Guppedantha Manasu
Guppedantha Manasu 27th February Episode:ఫణీంద్ర దగ్గరకు వెళ్లి వచ్చిన తర్వాత ఏం జరిగిందని మహేంద్రను వసుధార అడుగుతుంది. కానీ ఏమీ లేదని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. వసుధార వదిలిపెట్టకపోవడంతో.. మహేంద్రకు ఒంట్లో బాలేదని.. అందుకే వెళ్లివచ్చాను అని చెబుతాడు. మరి, మమ్మల్ని ఎందుకు వద్దు అన్నాడు అని వసు అడిగితే.. కాలేజీ డిస్టర్బ్ అవుతుందని వద్దు అని చెప్పాను అని కవర్ చేస్తాడు. వీళ్ల మాటలను దూరం నుంచి మను వింటూనే ఉంటాడు.
Guppedantha Manasu
సీన్ కట్ చేస్తే... మహేంద్ర చెప్పిన మాటలు వసుధారకు నమ్మసక్యంగా అనిపించవు. దీంతో... ఏం జరిగి ఉంటుందా అని చాలా సేపు ఆలోచిస్తుంది. అక్కడ ఏం జరిగిందో ఎలా తెలుసుకోవాలా అని ఆలోచించి.. తర్వాత ధరణికి ఫోన్ చేయాలని అనుకుంటుంది. కానీ అప్పటికే.. ధరణి ఫోన్ శైలేంద్ర దగ్గర ఉంటుంది. వసు ఫోన్ చేయడంతో ఆ ఫోన్ పట్టుకొని శలేంద్ర వసుధార దగ్గరకు వస్తాడు.
Guppedantha Manasu
నా భార్యతో ఏం మాట్లాడాలి..? వంటింటి టిప్స్ కావాలా? లేక ఇంట్లో సీక్రెట్స్ కావాలా అని అడుగుతాడు. దానికి వసుధార ఏం ప్లాన్ చేశావ్..? ఈ సారి ఎవరిని చంపుదాం అనుకుంటున్నావ్ అని సీరియస్ గా అడుగుతుంది. దానికి శైలేంద్ర.... చంపడం ఎందుకు చనిపోయిన వాళ్ల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను అని చెబుతాడు. ఫణీంద్రసర్ మామయ్యను ఎందుకు పిలిచాడో మర్యాదగా చెప్పు అని వసు అడుగుతుంది. కానీ... వెళ్లి బాబాయ్ నే మరోసారి అడుగు, చెబుతాడేమో అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వీళ్ల ఈ డిస్కషన్ కూడా దూరం నుంచి మను వినడం విశేషం.
Guppedantha Manasu
ఇక, ఇంట్లో ధరణి టెన్షన్ పడుతూ ఉంటుంది. వీళ్ల కుట్ర కారణంగా చిన్న మామయ్య, వసుధారల మధ్య అభిప్రాయ బేధాలు వచ్చేస్తాయి. ఎలాగైనా ఈ విషయం వసుధారకు చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. ఫోన్ ఎలా చేయాలా అని చూస్తుండగా దేవయాణి ఫోన్ కనపడుతుంది. అత్తయ్యగారు వచ్చేలోగా ఈ ఫోన్ నుంచి వసుధారకు కాల్ చేసి విషయం చెప్పాలని ఫోన్ అందుకుంటుంది. అప్పుడే దేవయాణి వచ్చి.. పోన్ లాక్కుంటుంది.
Guppedantha Manasu
ఎవరికి ఫోన్ చేస్తున్నావ్ అని అడుగుతుంది. నాకు తెలుసు నువ్వు ఆ వసుధారకు ఫోన్ చేయాలని అనుకుంటున్నావ్ అని, నీకు అందుబాటులో ఉండాలనే ఫోన్ ఇక్కడ పెట్టాను అని చెబుతుంది. పాపం ధరణి చాలా బతిమిలాడుతుంది. వసుకి రిషి అంటే ప్రాణం అని, ఎప్పటికైనా రిషి తిరిగి వస్తాడనే భ్రమలో బతుకుతోందని, కానీ.. ఇలా ఇబ్బంది పెట్టొద్దని, రేపు మీరు ఇలా చేస్తున్నారని తెలిస్తే వసుధార గుండె ఆగిపోతుంది అని ధరణి అంటుంది. తమకు కావాల్సింది కూడా అదేనని.. వసుధార లేకపోతే ఎండీసీటు దక్కించుకోవడం మాకు చాలా సులభం అవుతుంది అని అంటుంది. ఆ మాటలకు ధరణి చాలా బాధపడుతుంది.
Guppedantha Manasu
ఇక.. వసుధార ఈ విషయం గురంచే కాలేజీలో ఆలోచిస్తూ ఉంటుంది. టైమ్ అయిపోవడంతో కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరుతుంది. తాను వెళ్తున్నప్పుడు మను కనపడతాడు. వెంటనే మను దగ్గరకు వెళ్లి తాను చెప్పిందాని గురించి ఏం ఆలోచించావ్ అని అడుగుతుంది. ఏ విషయం అని మను ఆశ్చర్యంగా అడుగుతాడు. ఫైల్లో సంతకం గురించి అని గుర్తు చేస్తుంది. అయితే.. ఆ విషయంలో నేను క్లారిటీగానే ఉన్నాను అని మను అంటాడు. మీరు ఫైల్ మొత్తం చెక్ చేస్తారు కాబట్టి.. మీరు సంతకం పెడితే.. అది నమ్మకంగా ఉంటుందని.. ఆ తర్వాతే నేను సంతకం చేస్తాను అని మను అంటాడు. వసు మాత్రం నిర్ణయం మార్చుకోమని, తనకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది. కానీ.. తనకు సారీ చెప్పే ఉద్దేశం లేదని మను చెబుతాడు. దీంతో.. కోపంగా కారు ఎక్కి ఇంటికి వెళ్తుంది.
Guppedantha Manasu
ఇక.. ఇంటికి వెళ్లిన తర్వాత మహేంద్ర.. ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. తన అన్న ఫణీంద్ర చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వసుధార వచ్చి పక్కన కూర్చొని.. మరోసారి అదే విషయం అడుగుతుంది. కాలేజీలోనే ఏమీలేదని చెప్పాను కదా అని మహేంద్ర అంటే... వసుధార వదిలిపెట్టదు. శైలేంద్ర మరోసారి బాబాయ్ ని అడుగు అన్నాడని చెబుతుంది. అయితే.. వాడొక దుర్మార్గుడు అని.. మనిద్దరి మధ్య గొడవలు రావాలని అలా చేస్తున్నాడని కవర్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ.. శైలేంద్ర ఏదో కుట్ర చేస్తున్నాడని.. కానీ మామయ్యకు తెలిసినా తనకు ఎందుకు చెప్పడంలేదో అర్థం కావడం లేదని వసుధార అనుకుంటుంది. లేకపోతే ధరని ఫోన్ శైలేంద్ర ఎందుకు తీసుకుంటాడు అని అనుకుంటుంది. ఈ విషయం రేపు ఎలాగైనా తెలుసుకోవాలని అనుకుంటుంది.
Guppedantha Manasu
మరోవైపు ఇంట్లో ఫణీంద్ర,శైలేంద్ర, దేవయాణి, ధరని కూర్చొొని ఉంటారు. అప్పుడు రేపటి కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ఫణీంద్ర ఆరా తీస్తాడు. అన్నీ తాను చూసుకుంటున్నాను అని దేవయాణి చెబుతుంది. గతంలో రిషి, వసు లను గుర్తు తెచ్చుకొని ఫణీంద్ర బాధపడతాడు. ఎలా ఉండాల్సిన ఇల్లు ఎలా అయిపోయిందని ఫీలౌతాడు. రిషి గురించి ఆలోచించి తన గుండె కూడా ఆగిపోతోందేమో అని అంటాడు. అతని బాధ చూసి.. దేవయాణి, శైలేంద్ర చేస్తున్న కుట్ర గురించి బయటపెట్టాలని ధరణి అనుకుంటుంది. కానీ... ధరణి నోట్లో నుంచి మాట బయటకు రాకుండా.. దేవయాణి మాట మార్చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.