Roundup 2021 : తెలుగు ఆడియన్స్ కి కిక్ ఇచ్చిన కొత్త సరుకు... 2021లో ఎంట్రీ ఇచ్చిన నయా హీరోయిన్స్

2021కి గాను టాలీవుడ్ (2021 Tollywood Roundup)లో  అరుదైన విజయాలు నమోదయ్యాయి. క్రాక్, వకీల్ సాబ్, అఖండ (Akhanda), ఉప్పెన, జాతిరత్నాలు, పుష్ప (Pushpa)వసూళ్ల వర్షం కురిపించాయి. లాక్ డౌన్ తర్వాత ప్రేక్షకులను థియేటర్స్ కి నడిపించాయి.

అలాగే ఈ ఏడాది టాలీవుడ్ లో అడుగుపెట్టిన కొత్త తారలు యూత్ ని మెస్మరైజ్ చేశారు. మొదటి చిత్రంతోనే కుర్రకారు గుండెల్లో పాగా వేశారు. ఊహించని విజయాలు అందుకొని దర్శక నిర్మాతల మోస్ట్ ఫేవరేట్ హీరోయిన్స్ గా మారిపోయారు.2021లో టాలీవుడ్ లో అడుగుపెట్టిన తారలు ఎవరో చూసేద్దామా.. 
 

మొదటి చిత్రంతోనే కుర్రాళ్లను ఊపేసింది కన్నడ బ్యూటీ కృతి శెట్టి (Kriti shetty). ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా కృతి మారిపోయారు. ఆమె చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాల వరకు ఉన్నాయి. వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతూ డెబ్యూ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఉప్పెన భారీ వసూళ్లు రాబట్టింది. కృతి నటించిన రెండవ చిత్రం శ్యామ్ సింగరాయ్ సైతం హిట్ టాక్ సొంతం చేసుకుంది. బంగార్రాజుతో పాటు రామ్, సుధీర్ బాబు చిత్రాలలో కృతి హీరోయిన్ గా నటిస్తుంది.


కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన జాతిరత్నాలు మూవీ ఊహించని విజయం సాధించింది. నూతన దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన జాతిరత్నాలు మూవీ టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. హైదరాబాద్ బ్యూటీ ఫారియా అబ్దుల్లా (Faria Abdullah)జాతిరత్నాలు మూవీతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటించారు. ఫరియా తన క్యూట్ ఇన్నోసెంట్ నటనతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు.

లెజెండరీ దర్శకులు కే రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందడి మూవీతో తెలుగు తెరకు పరిచయమయ్యారు కన్నడ భామ శ్రీలీల(Sreeleela). రోషన్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి డెబ్యూ డైరెక్టర్ గౌరీ రోణంకి దర్శకత్వం వహించారు. శ్రీలీల గ్లామర్ పెళ్లి సందడి చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీకాంత్ పెళ్లి సందడి చిత్రానికి స్ఫూర్తిగా తెరకెక్కిన ఈ చిత్రం పర్వాలేదు అనిపించుకుంది.గ్లామర్, యాక్టింగ్ పరంగా శ్రీలీల మంచి మార్కులు కొట్టేయగా.. టాలీవుడ్ లో అవకాశాలు దక్కుతున్నాయి.

ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్(Priya Prakash)... 2021లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. నితిన్ హీరోగా దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన చెక్ మూవీలో ఆమె సెకండ్ హీరోయిన్ రోల్ చేశారు. ఈ మూవీలో ఆమెది నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ కావడం విశేషం. అలాగే యంగ్ హీరో తేజా సజ్జా కి జంటగా ఇష్క్ మూవీ చేశారు. ఈ రెండు చిత్రాలు పరాజయం కావడంతో ఆమెకు బ్రేక్ దక్కలేదు.

చెన్నై బ్యూటీ అమృతా అయ్యర్ 2021లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. రామ్ హీరోగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ రెడ్ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించారు. తమిళ హిట్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన రెడ్ అనుకున్నంత విజయం సాధించలేదు.

స్టార్ కిడ్ శివాని రాజశేఖర్ (Shivan Rajashekar)అద్భుతం మూవీతో వెండితెరకు ఈ ఏడాది పరిచయం అయ్యారు. తేజా సజ్జా హీరోగా తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రంలో ఆమె ఆయన ప్రేయసి రోల్ చేశారు. రెండు భిన్న కాలాల్లో ఉంటూ ఫోన్ మాధ్యమంగా ప్రేమించుకునే జంటగా తేజా, శివాని కనిపించారు. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కావడం జరిగింది. అద్భుతం మూవీలో శివాని నటన చాలా సహజంగా ఉంటుంది. శివాని మంచి నటిగా ఎదుగుతారన్న విశ్వాసం కలిగింది.

Also read 2021 round up:భారీ ఫ్లాప్ కొట్టిన తెలుగు సినిమాలివే!

Also read Roundup 2021: పవన్ ప్రసంగం, మా ఎన్నికలు, సమంత విడాకులు... 2021లో టాలీవుడ్ ని ఊపేసిన వివాదాలు

Latest Videos

click me!