో త్వరలో మరో వండర్‌ని చూడబోతున్నామనే విషయాన్ని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. 
 

56

ఇదిలా ఉంటే ఇటీవల `రాధేశ్యామ్‌` ప్రమోషన్‌లో ఇదే ప్రశ్న ప్రభాస్‌(Prabhas)కి ఎదురైంది. దీనిపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కూడా `బాహుబలి 3` చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. `బాహుబలి` తన మనసుకి దగ్గరైన చిత్రమని చెప్పారు. తన కెరీర్‌లో అంతటి ప్రభావాన్ని చూపించినచిత్రమదన్నారు. `బాహుబలి 3` జరుగుతుందా? లేదా అనేది తెలియదని, జరిగితే బాగుంటుందన్నారు. రాజమౌళి అనుకుంటే `బాహుబలి 3` సాధ్యమే అని తెలిపారు ప్రభాస్‌. 

66

ఇప్పటికీ తనని చాలా మంది `బాహుబలి` ప్రభాస్‌గానే పిలుస్తుంటారు. వారి మనసులో తాను బాహుబలిగా ముద్ర పడిపోయానని, ఈ సినిమా ప్రభావం ఆడియెన్స్ పై కూడా చాలా ఉందని, అందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇటీవల `రాధేశ్యామ్‌`తో ఆడియెన్స్ ముందుకొచ్చి బాక్సాఫీసు వద్ద పోరాడుతున్న ప్రభాస్‌.. ప్రస్తుతం `సలార్‌`, `ఆదిపురుష్‌`, `ప్రాజెక్ట్ కే` చిత్రాల్లో నటిస్తున్నారు. దీంతోపాటు మారుతితో ఓ మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని చేయబోతున్నారు. అలాగే `స్పిరిట్‌` అనే మూవీని సందీప్‌ రెడ్డి వంగాతో చేయనున్నారు ప్రభాస్‌. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories