మెగాస్టార్ కు డూప్ గా నటించిన స్టార్ కమెడియన్, చిరంజీవిలా కనిపించే ఆనటుడు ఎవరు..?

Published : Feb 27, 2024, 10:41 AM IST

ప్రతీ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు డూప్ లుక కామన్. అయితే ఈ డూప్ ల పాత్ర ఎప్పుడూ తెరవెనుకనే. వారు ఎవరో కూడా జనాలకు తెలియదు. కాని కొన్ని సందర్భాల్లో ఒక స్టార్ హీరోకు ..మరో స్టార్ యాక్టర్ కూడా డూప్ గా నటించిన సందర్భాలు ఉన్నాయి. 

PREV
16
మెగాస్టార్ కు డూప్ గా నటించిన స్టార్ కమెడియన్, చిరంజీవిలా కనిపించే ఆనటుడు ఎవరు..?

సాధారణంగా స్టార్ హీరోలకు ప్రతీ సినిమాలో డూప్ లు ఉంటారు. రిస్క్ షాట్స్ ను తీయడానికి ట్రైయినింగ్ అయ్యి ఉన్న ప్రోఫిషినల్స్ ను  డూప్ లు గా పెట్టుకుంటారు మేకర్స్. అయితే కొన్నిసందర్భాల్లో స్టార్ హీరోల డేట్స్ టైట్ అయినప్పుడు కొన్ని  కొన్ని బ్యాక్  ఫ్రేమ్స్ కాని.. లాంగ్ షార్ట్స్ కాని డూప్ లను పెట్టి మ్యానేజ్ చేస్తుంటారు దర్శకులు. అలా మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ఎక్కువగా డూప్ లను వాడిన సందర్భాలు ఉన్నాయి. 
 

26

అయితే స్టార్ హీరోల డూప్ లు గా ఉన్నవారు బయట ప్రపంచానికితెలియదు. తెర మీద ఉన్నా..వారిపాత్ర తెరవెనుకే అని చెప్పాలి. కాని కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో స్టార్ హీరోలకు స్టార్ యాక్టర్లు డూప్ లు గా చేసిన సందర్భాలుఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవికి డూప్ గా టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఒకరు నటించారట. ఈ విషయాన్ని ఆ కామెడియన్ రీసెంట్ గా వెల్లడించారు. ఇంతకీ ఆ కమెడియన్ మెగాస్టార్ డూప్ గా చేసని సినిమా ఏదో కాదు రామ్ చరణ్ సూపర్ హిట్ మూవీ మగధీ

36

టాలీవుడ్ ఇండస్ట్రీలోని బ్లాక్ బస్టర్ హిట్ లలో మగధీర సినిమా ఒకటి .. ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించి నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. మగధీర మూవీలో మెగాస్టార్ చిరంజీవి కూడా కొన్ని నిమిషాల పాటు  సందడి చేవారు. ఇందులో ఆయన పాట కూడా రీమిక్స్ చేశారు. కాగా ఈ పాట లో కనిపించిన చిరంజీవి  డేట్స్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయట. దాంతో అందులో కొన్సి సీన్స్ ను .. ఈ సినిమాలోనే నటించిన  ప్రముఖ కమెడీయన్ ప్రభాస్ శ్రీనుతో తీశారట. 

46

ఇక ఈ విషయాన్ని ప్రభాస్ సీను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీనితో పాటు పలు ఆసక్తి కర విషయాలు కూడా వెల్లడించాడు ప్రభాస్ శ్రీను. తాను మగధీర మూవీలో చిరంజీవి గారికి డూప్ చేశానని..  మెగాస్టార్ డూప్ గా చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు  ప్రభాస్ శ్రీను వెల్లడించారు. ప్రభాస్ ఇంట్లో ఎక్కువగా టైమ్ పాస్ చేశేవారమని చెప్పిన శ్రీను.. ఓ నైట్ డార్లింగ్ ఇంట్లో గేమ్స్ ఆడుతుండగా రాజమౌళి ఫోన్ చేసి.. మగధీర ఆఫర్ ఇచ్చారన్నారు. 
 

56

అంతే కాదు ఆ సినిమాలో నా డ్రెస్.. చిరంజీవి వేసుకొన్న డ్రెస్ ఒకటేనని ప్రభాస్ శ్రీను అన్నారు. ఆ డ్రెస్ ను దాచుకోవాలని అనుకున్నానని. కాని ఆతరువాత అది తనకు దొరకలేదన్నారు. ఇక షూటింగ్ టైమ్ లో  చిరంజీవి వస్తుంటే తాను అక్కడి నుంచి  పారిపోయేవాడినని  అని వెల్లడించారు ప్రభాస్ శ్రీను.  వెల్లడించారు.  
 

66

ప్రస్తుతం ప్రభాస్ శ్రీను చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నారు ప్రభాస్ శ్రీను. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అసిస్టెంట్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆయనప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు శ్రీను.ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు ప్రభస్ శ్రీను. 

Read more Photos on
click me!

Recommended Stories