కర్నూలు జిల్లాలోని పోతుగడ్డ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రేమ, రాజకీయాలు, డబ్బు.. ఈ మూడు అంశాల చుట్టూ తిరిగే ఈ కథలో ట్విస్టులు, టర్న్ లు ఆసక్తికరంగా ఉంటాయి.
థ్రిల్లర్ సినిమాలు సరిగ్గా డీల్ చేస్తే బోర్ కొట్టవు. అందులోనూ క్రైమ్ కలిసినప్పుడు అవి మరింత కిక్ ఇస్తాయి. అందుకేనేమో ఓటిటిలు ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్ వైపై మ్రొగ్గు చూపుతూంటాయి. తాజాగా ఈ జోనర్ లోనే తెలుగు నుంచి ఓ విలేజ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటిటిలోకి స్ట్రీమింగ్కి వచ్చింది. పోతుగడ్డ (Pothugadda)టైటిల్ తో రూపొందిన ఈ సినిమా కథేంటి, చూడదగ్గ సినిమానేనా, నిజంగానే థ్రిల్ ని పంచగలిగిందా వంటి విశేషాలు చూద్దాం.
24
Thriller drama, Pothugadda, Etv win Ott
'పోతుగడ్డ' కథేంటంటే:
అది ఎలక్షన్ సమయం. కర్నూలు జిల్లాలోని పోతుగడ్డ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలుకు రంగం సిద్దమవుతుంది. పదవిలో పదేళ్లుగా కొనసాగుతున్న పోతుగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే సముద్ర (ఆడుకాలం నరేన్) ఎలాగైనా మరోసారి సీట్ దక్కించుకోవాలని పట్టుదలగా ఉంటాడు. మరో ప్రక్క అతన్ని ఎలాగైనా ఓడించి ఎమ్మల్ేయ అవ్వాలని భాస్కర్ (శత్రు) నిర్ణయించుకుంటాడు. ఇద్దరూ పోటా పోటీగా ఉంటారు. భాస్కర్ డబ్బుని వెదజల్లి గెలవాలని, ఎన్నికల ముందు నుంచే కూడబెట్టడం మొదలుపెడతాడు.
అయితే, సముద్ర తక్కువవాడేం కాదు. మహిళలు, యూత్ ఓట్లకు గాలం వేయడానికి కూతురు గీత (విస్మయ శ్రీ)ని రంగంలోకి దింపాలనుకుంటాడు. ఆమెను పార్టీలో 'జిల్లా యూత్ ప్రెసిడెంట్' చేస్తాడు సముద్ర. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే గీతకు రాజకీయాలు అంటే నచ్చవు. తాను ప్రేమించిన అబ్బాయితో కృష్ణ (ఫృథ్వీ దండమూడి) కలిసి పారిపోవాలని ప్లాన్ వేస్తుంది. ఆ క్రమంలో ఓ ప్లాన్ వేసుకుని ఒకరోజు గీత, కృష్ణ ఇద్దరు కలిసి బస్సులో పారిపోతారు.
ఆ విషయం సముద్రకు తెలిసి తన మనుష్యులను వాళ్లను పట్టుకోమని, అవసరమైతే చంపేయమని పురమాయిస్తాడు. మ రో ప్రక్క వాళ్లు ఎక్కిన అదే బస్సులో భాస్కర్ తను పంచాల్సిన యాభై కోట్ల డబ్బుని కూడా దాచిపెడతాడు. ఆ విషయం పోలిస్ లకు తెలుస్తుంది. అప్పుడు ఏమైంది. ఆ జంట ప్రేమ గెలిచిందా. ఆ డబ్బు విషయం బయిటకు వచ్చిందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
34
Thriller drama, Pothugadda, Etv win Ott
ఎలా ఉంది
రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఓటీటీకి వచ్చిన లేటెస్ట్ ఈ సినిమా పేరుకే యాక్షన్ థ్రిల్లర్ కానీ అంత థ్రిల్స్ ఏమి లేవు. పరువు హత్య నేపథ్యంలో ఇంతకు ముందు చూసిన కథల్ని అటు ఇటు చెప్పే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. పెద్ద కొత్తగా ఏమీ అనిపించదు. ముఖ్యంగా సినిమాలో కోర్ ఎమోషన్ ని సరిగ్గా రిజిస్టర్ చెయ్యలేదు. వాళ్ల ప్రేమ గెలివటం ముఖ్యమా..లేక రాజకీయాలా అనేది క్లారిటీగా రన్ చెప్పలేకపోయారు. ఇంటెన్స్ గానీ, ఎమోషనల్ డెప్త్ గానీ లేకపోవటమే సినిమాకు మైనస్ గా మారింది. సినిమాని ఎత్తుకున్న విధానం ప్రెష్ గానే అనిపించినా, బస్ లోనే ఎక్కువ సేపు నడవటంతో విసుగు అనిపిస్తుంది. అయితే ఓటిటిలో కాబట్టి ఓ లుక్కేయచ్చు
44
Thriller drama, Pothugadda, Etv win Ott
ఎవరెలా చేసారు
ఉన్నంతలో రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరా పనితనం .. మార్కస్ నేపథ్య సంగీతం .. శివకిరణ్ ఎడిటింగ్ ప్లస్ లుగా నిలిచాయి. ఆడుకాలం నరేన్, శత్రు తమ అనుభవంతో లాగేసారు. ప్రేమికులుగా పృథ్వీ దండమూడి, విస్మయ శ్రీ చూడటానికి బాగానే ఉన్నా, కథలో కీలకం కాలేకపోయారు. ఎమోషన్ రిజిస్టర్ చేయలేకపోయారు.
ఎక్కడ చూడచ్చు
మూవీ పోతుగడ్డ (Pothugadda). ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీలో రిలీజైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.