Samantha-Naga Chaitanya: విడాకుల తర్వాత ఒకే చోటకు సమంత-నాగ చైతన్య.. ఇక ఏం జరిగిదంటే!

Published : Dec 27, 2021, 09:40 AM ISTUpdated : Dec 27, 2021, 12:08 PM IST

నాగ చైతన్య (Naga Chaitanya)-సమంత విడిపోయి నెలలు గడుస్తున్నాయి. అక్టోబర్ 2న సమంత-నాగ చైతన్య విడాకుల ప్రకటన చేశారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

PREV
17
Samantha-Naga Chaitanya: విడాకుల తర్వాత ఒకే చోటకు సమంత-నాగ చైతన్య.. ఇక ఏం జరిగిదంటే!

విడాకుల ప్రకటనకు నెలల ముందు నుండే సమంత-నాగ చైతన్య (Samantha-Naga Chaitanya divorce) విడివిడిగా ఉంటున్నారు. మనస్పర్థలు అనంతరం ఒంటరి జీవితం మొదలుపెట్టారు. ఇక వీరి విడాకుల ఎపిసోడ్ లో హైడ్రామా చోటు చేసుకుంది. మీడియాలో పలు నిర్ధార కథనాలు ప్రసారమయ్యాయి. సమంత సదరు కథనాలు ఆపివేయాలని అభ్యర్థించారు. అయినా ఆగకపోవడంతో లీగల్ యాక్షన్ కి తెగబడ్డారు.

27


సమంత (Samantha)కు అఫైర్స్ ఉన్నాయని, పిల్లలు వద్దనుకుంటున్నారని, అబార్షన్ చేయించుకున్నారని.. ఇలా పలు వాదనలు తెరపైకి వచ్చాయి. సమంత పరోక్షంగా ఈ ఆరోపణలకు జవాబు చెప్పే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో ఆమె తరచుగా తన వేదన తెలియజేస్తూ ఇన్ డైరెక్ట్ పోస్ట్స్ పెడుతూ ఉండేవారు. 
 

37


ఇక విడాకులు అయినప్పటికీ సమంత-నాగచైతన్య కలిసి నటిస్తారంటూ పుకార్లు చక్కర్లు కొట్టాయి. అయితే అది నిజం కాదని, కనీసం వాళ్ళు ఒకరిని మరొకరు కలవడానికి కూడా ఇష్టపడటం లేదని తెలుస్తుంది. దీనికి తాజాగా సంఘటనే నిదర్శనం. 
 

47

సమంత నటిస్తున్న యశోద, నాగ చైతన్య మూవీ బంగార్రాజు చివరి షెడ్యూల్ రామానాయుడు స్టూడియోలో చిత్రీకరణ జరుపుకుంటున్నాయట. దీంతో వీరిద్దరూ ఒక చోటకు చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందట. సమంత-చైతూ ఎదురెదురుగా వస్తే  ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారనే సందిగ్ధత రెండు చిత్రాల యూనిట్స్ లో నెలకొందట.

57


అయితే ఈ విషయం తెలుసుకున్న సమంత-నాగ చైతన్య తమ సిబ్బందికి సూచనలు చేశారట. ఇద్దరూ ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారట. సమంత నాగ చైతన్య ఒకే ప్రదేశంలో ఉన్నప్పటికీ ఎవరి పని వాళ్ళు చూసుకొని వెళ్లిపోయారట. దీనితో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారట. 

67


విడాకుల తర్వాత నాగ నాగ చైతన్య ఎటువంటి కామెంట్స్ చేయలేదు. ఆయన పూర్తి మౌనం వహిస్తున్నారు. సమంత మాత్రం తనపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇస్తూ వచ్చారు. సమంత విడాకుల డిప్రెషన్ నుండి బయటపడటానికి మిత్రులతో ఎక్కువగా గడిపారు. వరుసగా విహారాలకు వెళ్లారు. 

77


ఇదిలా ఉంటే నాగచైతన్య ప్రస్తుతం బంగార్రాజు, థాంక్యూ సినిమాలు చేస్తున్నాడు. త్వరలో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలోని ఓటీటీ వెబ్‌సిరీస్‌లో నటించనున్నాడు. విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌తో చైతూ డిజిటల్‌లో అడుగుపెట్టబోతున్నాడు. మరోవైపు సమంత చేతిలో 'శాకుంతలం', 'యశోద', 'కాతువాకుల రెండు కాదల్‌', 'అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌' ప్రాజెక్టులు ఉన్నాయి. వరుణ్‌ ధావన్‌తో ఓ వెబ్‌ సిరీస్‌ కూడా చేయనుందని టాక్‌ వినిపిస్తోంది.

Also read Samantha Christmas celebrations:మళ్ళీ ఎన్నాళకు సమంత ముఖంలో స్వచ్ఛమైన చిరు నవ్వు..!

Also read Samanth : యశోద మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్న సమంత... తగ్గేదే లేదంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories