అసిస్టెంట్ డైరెక్టర్ గా 3000 జీతం నుంచి.. 30 కోట్ల హీరోగా ఎదిగిన టాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా..?

First Published Jun 12, 2024, 5:22 PM IST

\అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ను స్టార్ట్ చేసి..  అనుకోకుండా హీరో అయ్యాడు.. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. స్వయంకృషితో ఎదిగి  స్టార్ హీరోల సరసన నిలిచాడు.. అప్‌కమింగ్ ఆర్టిస్టులు, డైరెక్టర్లకు  ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఒకప్పుడు 3000 జీతంతో కెరీర్ స్టార్ట్ చేసి.. ప్రస్తుతం 30 కోట్లు తీసుకునే స్టార్ గా ఎదిగిన హీరో ఎవరో తెలుసా..? 

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోగా లేక డైరెక్టర్ గా నిలబడాలని ట్రై చేసేవారు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ స్టూడియోల చూట్టు తిరుగుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. అలా ఇండస్ట్రీకి వచ్చిన ఓ హీరో.. డైనెక్టర్ అవ్వాలని కలలు కన్నాడు. కాని అనుకోకుండా హీరో అయ్యి.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడిగా స్థిరపడ్డాడు. ఇంతకీ ఎవరా హీరో..? 
 

అప్పట్లో క్లాప్ బోర్డ్ డైరెక్టర్‌గా పనిచేసి నేడు స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ఆ హీరో మరెవరో కాదు.. టాలీవుడ్ లో నేచురల్ స్టార్ గా పిలవపడుతున్న నాని. సినీ ఇండస్ట్రీలో హీరో అవ్వాలని, డైరెక్టర్‌గా మెగాఫోన్ పట్టుకోవాలని ఎంతోమంది కలలు కంటారు. అయితే కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు.  అలాంటి కోవలోకే వస్తాడు నాని

మణిరత్నం సినిమాలు చూసి బాగా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యాడు నాని. దీంతో డిగ్రీ పూర్తి కాగానే ఇండస్ట్రీకి వచ్చేశాడు.  ఇండస్ట్రీలో అవకాశాలు లేక.. డైరెక్షన్ వైపు మళ్లాడు నాని. ప్రొడ్యూసర్ అనిల్ కుమార్ కోనేరు దగ్గర కూడా పనిచేశాడు. ఇక బాబుగారి దగ్గర  రాధాగోపాలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరి, క్లాప్ బాయ్‌గా మారాడు. సొంతంగా  సినిమా కూడా  తీద్దామని అనుకున్నాడట. 
 

Nani

మణిరత్నం సినిమాలు చూసి బాగా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యాడు నాని. దీంతో డిగ్రీ పూర్తి కాగానే ఇండస్ట్రీకి వచ్చేశాడు.  ఇండస్ట్రీలో అవకాశాలు లేక.. డైరెక్షన్ వైపు మళ్లాడు నాని. ప్రొడ్యూసర్ అనిల్ కుమార్ కోనేరు దగ్గర కూడా పనిచేశాడు. ఇక బాబుగారి దగ్గర  రాధాగోపాలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరి, క్లాప్ బాయ్‌గా మారాడు. సొంతంగా  సినిమా కూడా  తీద్దామని అనుకున్నాడట. 
 

అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా నాని ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. ఓ సినిమా డైరెక్టర్ తనను ఎంతో అవమానించారని కొన్ని ఇంటర్వ్యూలలో నాని గుర్తు చేసుకున్నాడు.  అప్పుడు తన జీతం 3000 మాత్రమే. అది పక్కన పెడితే.. అందరి ముందు నన్ను ఘోరంగా ఒక దర్శకుడు అవమానించాడు. నేనెప్పటికీ డైరెక్టర్‌ కాలేనని, అసలు డైరెక్టర్ అయ్యే లక్షణాలే నాలో లేవని తిట్టాడు’ అని నాని చెప్పాడు.
 

డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ నాని లోని హీరోని గుర్తించి ఓ అవకాశం ఇచ్చాడు. అలా అష్టా చమ్మా సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఈ సినిమా విజయం సాధించడంతో పాటు నాని నటనకు మంచి మార్కులు పడ్డాయి.తర్వాత పిల్ల జమీందార్, అలా మొదలైంది ఇలా వరుసగా హిట్లు పడుతూవెళ్లాయి.. ఇక  2012లో రిలీజ్ అయిన రాజమౌళి  ఈగ సినిమాతో నాని క్రేజ్ పెరిగింది. 
 

భలే భలే మగాడివోయ్, నేను లోకల్, జెర్సీ వంటి హిట్లతో నాచురల్ స్టార్ గా మారాడు నాని. ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. లేడీ  ఫ్యాన్ బేస్‌ నానికి ఎక్కువ. ఇక ఈమధ్య కాలంలో వచకచిన  దసరా, హాయ్ నాన్న సినిమాలు నాకి క్రేజ్ ను ఇంకాస్త పెంచాయి. అప్పుడు 3000 జీతం అందుకున్న నాని.. ఇప్పుడు 30 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. 

ఇక ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు నాని. ఆగస్టు 29న ఈ మూవీ రిలీజ్ కురెడీ అవుతోంది. సోషల్ మీడియా ఫాలోయింగ్ తో పాటు.. ఫ్యామిలీ లైఫ్  కూడా హ్యాపీగా లీడ్ చేస్తూ వెళ్తున్నాడు నాని. 

Latest Videos

click me!