ఊరించే పెదాలు.. చురకత్తుల్లాంటి చూపులు.. ‘జపాన్’ బ్యూటీ మత్తెక్కించే ఫోజులకు ఫిదా అవ్వాల్సిందే..

First Published | Nov 2, 2023, 4:46 PM IST

యంగ్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ ఇటీవల సోషల్ మీడియాలో తరుచూగా కనిపిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. తన బ్యూటీఫుల్ లుక్స్ లో కట్టిపడేస్తోంది. తాజాగా క్యాజువల్ వేర్ లో దర్శనమిచ్చింది. 
 

కుర్ర హీరోయిన్ అనుఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) ప్రస్తుతం తమిళ స్టార్ కార్తీ సరసన ‘జపాన్’లో నటిస్తోంది. ఈ చిత్రంపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. తమిళంతో పాటు తెలుగులోనూ రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. కార్తీతో అనుకు హిట్ దక్కడం ఖాయమని అర్థమవుతోంది.
 

ఈ చిత్రం నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ట్రైలర్ లాంఛ్ ఈవెంట్, తదితర కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. మరోవైపు హీరోయిన్ గా నటించిన అను ఇమ్మాన్యుయేల్ కూడా ఈ సినిమాను తనవంతుగా ప్రమోట్ చేసుకుంటోంది.


ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తరుచుగా కనిపిస్తోంది. బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది. మొన్నటి వరకు చీరకట్టులో సందడి చేసిన ఈ బ్యూటీ తాజాగా క్యాజువల్ డ్రెస్ లో అదరగొట్టింది. 

అట్రాక్టివ్ వేర్ లో అదిరిపోయే ఫొటోషూట్ చేసింది. ట్రెడిషనల్ గా మెరిసినా.. తన గ్లామర్ తో మంత్రముగ్ధులను చేసింది. అలాగే తన రూపసౌందర్యంతో కట్టిపడేసింది. క్యూట్ గా ఫొటోలకు ఫోజులిస్తూ కలవరపెట్టింది. ఊరించే పెదాలు, చురకత్తుల్లాంటి చూపులతో మెస్మరైజ్ చేసింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ‘జపాన్’ చిత్రమొక్కట్టే ఉంది. ఈ సినిమా రిజల్ట్ పైనే నెక్ట్స్ ఆఫర్ ఆధారపడి ఉన్నాయి. మొత్తానికి సినిమా మంచి ఫలితాన్ని అందుకోబోతుందని ప్రమోషనల్ మెటీరియల్ చూస్తే అర్థమవుతోంది. 

అను ఇమ్మాన్యుయేల్ అమెరికాలోని చికాగోలోనే పుట్టి పెరిగింది. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసింది. మలయాళంలో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. తెలుగులో చాలా సినిమాలు చేసింది. తమిళం, తెలుగులోనూ ప్రస్తుతం సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ లో చివరిగా ‘రావణసుర’లో నటించింది. 

Latest Videos

click me!