తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా లాజ్ చేసిన ఫిర్యాదులో, 2024 సంవత్సరంలో తెలుగు సినీ పరిశ్రమకు పైరసీ వల్ల 3700 కోట్ల మేర నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఈ మేరకు చేపట్టిన దర్యాప్తులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు జన కిరణ్‌ను అరెస్ట్ చేసి, పలు కీలక వివరాలను వెలుగులోకి తీసుకువచ్చారు.
జన కిరణ్ కుమార్ గత కొంత కాలంగా సినిమా విడుదలైన రోజే వాటి HD వర్షన్‌లను పైరసీ చేసి వివిధ వెబ్‌సైట్లకు అమ్ముతున్నాడని విచారణలో వెల్లడైంది. ఆయన ఇప్పటి వరకు దాదాపు 65 సినిమాలను పైరసీ చేసినట్టు పోలీసులు తెలిపారు. చిన్న సినిమాలను 32,000కి, పెద్ద సినిమాలను 80,000కి పైరసీ వెబ్‌సైట్లకు విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.