మంచు మనోజ్ ని పెళ్లి చేసుకోమని మోహన్ బాబు అడిగినా నో చెప్పిన నటి.. ఎందుకు అలా చేసిందంటే..

Published : Feb 27, 2024, 10:08 AM ISTUpdated : Feb 27, 2024, 11:50 AM IST

చిత్ర పరిశ్రమలో చాలా విషయాలు జరుగుతుంటాయి. కానీ కొన్ని మాత్రమే ప్రజలకు తెలుస్తుంటాయి. మంచు మనోజ్ గతంలో పర్సనల్ లైఫ్ లో కూడా సమస్యలు ఎదుర్కొన్నాడు.

PREV
16
మంచు మనోజ్ ని పెళ్లి చేసుకోమని మోహన్ బాబు అడిగినా నో చెప్పిన నటి.. ఎందుకు అలా చేసిందంటే..

చిత్ర పరిశ్రమలో చాలా విషయాలు జరుగుతుంటాయి. కానీ కొన్ని మాత్రమే ప్రజలకు తెలుస్తుంటాయి. మంచు మనోజ్ గతంలో పర్సనల్ లైఫ్ లో కూడా సమస్యలు ఎదుర్కొన్నాడు. గత ఏడాది మంచు మనోజ్.. భూమా మౌనికని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

26

ప్రస్తుతం ఈ జంట సంతోషంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అన్యోన్యంగా జీవిస్తూ కొత్త లైఫ్ ని ప్రారంభించారు. మంచు మనోజ్, భూమా మౌనిక వివాహంపై చాలా రూమర్స్ వినిపించాయి. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయినా మంచు మనోజ్ మౌనికని వివాహం చేసుకుంటున్నాడు అని కామెంట్స్ వినిపించాయి. అయితే మంచు లక్ష్మి దగ్గరుండి మనోజ్ మౌనికలకు వివాహం చేసింది. 

 

36

మంచు మనోజ్ పెళ్లి విషయం గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. అయితే మంచు మనోజ్ పెళ్లి విషయంలో మరో కోణం బయటకి వచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ శ్రేష్ఠ మోహన్ బాబు నటించి నిర్మించిన మేజర్ చంద్రకాంత్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ ఇలా చాలా మంది హీరోల చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించింది. 

46

మేజర్ చంద్రకాంత్ చిత్రంలో మంచు మనోజ్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అప్పటి నుంచి వీరిద్దరికి పరిచయం ఉంది. శ్రేష్ఠ యుఎస్ లో చదువుకుని ఇండియా తిరిగి వచ్చారు. ఇప్పుడు ఆమె గ్లామర్ గా ఉన్నప్పటికీ కాస్త బొద్దుగా ఉంది. 

56

అయితే తాజా ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకి శ్రేష్ఠ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. మంచు ఫ్యామిలీ నుంచి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది అంట కదా అని అడిగితే.. సిగ్గు పడుతూ దాని గురించి ఇప్పుడు వద్దులే అని బదులిచ్చింది. యాంకర్ చెప్పమని మరోసారి రిక్వస్ట్ చేయడంతో అవును వచ్చింది.. మంచు మనోజ్ ని చేసుకోమని అప్రోచ్ అయినట్లు తెలిపింది. 

66

ఎవరు అప్రోచ్ అయ్యారు అని అడిగితే.. మోహన్ బాబు గారే మా పేరెంట్స్ ని ఇంటికి వచ్చి అడిగారు.అని తెలిపింది.కానీ తానే నో చెప్పినట్లు పేర్కొంది. ఎందుకు అని ప్రశ్నించగా ఆమె ఇప్పుడు అవన్నీ వద్దు అంటూ దాటవేసింది. అయితే మంచు మనోజ్ ని చేసుకోమనీ మోహన్ బాబు మొదటి పెళ్లి కోసం అడిగారా లేక రెండవ పెళ్లా అనేది క్లారిటీ లేదు. మొదటి భార్యతో విడిపోయిన తర్వాత మంచు మనోజ్.. భూమా మౌనికని రెండవ వివాహం చేసుకున్నారు. శ్రేష్ఠ చిన్నతనంలో సమరసింహారెడ్డి, హిట్లర్, రౌడీ అల్లుడు లాంటి చిత్రాల్లో నటించింది. 

Read more Photos on
click me!

Recommended Stories