డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ జీతం ఎంత, హీరోగా రెమ్యునరేషన్ ఎంత.. జనసేనానికి ప్రత్యేకంగా కల్పించే వసతులు ఇవే

First Published Jun 12, 2024, 3:49 PM IST

పవన్ కళ్యాణ్ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. అయితే ఆయనకి ప్రభుత్వం నుంచి ఎంత జీతం లభిస్తుంది. ఎలాంటి సౌకర్యాలు పవన్ కళ్యాణ్ కి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనే అంశాలు వైరల్ గా మారాయి. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో దశాబ్దం పైగా ఒడిదుడుకుల తర్వాత విజయం సాధించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం, బిజెపి కూటమిగా పోయి చేశాయి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అఖండ విజయం నమోదు చేసుకున్నాయి. జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. 

పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టారు. కాగా బుధవారం రోజు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇదే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. దీనితో జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.

అయితే పవన్ కళ్యాణ్ ఇకపై ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. నటుడిగా కూడా తాను కమిటైన చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండింటిని పవన్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనే ఆసక్తి ఉత్కంఠగా మారింది. 

అయితే ఇక్కడ పవన్ గురించి మరో ఆసక్తికర చర్చ కూడా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. అయితే ఆయనకి ప్రభుత్వం నుంచి ఎంత జీతం లభిస్తుంది. ఎలాంటి సౌకర్యాలు పవన్ కళ్యాణ్ కి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనే అంశాలు వైరల్ గా మారాయి. 

సినీ హీరోగా అయితే పవన్ కళ్యాణ్ కి సకల రాజభోగాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ కేవలం నెలరోజులు కాల్ షీట్స్ కేటాయిస్తే దాదాపు 60 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుతుంది. వకీల్ సాబ్, బ్రో లాంటి చిత్రాలకు పవన్ అతి తక్కువ రోజులు పని చేసి రోజుకు రెండు కోట్ల చొప్పున రెమ్యునరేషన్ అందుకున్న దాఖలాలు ఉన్నాయి. పవన్ సెట్స్ లోకి ఎంటర్ అయితే అన్ని దగ్గరుండి చూసుకునే అసిస్టెంట్స్ ఉంటారు. 

గతంలో కొంతమంది ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రజాధనం వృధా కాకూడదని జీతం తీసుకునే వారు కాదు. కొందరు రూపాయి జీతం తీసుకున్నారు. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటానని అన్నారు. తాను తప్పు చేసినా ప్రజలు నన్ను ప్రశ్నించాలి. ఆ హక్కు ప్రజలకి కల్పించడం కోసం పూర్తి జీతం తీసుకుంటాను. అదే విధంగా ప్రజల డబ్బుని జీతంగా తీసుకుంటాను కాబట్టి అనుక్షణం గుర్తు చేసుకుంటూ వాళ్ళ కోసం బాధ్యతగా పనిచేస్తానని పవన్ అన్నారు. 

ఎమ్మెల్యేల జీతం ఇతర అలెవెన్సులు ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని బట్టి వేరు వేరుగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గా గెలిచారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఒక్కో ఎమ్మెల్యేకి 1 లక్ష 25వేలు వేతనం జీతంగా చెల్లిస్తోంది. ఎమ్మెల్యేకి ప్రభుత్వం క్వార్టర్స్ కల్పించాలి. కానీ ఏపీలో ఎమ్మెల్యేలకు ఆ సదుపాయం లేదు. కాబట్టి అదనంగా 50 వేలు హెచ్ ఆర్ ఏ కింద ఇస్తున్నారు. అంటే మొత్తం జీతం 1 లక్ష 75 వేలు. 

ఎమ్మెల్యేలకు టెలిఫోన్ ఖర్చులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. అవసరాన్ని బట్టి ప్రభుత్వం ఎమ్మెల్యేలకు 1 ప్లస్ 1 లేదా 2 ప్లస్ 2 సెక్యూరిటీ ఏర్పాటు చేస్తుంది. వాహనాల కొనుగోలుకు అడ్వాన్స్ రూపంలో చెల్లిస్తుంది. ఇక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, విప్, చీఫ్ విప్, ప్రధాన ప్రతిపక్ష నేత లకు ఎమ్మెల్యేల కంటే ఎక్కువ జీతభత్యాలు ఉంటాయి. 

ఏపీలో మంత్రులకు 3 లక్షలపైనే జీతం అందుతున్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ పాపులారిటీ ఉన్న సెలెబ్రిటీ కాబట్టి ఆయన రక్షణ కోసం సెక్యూరిటీ కూడా భారీ స్థాయిలోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అత్యధికంగా ఎమ్మెల్యేలకు 2.50 లక్షల జీతం చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా లక్షల్లో జీతం అందుకుంటే.. హీరోగా వందల కోట్లు సంపాదిస్తారు. 

Latest Videos

click me!