ప్రభాస్ కు ఈ అలవాటు తన పెదనాన్న కృష్ణం రాజు నుంచి అబ్బిందట. రాజులు వంశం కావడంతో.. వారు మంచి భోజన ప్రియులు.. అంతే కాదు ఇంటికి వచ్చిన వారికి కూడా నాలుగైదు రకాలు నాన్ వెజ్ కూరతో భోజనం పెడతారట. కృష్ణం రాజు పెద్ద కర్మ రోజు కూడా ప్రభాస్ లక్షలమందికి అన్నదానం చేశారు. దాదాపు రెండు కోట్ల వరకూ భోజనాలకు ఖర్చు చేశారట. ఇక ఇది ఇలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.