Tollywood heroines best movies: నయనతారకి సెల్యూట్ చేయాల్సిందే.. రెజీనా, అనుష్క, సామ్ నెక్స్ట్ లెవల్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 20, 2022, 01:16 PM IST

అందంతో పాటు అద్భుతమైన నటనతో కూడా ఆకట్టుకుంటేనే హీరోయిన్లు ఎక్కువకాలం నిలబడగలుగుతారు. అలాంటి వారికి మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు అలాంటి పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న చిత్రాలని ఇప్పుడు పరిశీలిద్దాం. 

PREV
110
Tollywood heroines best movies: నయనతారకి సెల్యూట్ చేయాల్సిందే.. రెజీనా, అనుష్క, సామ్ నెక్స్ట్ లెవల్

నయనతార - కర్తవ్యం: సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార గ్లామర్ కి తిరుగులేదు. ఎక్కువగా ఆమెని అభిమానులు గ్లామర్ డాల్ గానే భావిస్తారు. వయసు పెరిగేకొద్దీ నయన్ అందం కూడా పెరుగుతోంది. కానీ నయనతార తన కెరీర్ లో అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న చిత్రాలు కూడా చాలానే ఉన్నాయి. అందులో ముందు వరుసలో ఉంటుంది 'కర్తవ్యం' చిత్రం. ఈ మూవీలో ఐఏఎస్ అధికారిగా హుందాగా కనిపిస్తూనే ఎమోషనల్ గా కట్టి పడేసింది. 

210

జెనీలియా - బొమ్మరిల్లు : జెనీలియా అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చిన చిత్రం బొమ్మరిల్లు. ఆమె కెరీర్ లో బెస్ట్ మూవీ ఇదే. అల్లరి పిల్లగా, ప్రేమికురాలిగా జెనీలియా గమ్మత్తైన నటనతో మెప్పించింది. 

 

310

అనుష్క - అరుంధతి: అనుష్క కెరీర్ లో బాహుబలి చిత్రం అతిపెద్ద విజయం. కానీ నటన పరంగా  అరుంధతి చిత్రం ఒక మెట్టు ఎక్కువగానే ఉంటుంది. అంత అద్భుతంగా అనుష్క అరుంధతిలో నటించింది. అరుంధతి చిత్రంతో అనుష్క తనకు స్టార్ హీరోలకు తీసిపోని విధంగా సత్తా ఉందని నిరూపించింది. జేజమ్మ రోల్ లో అనుష్క పెర్ఫామెన్స్ నెక్స్ట్ లెవల్. 

410

సాయి పల్లవి - ఫిదా: ఈ చిత్రంలో సాయి పల్లవి తన నటనతో ఫిదా చేసేసింది. ఈ చిత్రం నుంచే సాయిపల్లవి హవా టాలీవుడ్ లో మొదలయింది. సాయి పల్లవి ఎంచుకునే చిత్రాలన్నీ నటనకు స్కోప్ ఉండే సినిమాలే. కానీ ఫిదా చిత్రంలో సాయి పల్లవి తన గ్లామర్ తో కూడా మెప్పించింది. 

510

కాజల్ అగర్వాల్ - నేనే రాజు నేనే మంత్రి: కాజల్ కెరీర్ లో నటనకు స్కోప్ ఉన్న రోల్స్ తక్కువ. వన్నె తరగని అందం, సెటిల్డ్ పెర్ఫామెన్స్ తో కాజల్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. కాజల్ యాక్టింగ్ పరంగా నేనే రాజు నేనే మంత్రి చిత్రం హైలైట్ అని చెప్పొచ్చు. 

610

నిత్యామీనన్ - గుండెజారి గల్లంతయ్యిందే : కళ్ళతోనే హావభావాలు పలికించగల నటి నిత్యామీనన్. గుండెజారి గల్లంతయ్యిందేలో నిత్యా నటన మెస్మరైజింగ్ గా ఉంటుంది. ఈ సినిమా సక్సెస్ లో మేజర్ పార్ట్ క్రెడిట్ నిత్యా మీనన్ దే అని చెప్పాలి. కోపం, సంతోషం.. ఎలాంటి ఎమోషన్ అయినా నిత్యా మీనన్ తన కళ్ళతోనే పలికించగలదు. 

710

రెజీనా - ఎవరు : మంచి నెగిటివ్ రోల్ పడ్డప్పుడే నటన కూడా బయటకు వస్తుంది. నరసింహ చిత్రంలో రమ్యకృష్ణ పాత్రే అందుకు ఉదాహరణ. ఇక రెజీనాకి కూడా నెగిటివ్ షేడ్స్ లో నటించే ఛాన్స్ 'ఎవరు చిత్రంతో దక్కింది. దీనితో రెజీనా బోల్డ్ పెర్ఫామెన్స్ తో పిచ్చెక్కించేసింది. తప్పకుండా రెజీనా కెరీర్ లో ఎవరు ది బెస్ట్ మూవీ. 

810

నివేద థామస్ - వకీల్ సాబ్ : నివేత థామస్ తనకు నటనకు స్కోప్ ఉన్న రోల్ పడితే ఎలా ఉంటుందో వకీల్ సాబ్ చిత్రంతో నిరూపించింది. ఈ మూవీలో నివేత థామస్ కోర్టు సన్నివేశాల్లో అద్భుతంగా నటించింది. 

910

సమంత - ఫ్యామిలీ మ్యాన్ 2: సమంత తన కెరీర్ లో అ..ఆ.., ఓ బేబీ లాంటి అద్భుతమైన రోల్స్ చేసింది. ఫ్యామిలీ మ్యాన్ 2లో ఆమె నటన వేరే లెవల్. ఇది మూవీ కాదు వెబ్ సిరీస్. కానీ సమంత బోల్డ్ గా, నెగిటివ్ షేడ్స్ లో స్టన్నింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. 

1010

కీర్తి సురేష్ - మహానటి : ఉత్తమ నటిగా జాతీయ అవార్డునే కీర్తి సురేష్ ఈ చిత్రంతో దాసోహం చేసుకుంది. మహానటి మూవీలో కీర్తి సురేష్ తన నటనతో సావిత్రి గారి జీవితాన్నే రీ క్రియేట్ చేసింది అని చెప్పాలి. 

Read more Photos on
click me!

Recommended Stories