ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత వేదరాజు టింబర్‌ కన్నుమూత.. ఆయన ఏ సినిమాలు నిర్మించారంటే?

Published : Jan 31, 2025, 10:18 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత వేద రాజు టింబర్‌ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచారు.  

PREV
12
ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత వేదరాజు టింబర్‌ కన్నుమూత.. ఆయన ఏ సినిమాలు నిర్మించారంటే?

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత కన్నుమూశారు. అల్లరి నరేష్‌తో `మడత కాజా`, `సంఘర్షణ`(పోరాలి) వంటి చిత్రాలను నిర్మించిన నిర్మాత వేదరాజు టింబర్‌(54) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. నిర్మాత వేదరాజు భౌతిక కాయానికి నేడు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. 
 

22

వేద రాజు టింబర్‌ ఓ వైపు వ్యాపార రంగంలో ఉన్నారు. ఆయన కన్‌ స్ట్రక్షన్‌ రంగంలో బిజీగా ఉంటూనే సినిమాలపై అభిరుచితో నిర్మాతగా మారారు. అల్లరి నరేష్‌తో సినిమాలు తీశారు. `మడతా కాజా`, అలాగే `సంఘర్షణ` చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. దీంతోపాటు ఇప్పుడు మరో సినిమాని నిర్మించేందుకు రెడీ అవుతున్నారు.

ఈ క్రమంలోనే ఆయన కన్నుమూయడం అత్యంత విచారకరం. త్వరగా కోలుకుని ఇంటికి ఆరోగ్యంగా తిరిగి వస్తారని కుటుంబ సభ్యులు భావించారు. కానీ ఇంతలోనే ఇంతటి విషాదం చోటు చేసుకుంది. నిర్మాత వేద రాజు మృతి పట్ల చిత్ర పరిశ్రమ పెద్దలు, ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 

అల్లరి నరేష్‌ హీరోగా రూపొందిన `మడత కాజా`(2011) చిత్రానికి సీతారామరాజు దంతులూరి దర్శకుడు. రొమాంటిక్‌ కామెడీగా ఈ చిత్రం రూపొందింది. ఇందులో స్నేహా ఉల్లాల్‌ హీరోయిన్‌. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి ఆదరణపొందింది.

అదే ఏడాది వేదరాజు టింబర్‌ తమిళంలో యాక్షన్‌ థ్రిల్లర్‌ `పోరాలి`(సంఘర్షణ) చిత్రాన్ని నిర్మించారు. ఇందులో అల్లరి నరేష్‌తోపాటు స్వాతి రెడ్డి, నివేతా థామస్‌, వసుందరా కాశ్యప్‌, సూరి, గాంజా కరుపు ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి సముద్రఖని దర్శకుడు కావడం విశేషం. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories