టాలీవుడ్ లో ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఎటువంటి సినిమా నేపథ్యం లేకపోవడమే కాదు, వారసత్వం లేకపోయినా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.
అంతే కాదు వారిలో చాలామంది స్టార్లుగా మారారు. టాలీవుడ్ లో మంచి పొజిషన్ లో కూడా ఉన్నారు. సాధారణ నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి విలన్ గా, హీరోగా, సుప్రీమ్ స్టార్ గా, మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. అంతే కాదు ఇండస్ట్రీలో తన వారసత్వాన్ని నింపి, మెగా సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశారు.