పవన్ కళ్యాణ్, చిరంజీవి, రోజా.. మంత్రులుగా సంచలనం సృష్టించిన సినిమా తారలు ఇంకెవరంటే..?

First Published Jun 12, 2024, 3:53 PM IST

ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు.. ఎన్టీఏ ప్రభుత్వంలో కీలకం కాబోతున్నారుపవర్ స్టార్. ఈక్రమంలో గతంలో చిరంజీవితో పాటు చాలామంది కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా సేవలందించారు. వారు ఎవరంటే..? 
 

ఈరోజు (12 జూన్)  పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌  ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. హీరోగా కోట్లు సంపాధిస్తూ.. లగ్జరీలైఫ్ నులీడ్ చేస్తున్న పవన్ కళ్యాణ్.. ప్రజాసేవలోకి వచ్చి.. రాజకీయంగా చాలా మాటలు పడ్డారు. ఇన్నాళ్ళకు ఆయనకు రాజకీయంగా మంచి రోజులు వచ్చాయి. ఇక పవర్ మాదిరిగానేగతంలో చాలామందిసినిమా వారు మంత్రులుగా రాష్ట్రానికి, దేశానికి సేవలుఅందించారు. ఇటు రాష్ట్రమంత్రులుగా.. అటు కేంద్ర మంత్రులుగా చేసిన సినిమా వారు ఎవరంటే..? 

సినిమా  రంగం నుంచి మంత్రిగా ఎదిగిన వారిలో పవన్‌ ఒకరు. ఈయన కంటే ముందు చాలా మంది ఆ పదవిని చేపట్టారు. వన్నె తెచ్చారు. పవన్ కళ్యాణ్ అన్నా.. ఆయనకు మార్గదర్శకుడు.. పవన్ దేవుడిలా కొలిచే మెగాస్టార్ చిరంజీవి  కూడా మంత్రిగా పనిచేశారు. ఆయన కేంద్ర ప్రభుత్వంలో  సాంస్కృతిక , పర్యాటక శాఖామంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆయన మంత్రిగా చేశారు. 
 

RK Roja

 ఇక  మెగాస్టార్ తో పాటు.. బాలయ్య లాంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా తెలుగు, తమిళ సినిమాను ఒక ఊపు ఊపిన నటి  రోజా. ఆమె కూడా   ఏపీలో జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.  మొన్నటి వరకూ ఆమె మంత్రిగానే  ఉన్నారు. 
 

suresh gopi

ప్రస్తుత కేంద్ర మంత్రివర్గంలో సౌత్ ఇండియన్ యాక్టర్ ఒకరు ఉన్నారు. కేరళ నుంచి బీజేపీకి మొదటి సీటు సాధించి పెట్టాడు సురేష్ గోపి. మలయాళ సూపర్ స్టార్ సురేశ్‌ గోపీ ఈ ఎన్నికల్లో కేరళలోని త్రిస్సూర్ నుంచి ఎంపీగా గెలిచి సంచలనం రేపారు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన సురేష్ గోపీ తొలిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. నరేంద్ర మోదీ మంత్రి వర్గంలో పెట్రోలియం శాఖ సహాయ మంత్రి బాధ్యతలు చేపట్టారు. 
 

ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలను తన  హాస్యనటనతో మెప్పించి స్టార్ కమెడియన్ గా వెలుగు వెలిగిన బాబూమోహన్‌ కూడా మంత్రిగా పనిచేశారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు మంత్రివర్గంలో కార్మిక మంత్రిగా ఉన్న ఆయన ఆతరువాత  రాజకీయాల్లో పెద్దగా యాక్టీవ్ గా లేదు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో కోనసాగుతున్నారు. 
 

ప్రభాస్ పెదన్నాన్న దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా కేంద్ర మంత్రిగా సేవలు అందించారు.  అప్పటి వాజపేయ్ మంత్రివర్గంలో ఆయన కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మరణించే వరకూ కృష్ణంరాజు బీజేపీలోనే కొనసాగారు. 
 

Chirag Paswan

లోక్ జన శక్తి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చిరాగ్ పాశ్వాన్ తాజాగా జరిగిన ఈ ఎన్నికల్లో బిహార్ లోని హాజిపూర్ నుంచి ఎంపీగా గెలిచి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ క్యాబినేట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతకు ముందు చిరాగ్‌ రెండు మూడు  సినిమాల్లో నటించినప్పటికీ క్లిక్‌ కాలేదు. దాంతో రాజకీయాల్లోకి వచ్చారు. 
 

smriti irani

వెండితెరపై ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నటి స్మృతి ఇరానీ. ఈమె  2019లో నరేంద్ర మోదీ మంత్రి వర్గంలో కీలక శాఖకు మంత్రి గా బాధ్యతలు నిర్వహించారు.  అయితే ఈ సారి ఎన్నికల్లో మాత్రం ఆమె రాహుల్ గాంధీ చేతిలో ఓటమిపాలయ్యారు.  భారతీయ జనతా పార్టీ తరుపున పలుమార్లు ఎంపీగా గెలిచిన నటుడు వినోద్ ఖన్నా వాజపేయ్ మంత్రివర్గంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేసారు.  శతృఘ్న సిన్హా  కూడా అప్పటి వాజపేయ్ మంత్రి వర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
 

ఇక సినిమా రంగం నుంచి ఏకంగా ముఖ్యమంత్రులు అయిన వారి లిస్ట్ చూస్తే.. తమిళ ఆరాధ్యనటుడు ఎం.జి.రామచంద్రన్‌ ఏకంగా రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన బాటలోనే  నందమూరి తారక రామారావు సొంతంగా తెలుగుదేశంపార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. దక్షిణాది భాషలలో హీరోయిన్ గా నటించి మెప్పించిన  జయలలిత కూడా ముఖ్యమంత్రి అయ్యారు.  ఇక వీరి బాటలోనే పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ ముఖ్యమంత్రి అవ్వాలని పట్టుదలతో ఉన్నారు.  

Latest Videos

click me!