చీరకట్టుకే అందం తెచ్చిన త్రిష.. రెడ్ శారీలో మైమరిపించేలా ‘లియో’ బ్యూటీ మెరుపులు

First Published | Nov 2, 2023, 4:10 PM IST

సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan)  లేటెస్ట్ లుక్ కు ఫిదా అవ్వాల్సిందే. సంప్రదాయ దుస్తుల్లో ఈ ముద్దుగుమ్మ మెరిపించిన మెరుపులకు అభిమానులతో పాటు నెటిజ్లనూ మైమరిచిపోయేలా చేసింది. లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి. 
 

చెక్కు చెదరని అందంతో త్రిష అదరగొడుతూనే ఉంది. కోలీవుడ్, టాలీవుడ్ లో తన సత్తా చూపించిన ఈ సీరియర్ హీరోయిన్ .. ఇప్పటికీ వరుస చిత్రాల్లో నటిస్తూ సందడి చేస్తోంది. రీసెంట్ గా భారీ యాక్షన్ ఫిల్మ్ ‘లియో’ చిత్రంతో అలరించింది. 14 ఏళ్ల తర్వాత విజయ్ దళపతి సరసన వెండితెరపై మెరిసింది.
 

‘లియో’ చిత్రం మిక్డ్స్ టాక్ అందుకున్నప్పటికీ కలెక్షన్లలో మాత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ నిన్న చెన్నైలో సక్సెస్ మీట్ గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. విజయ్ దళపతి, త్రిష, లోకేష్ కనగరాజ్ హాజరయ్యారు. 
 


ఈవెంట్ కు హాజరైన త్రిష తన బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేసింది. రెడ్ డిజైన్డ్ శారీలో మంత్రముగ్ధులను చేసింది. తన క్యూట్ లుక్స్ తో కట్టిపడేసింది. చెక్కు చెదరని అందంతో అభిమానులను, వేడుకకు హాజరైన వారిని చూపు తిప్పుకోకుండా చేసింది. 

అలాగే తాజాగా అదేబ్యూటీఫుల్ శారీలో త్రిష ఫొటోషూట్ చేసింది. చీరకట్టులో సొగసుల ప్రదర్శనచేసింది. అందంతో మెస్మరైజ్ చేసింది. నాడు, నేడు గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గనివ్వకుండా ఆకర్షణీయమైన లుక్ తో ఆకట్టుకుంది. తన రూపసౌందర్యానికి ఫిదా అయ్యేలా చేసింది.
 

తాజాగా ఈ బ్యూటీఫుల్ ఫొటోలను త్రిష అభిమానులతో పంచుకుంటూ ఇంట్రెస్టింగ్ గా క్యాప్షన్ ఇచ్చింది. ‘లియో’ సక్సెస్ మీట్ హాజరైన తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. వేడుకను సక్సెస్ చేసి తనను ఖుషీ చేసినందుకు థ్యాంక్స్ చెప్పింది. ఇక ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

త్రిష సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అదరగొడుతోంది. ‘పొన్నియిన్ సెల్వన్’, ‘లియో’ వంటి భారీ చిత్రాలతో మళ్లీ జోష్ పెంచింది. ది రోడ్ చిత్రంతోనూ ఆకట్టుకుంది. ప్రస్తుతం తమిళంలో ‘సతురంగ వెట్టై 2’, మలయాళంలో ‘రామ్ : పార్ట్ 1’, ‘ఐడెంటిటీ’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 
 

Latest Videos

click me!