2023 సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ తారలు సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూ తమ అభిమానులకు ఫెస్టివల్ ట్రీట్ అందిస్తున్నారు. అలాగే మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నెట్టింట సందడి చేస్తున్నారు.
ఈ సందర్భంగా తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా చీరకట్టులో మెరిసింది. ఇటీవల ట్రెండీ వేర్స్ లో దుమ్ములేపుతున్న ఈ అచ్చమైన తెలుగమ్మాయి పండగవేళ శారీ లుక్ లో దర్శనమివ్వడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఈషా మోడ్రన్ లుక్ లో కంటే.. సంప్రదాయ దుస్తుల్లోనే అందంగా ఉంటుందని, అభిమానులు కూడా ఆమెను ట్రెడిషనల్ వేర్స్ లోనే చూసేందుకు ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలో ఈషా పండగవేళలో ఇలా పద్ధతిగా తయారవుతూ కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది.
ఫొటోలను పంచుకుంటూ అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. మరోవైపు ఫ్యాన్స్, నెటిజన్లు కూడా ఈ బ్యూటీకి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆ బ్యూటీని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.
తాజాగా ఈషా పోస్ట్ చేసిన పిక్స్ ను ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇన్ స్టాలో 2.3 మిలియన్ ఫాలోవర్స్ ను దక్కించుకున్న ఈ బ్యూటీ ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో మరింత క్రేజ్ దక్కించుకుంటోంది.
చిన్న సినిమాల్లో లీడ్ యాక్ట్రస్ గా నటిస్తూ వస్తోంది ఈషా రెబ్బా. టాలీవుడ్ లో అందరిలాగే ఈ తెలుగు బ్యూటీకి కూడా చెప్పుకోదగినంతగా అవకాశాలు రావడం లేదు. దీంతో తమిళ చిత్రాల్లో తన అద్రుష్టాన్ని పరీక్షించుకుంటోంది. కోలీవుడ్ లో ప్రస్తుతం రెండు, మూడు చిత్రాల్లో నటిస్తోంది.