2021 Roundup: ఈ ఏడాది ఫ్లాపుల నుంచి గట్టెక్కిన హీరోలు

First Published | Dec 27, 2021, 12:32 PM IST

కొవిడ్ కారణంగా 2021లో టాలీవుడ్ కు అంతగా కలసి రాలేదు. భారీ చిత్రాలన్నీ వాయిదా పడ్డాయి. అవకాశం ఉన్న మీడియం రేంజ్, చిన్న చిత్రాలు ఓటిటి బాట పట్టాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగవుతుండడంతో మళ్ళీ థియేటర్స్ లో సందడి కనిపిస్తోంది. ఇదిలా ఉండగా 2021 కొందరు టాలీవుడ్ హీరోలకు ఊరట కలిగించింది.

కొవిడ్ కారణంగా 2021లో టాలీవుడ్ కు అంతగా కలసి రాలేదు. భారీ చిత్రాలన్నీ వాయిదా పడ్డాయి. అవకాశం ఉన్న మీడియం రేంజ్, చిన్న చిత్రాలు ఓటిటి బాట పట్టాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగవుతుండడంతో మళ్ళీ థియేటర్స్ లో సందడి కనిపిస్తోంది. ఇదిలా ఉండగా 2021 కొందరు టాలీవుడ్ హీరోలకు ఊరట కలిగించింది. పరాజయాల్లో ఉన్న హీరోలు కొందరు ఈ ఏడాది విజయాల బాట పట్టారు. ఆ వివరాలు చూద్దాం. 

రవితేజ - క్రాక్ : మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది క్రాక్ మూవీతో సూపర్ హిట్ కొట్టాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించింది. అంతకు ముందు రవితేజ నటించిన డిస్కో రాజా, నేల టికెట్టు, అమర్ అక్బర్ ఆంటోని లాంటి చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. 

Latest Videos


పవన్ కళ్యాణ్ - వకీల్ సాబ్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది వకీల్ సాబ్ చిత్రంతో ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. వకీల్ సాబ్ చిత్రం మాస్ మూవీ కాదు. కానీ ఈ మూవీతో పవన్ మాస్ కంబ్యాక్ ఇచ్చాడు. అజ్ఞాతవాసి తర్వాత పవన్ నటించిన చిత్రం ఇదే. 

అఖిల్- మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ : అక్కినేని వారసుడు అఖిల్ ఎన్నో అంచనాలతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ తొలి విజయం కోసం మాత్రం అఖిల్ చాలా కాలమే ఎదురుచూడాల్సి వచ్చింది. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ఇలా తొలి మూడు చిత్రాలు అఖిల్ కు నిరాశనే మిగిల్చాయి. అఖిల్ నుంచి ఈ ఏడాది వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీ మంచి విజయం అందుకుంది. దీనితో అఖిల్ విజయాల ఖాతా తెరిచాడు. 

బాలకృష్ణ - అఖండ : ఇక నందమూరి బాలకృష్ణ కూడా ఈ ఏడాది బ్లాక్ బ్లస్టర్ కొట్టాడు. తనకు అచొచ్చిన బోయపాటి దర్శకత్వంలో నటించి అఖండ చిత్రంతో భారీ విజయం సొంతం చేసుకున్నాడు. అఖండ మూవీ ఈ ఏడాది అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలిచింది. 

శ్రీ విష్ణు - రాజ రాజ చోర : శ్రీవిష్ణు ఈ ఏడాది రాజరాజ చోర చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు. ఈ మూవీలో శ్రీవిష్ణు దొంగ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు శ్రీవిష్ణు నటించిన 'తిప్పరా మీసం' చిత్రం నిరాశ పరిచింది. 

Shyam Singha Roy

నాని - శ్యామ్ సింగ రాయ్ : నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో నాని రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాడు. శ్యామ్ సింగ రాయ్ పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తొలి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలైంది. నాని గత రెండు చిత్రాలు టాక్ జగదీశ్, వి అంతగా కట్టుకోలేదు. 
Also Read: ఆ ఇద్దరు లెజెండ్స్ అంటే ధనుష్ కి ఇష్టం అట.. బయోపిక్ కి రెడీ

click me!