Sankranthi Winners List: 2013 టు 2023...ఈ దశాబ్దపు టాలీవుడ్ సంక్రాంతి విన్నర్స్ వీరే!

First Published Jan 15, 2023, 4:19 PM IST

సంక్రాంతి సినిమాలు ఆడియన్స్ కి ఎప్పుడూ ప్రత్యేకమే. పెద్ద పండగకు ఇంటిల్లిపాది థియేటర్స్ కి క్యూ కడతారు. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సదరు సినిమాలకు వసూళ్ల వర్షం కురుస్తుంది. 
 

Sankranthi Movies

సినిమా కొంచెం అటూ ఇటుగా ఉన్న సంక్రాంతి(Sankranthi 2023) బరిలో దిగితే మినిమమ్ వసూళ్లు గ్యారంటీ. అందుకే మేకర్స్ ఈ సీజన్ ని టార్గెట్ చేస్తారు. పలువురు స్టార్స్, టైర్ టూ హీరోలు  సంక్రాంతి బరిలో దిగి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. ప్రతి ఏడాది నాలుగైదు చిత్రాలు కచ్చితంగా విడుదలవుతాయి. కానీ విన్నర్ మాత్రమే ఒకటే అవుతుంది. గత దశాబ్ద కాలంలో సంక్రాంతికి విడుదలైన చిత్రాలు ఏమిటో? అత్యధిక వసూళ్ళలో విన్నర్స్ గా నిలిచిన వారెవరో? చూద్దాం...


 2013 సంక్రాంతికి రామ్ చరణ్ నాయక్, మహేష్-వెంకటేష్ ల మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విడుదలయ్యాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సూపర్ హిట్ టాక్ తో సంక్రాంతి విన్నర్ అయ్యింది. 


 2014 సంక్రాంతి రేసులో మహేష్, చరణ్ పోటీపడ్డారు. భారీ అంచనాల మధ్య విడుదలైన వన్ నేనొక్కడినే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో యావరేజ్ గా ఉన్న  'ఎవడు' విన్నర్ గా నిలిచింది. 

2015లో ఎలాంటి పోటీ లేకుండా వెంకీ-పవన్ ల మల్టీస్టారర్  గోపాలా గోపాలా విడుదలైంది.యావరేజ్ టాక్ తెచ్చుకున్న గోపాలా గోపాలా సంక్రాంతి విన్నర్ అయ్యింది.
 


 2016లో నాలుగు చిత్రాలు సంక్రాంతికి పోటీ పడ్డాయి. బాలకృష్ణ నటించిన డిక్టేటర్, శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా ప్లాప్ అయ్యాయి.  పక్కా సంక్రాంతి చిత్రం సోగ్గాడే చిన్నినాయనా 2016 సంక్రాంతి విన్నర్ అయ్యింది. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో హిట్ స్టేటస్ అందుకుంది. 
 


చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి బాలకృష్ణ సంక్రాంతికి పోటీపడ్డారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన చిరంజీవి 2017లో కమ్ బ్యాక్ ఇచ్చాడు. చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 . బాలయ్య గౌతమీ పుత్ర శాతకర్ణి విడుదలయ్యాయి. అత్యధిక వసూళ్లతో ఖైదీ నెంబర్ 150 విన్నర్ గా నిలిచింది. గౌతమీ పుత్ర శాతకర్ణి  హిట్ స్టేటస్ అందుకుంది. శర్వానంద్ నటించిన శతమానం భవతి సైతం సూపర్ హిట్ కొట్టింది. సంక్రాంతి చిత్రాల్లో మూడు హిట్ అయ్యాయి. 

2018లో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, బాలకృష్ణ జై సింహ, రాజ్ తరుణ్ రంగులరాట్నం విడుదలయ్యాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన అజ్ఞాతవాసి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. రంగులరాట్నం కి కూడా నెగిటివ్ టాక్. యావరేజ్ కంటెంట్ మూవీ జై సింహ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. 

2019 సంక్రాంతికి చరణ్ వినయ విధేయ రామ, బాలయ్య  ఎన్టీఆర్ కథానాయకుడు, వెంకీ-వరుణ్ ల మల్టీస్టారర్ ఎఫ్ 2 విడుదలయ్యాయి. అనూహ్యంగా ఎఫ్2 విన్నర్ అయ్యింది. 
 

 2020లో అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు, ఎంత మంచివాడవురా విడుదలయ్యాయి. కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా ప్లాప్ కాగా... మహేష్, అల్లు అర్జున్ చిత్రాలు రెండూ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఎక్కువ వసూళ్లతో అల్లు అర్జున్ సంక్రాంతి విన్నర్ అయ్యాడు. 


 2021లో రవితేజ క్రాక్ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఆ ఏడాది రామ్ పోతినేని రెడ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ తో పాటు సైకిల్, మెయిల్ అనే రెండు చిన్న చిత్రాలు విడుదలయ్యాయి. రెడ్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అల్లుడు అదుర్స్ ప్లాప్ అయ్యింది. బ్లాక్ బస్టర్ టాక్ తో క్రాక్ సంక్రాంతి విన్నర్ అయ్యింది. 


 కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో 2022లో బంగార్రాజు, హీరో, రౌడీ బాయ్స్, సూపర్ మచ్చి చిత్రాలు విడుదలయ్యాయి. చిన్న చిత్రాల మధ్య విడుదలైన పెద్ద చిత్రం యావరేజ్ టాక్ తో సంక్రాంతి విన్నర్ అయ్యింది. 
 

ఇక ఈ ఏడాది సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, కళ్యాణం కమనీయం చిత్రాలు దిగాయి. మూడు చిత్రాలకు మిక్స్డ్ టాక్ వచ్చింది. పండగ నేపథ్యంలో వసూళ్లు బాగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. విన్నర్ ఎవరనేది త్వరలో తేలనుంది. 

click me!