అల్లు అర్జున్ కి చాలా ఇష్టమైన హీరోయిన్ ఆమె, కానీ ఇంతవరకు ఆ తారతో నటించలేదట..?

First Published | Mar 21, 2024, 1:40 PM IST

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  పాన్ వరల్డ్ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఎంతరో స్టార్స్ తో శభాష్ అనిపించుకున్నారు. అయితే బన్నీ ఎంతో ఇష్టపడే హీరోయిన్ ఎవరో తెలుసా..?

 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రపంచ వ్యాప్తంగా ఇమేజ్ ను సాధించాడు. మరీ ముఖ్యంగా బన్నీ... అల వైకుంఠపురములో సినిమాతో పాటు పుష్ప సినిమాతో పాన్ వరల్డ్ ఫేమస్ అయ్యాడు. ఈసినిమాల్లో బన్నీ మ్యానరిజంతో పాటు.. సినిమాల్లోని సాంగ్స్ వరల్డ్ వైడ్ గా ఎంతో రీచ్ ని సంపాదించుకున్నాయి. పుష్పతో బన్నీ ఎంత పాపులర్ అయ్యాడో అందరికీ తెలసిదే..

పుష్ప 2 ను అంతకుమించి తెరకెక్కించే పనిలో ఉన్నారు. 1000 కోట్ల కలెక్షన్ మార్క్ దాటడంతో పాటు... ఆస్కార్ కు ఈసినిమాను ఎలాగైనా తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు టీమ్. ఇప్పటికే  ఫస్ట్ పార్టుకి ప్రపంచ వ్యాప్తంగా ఓ రేంజ్ క్రేజ్ రావడంతో తోపాటు.. బన్నీకి జాతీయ అవార్డ్ కూడా వచ్చింది. ఇక  సీక్వెల్ ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. 
 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?


ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. బన్నీ ఈసినిమాలో ఎలా కనిపించబోతున్నాడో అని.. పాన్ ఇండియా వెయిట్ చేస్తుంది.   సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తుండగా.. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈమూవీ మొత్తం మూడు భాగాలుగా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. 

ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కి ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమెతో నటించాలని అనుకున్నాడట బన్నీ.. కాని అది కుదరలేదట.. ఇక కుదరదు కూడా.. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో బన్నీ వెల్లడించాడు ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా... మహానటి సావిత్రి.   

savitri ganesan

తన నటనతో..మంచితనంతో లెజెండరీ నటిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు సావిత్రి. తెలుగు,తమిళ భాషల్లో ఆమె చేసిన సినిమాలు.. స్వతహాగా ఆమెకు ఉన్న ఇమేజ్.. ఇండస్ట్రీలో ఆమెను మహానటి సావిత్రిని చేసింది. నిజానికి సావిత్రి గారు పోషించిన పాత్రలని ఆ తర్వాత వచ్చిన హీరోయిన్స్ ఎవరు పోషించలేదు అంత స్టార్ డమ్ కూడా ఎవరికీ లేదు. 

Savitri with cheetah

సావిత్రి హావభావాలు, ఆమెలో నటన, వల్గర్ గా లేకుండా.. చక్కగా చీరకట్టుకుని.. విలువలు పాటిస్తూ.. ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తీరు.. అల్లు అర్జున్ ను ఆకర్శించాయట. అందువల్లే  అల్లు అర్జున్ కు ఆమె అంటే చాలా ఇష్టమట.అంతే కాదు ఒకవేళ ఆవిడ ఇప్పుడు బ్రతికి ఉండి  ఉంటే ఆమెతో పాటు ఒక సినిమాలో అయినా నటించేవాడని అంటూ ఓ ఇంటర్వ్యూ లో ఆయన వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 

Latest Videos

click me!