శ్రీదేవి, విజయశాంతి, త్రిష, తమన్నా, అనుష్క.. రెయిన్ డాన్స్ తో అదరగొట్టిన హీరోయిన్లు.. ఎవర్ గ్రీన్ సాంగ్స్

First Published | Nov 23, 2023, 1:03 PM IST

సినిమాల్లో రెయిన్ సాంగ్స్ కు ఎంతటి క్రేజ్ ఉంటుందో తెలిసిందే. రొమాంటిక్ చిత్రాల్లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన వానపాటలకు గతం నుంచే మంచి ప్రాధాన్యత ఉంది. సీనియర్ హీరోయిన్ల నుంచి ప్రస్తుతం యంగ్ బ్యూటీల వరకు రెయిన్ సాంగ్స్ తో అలరించిన వారి గురించి తెలుసుకుందాం. 
 

అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి (Sridevi) - అన్నగారు, సీనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన రెయిన్ సాంగ్ ‘ఆకు చాటు పిల్ల తడిచే’. వేటుగాడు చిత్రంలో వీరిద్దరూ కలిసి వేసిన స్టెప్పులకు ఆ సాంగ్ ను అప్పటి ప్రేక్షకులే కాదు.. ఇప్పటికీ ఆడియెన్స్ కూడా చాలా ఫిదా అవుతుంటారు. వానపాట్లల్లో ఇది ఎవర్ గ్రీన్ సాంగ్. 1979 నుంచి ఇప్పటి వరకు వినిపిస్తూనే ఉంది.
 

సీనియర్ హీరోయిన్ విజయ శాంతి (Vijaya Shanthi)   చాలా రెయిన్ సాంగ్స్ లో నటించింది. కానీ చీరంజీవితో కలిసి చిందులేసిన ‘వాన వాన వెల్లువాయే’ పాటకు మ్యూజిక్ లవర్స్ ఎంతో ఫిదా అయ్యారు. చిరుసాంగ్స్ లోనూ ఇప్పటికీ ఈపాట వినిపిస్తుంటుంది. వానపై వచ్చిన సాంగ్స్ ల్లో సంగీత ప్రియులకు ఇది ఫేవరెట్.
 


టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగార్జున  - అమల కాంబోలోనూ ఓ రెయిన్ సాంగ్ వచ్చింది. 1990లో వచ్చి ప్రేమయుద్ధంలో ‘స్వాతి ముత్యపు జల్లుల్లో’ సాంగ్ ను ఇప్పటికీ సంగీత ప్రియులు ఇష్టపడుతుంటారు. ఇక నాగార్జున సినిమాల్లో చాలా వరకు రెయిన్ సాంగ్స్ వచ్చి అదరగొట్టాయి. 
 

సౌత్ క్వీన్ త్రిష (Trisha) తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం. ఈ సీనియర్ భామ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూనే రెయిన్ సాంగ్ తో అదరగొట్టింది. తన కెరీర్ లోనే భారీ హిట్ అందించిన చిత్రం ‘వర్షం’. ప్రభాస్ తో కలిసి త్రిష నటించిన ‘నీటి ముల్లై’’ సాంగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. డార్లింగ్, త్రిష అభిమానులు ఇప్పటికీ ఈ సాంగ్ ను వింటుంటూనే ఉంటారు. ఈ మూవీలో ‘నువ్వొస్తానంటే’ అంటూ వానపై ప్రత్యకమైన పాటను పెట్టిన విషయం తెలిసిందే. 
 

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia)  20వ దశకం హీరోయిన్లలో ఎక్కువగా రెయిన్ సాంగ్స్ చేసినట్టు కనిపిస్తోంది. ‘ఆవారా’, ‘బద్రీనాథ్’, ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’, ‘బాహుబలి’లోనూ రెయిన్ లో తడుస్తూ స్టెప్పులేసింది. అప్పటికే డాన్స్ లో అదరగొట్టే తమన్నా... ఇక రెయిన్ సాంగ్స్ తో గుర్తుండిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చింది. 
 

సీనియర్ నటి, టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి (Anushka Shetty)  - మాస్ మహారాజా కాంబోలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘బలాదూర్’. ఈ చిత్రంలోని ‘రంగు రంగు వాన’ అనే రెయిన్ సాంగ్ కు అనుష్క శెట్టి మతులు పోయేలా పెర్ఫామెన్స్ చేసింది. ఆ సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఎప్పటికీ గుర్తుండిపోయేలా బ్యూటీఫుల్ గా సాంగ్ ను చిత్రీకరించడం విశేషం. 

కొంతకాలంగా రెయిన్ సాంగ్స్  క్రేజ్ పెద్దగా కనిపించలేదు. కానీ మళ్లీ ఆ ట్రెండ్ కనిపిస్తోంది. ‘డీజే టిల్లు’ హీరోయిన్ నేహా శెట్టి రీసెంట్  చిత్రం ‘రూల్స్ రంజన్’. ఈ మూవీలోని ‘సమ్మోహనుడా’ సాంగ్ లో రెయిన్ కు ఎలా డాన్స్ చేసిందో తెలిసిందే. ఇటీవల కాలంలో బాగా ట్రెండ్ అయిన సాంగ్స్ లో ఈ పాట ఒకటి. నేహా శెట్టి కూడా తన డాన్స్ తో మతులు పోగొట్టింది. ఫిదా చేసింది. 

విశ్వక్ సేన్ - ఆశా భట్  కాంబోలో ‘గుండెల్లోనా గుండెల్లోనా’ సాంగ్ ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. రెయిన్ లో వీరిద్దరూ వేసిన స్టెప్పులు, లిరిక్స్ కూడా ఎంత ఆకట్టుకున్నాయో తెలిసిందే. ఇప్పటికీ సాంగ్ ట్రెండింగ్ లోనే ఉంది. ఇలా వానపాటల్లో అప్పటి హీరోయిన్ల నుంచి ఇప్పటి హీరోయిన్లు కూడా అదరగొడుతున్నారు. 
 

Latest Videos

click me!