హీరోయిన్స్ ని పెళ్లాడిన టాలీవుడ్ హీరోలు... ఎందరు కలిసున్నారు? ఎందరు విడిపోయారు?


ప్రేమ విశ్వజనీనం అంటారు. ప్రేమకు ఎల్లలు లేవు. కులమతాలు, పేద ధనిక, భాషా బేధాలు, ప్రాంతాలకు అతీతమైంది. కలిసి సినిమాలు చేసిన హీరో హీరోయిన్స్ జీవిత భాగస్వాములుగా మారారు. హీరోయిన్స్ ని పెళ్లాడిన టాలీవుడ్ హీరోలు ఎవరో చూద్దాం... 

tollywood heroes who got married heroines and their relationship status ksr
Tollywood Heroes


సిల్వర్ స్క్రీన్ పై ఉత్తుత్తి ప్రేమ నటించిన హీరో హీరోయిన్స్ సీరియస్ లవర్స్ గా మారిపోయారు. వీరి ప్రేమలు పెళ్ళికి దారితీశాయి. కొందరు తమ బంధం శాశ్వతం చోసుకోగా కొందరు మాత్రం బ్రేకప్ చేసుకున్నారు. టాలీవుడ్ హీరోయిన్స్ ని పెళ్లాడిన హీరోలు ఎవరు? వారి బంధం ఎలా ఉందో? చూద్దాం... 

tollywood heroes who got married heroines and their relationship status ksr
Super Star Krishna

సీనియర్ హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ ఓ నటిని ప్రేమ వివాహం చేసుకున్నారు. కృష్ణ కెరీర్ బిగినింగ్ నుండి హీరోయిన్ విజయనిర్మలతో నటించారు. ఈ క్రమంలో వారి మధ్య అనుబంధం ఏర్పడింది.  ఆల్రెడీ ఇందిరాదేవికి భర్తగా ఉన్న కృష్ణ నటి విజయనిర్మలను రెండో వివాహం చేసుకున్నారు. చనిపోయేవరకు వీరు అన్యోన్యంగా ఉన్నారు. 


అక్కినేని హీరో నాగార్జునకు దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మితో మొదటి వివాహం జరిగింది. నాగ చైతన్య వీరి సంతానం. నాలుగేళ్ళ తర్వాత మనస్పర్థలతో విడిపోయారు. అనంతరం 1992లో నాగార్జున హీరోయిన్ అమలను ప్రేమ వివాహం చేసుకున్నారు. అఖిల్ వీరికి సంతానం. నాగార్జున-అమల అన్యోన్య దంపతులుగా ఉన్నారు. 


హీరో రాజశేఖర్ హీరోయిన్ జీవితను ప్రేమ వివాహం చేసుకున్నారు. అంకుశం, ఆహుతి వంటి హిట్ చిత్రాల్లో కలిసి నటించిన జీవిత-రాజశేఖర్  ప్రేమలో పడ్డారు. వీరు 1991లో వివాహం చేసుకున్నారు. వీరికి శివానీ, శివాత్మిక కూతుళ్లు. ఇద్దరూ హీరోయిన్స్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

Tollywood Heroes

పవన్ కళ్యాణ్ రెండో వివాహంగా రేణు దేశాయ్ ని చేసుకున్నారు. బద్రి మూవీ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దాంతో సహజీవనం చేశారు. అకీరా జన్మించాక 2009లో వివాహం చేసుకున్నారు. 2012లో వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం రష్యన్ నటి అన్నా లెజినోవాను మూడో వివాహం చేసుకున్నాడు. 

Tollywood Heroes


మహేష్ బాబు హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. వంశీ చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. షూటింగ్ చివరి రోజు ప్రేమను వ్యక్తపరుచుకున్నారట. 2005లో మహేష్-నమ్రత వివాహం చేసుకోగా అన్యోన్య దాంపత్యం సాగిస్తున్నారు... వీరికి గౌతమ్, సితార సంతానం. 

Tollywood Heroes

ఈ తరం హీరోల్లో అక్కినేని నాగ చైతన్య హీరోయిన్ సమంతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. సమంత మొదటి చిత్రం నాగ చైతన్య రెండో చిత్రం ఏమాయే చేశావే. ఈ మూవీ సెట్స్ లోనే మనసులు కలిశాయట. 2018లో గోవా వేదికగా హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ళ కాపురం తర్వాత 2021లో మనస్పర్థలతో విడిపోయారు. 

Tollywood Heroes

తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్నాడు. 2017లో మిస్టర్ మూవీలో కలిసి నటించిన వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. 2023 నవంబర్ 1న వీరి వివాహం ఇటలీ దేశంలో ఘనంగా జరిగింది.. 

Latest Videos

vuukle one pixel image
click me!