వైట్ చుడీదార్ లో ‘ఓజీ’ బ్యూటీ.. ఆ మత్తెక్కించే ఫోజులు చూస్తే.. గుండెలు గల్లంతే!

First Published | Nov 23, 2023, 10:46 AM IST

కోలీవుడ్ యంగ్ బ్యూటీ ఐశ్వర్య మీనన్ పద్ధతిగా మెరిసినా గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చుడీదార్ లో దర్శనమిచ్చింది. తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో గుర్తింపునకు ప్రయత్నిస్తోంది.
 

యంగ్ హీరోయిన్ ఐశ్వర్య మీనన్ (Iswarya Menon)  తమిళ చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.  కన్నడ, మలయాళంలోనూ సినిమాలు చేసింది. రీసెంట్  గా ఈ బ్యూటీ తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయం అయ్యింది. 
 

తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ సరసన స్సై యాక్షన్ ఫిల్మ్ Spyతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టింది. ఈ ముద్దుగుమ్మ పెర్ఫామెన్స్ ను ఆడియెన్స్ ఫిదా అయ్యారు. 
 


కానీ ‘స్పై’ చిత్రంతో  పెద్దగా హిట్ అందుకోలేకపోయింది. కానీ ఈ బ్యూటీ ఇచ్చి న పెర్ఫామెన్స్ కు అవకాశాలు మాత్రం అందుకుంటోంది. ఇప్పటికే మలయాళంలో ‘బజూక’ చిత్రంలో నటిస్తోంది. తెలుగులో మరో బంపర్ ఆఫర్ అందుకుంది.

ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిత్రంలోనే అవకాశం దక్కించుకుంది. యంగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుజీత్ (Sujith)  డైరెక్ట్ చేస్తున్న OG మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 
 

తెలుగులో ఒక్క హిట్ పడితే మాత్రం ఐశ్వర్య మీనన్ రేంజ్ మరోలా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఆఫర్లు అందుకుంటోంది. సరైన హిట్ ఉంటే అవకాశాలు జోరుగా వచ్చే అవకాశం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ తర్వాత ఆ స్టేజ్ దక్కుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
 

ఈక్రమంలో ఐశ్వర్య మీనన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే కనిపిస్తోంది. బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. తాజాగా వైట్ చుడీదార్ లో ఈ ముద్దుగుమ్మ మత్తుగా ఫోజులిస్తూ అట్రాక్ట్ చేసింది. తనదైన రీతిలో ఫొటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకుంది. తాజా ఫొటోస్ కూడా నెట్టింట వైరల్ గా మారాయి. 
 

Latest Videos

click me!