పెళ్లి తర్వాత ఫస్ట్ టైం హీరోలు నటించిన చిత్రాలు..చిరు, వెంకీ, మహేష్ తో పాటు వీళ్ళ జాతకమే మారిపోయింది

First Published | Aug 11, 2024, 3:13 PM IST

స్టార్ హీరోలు పెళ్లి తర్వాత నటించిన మొదటి చిత్రాల్లో కొన్ని హిట్స్ ఉన్నాయి.. మరికొన్ని ఫ్లాపులు ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 

టాలీవుడ్ స్టార్ హీరోలు పెళ్లి తర్వాత నటించి విడుదలైన మొదటి చిత్రాలు వివరాలు తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారు. స్టార్ హీరోలు పెళ్లి తర్వాత నటించిన మొదటి చిత్రాల్లో కొన్ని హిట్స్ ఉన్నాయి.. మరికొన్ని ఫ్లాపులు ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 

వెంకటేష్ - కలియుగ పాండవులు : విక్టరీ వెంకటేష్ పెళ్లి చేసుకున్న తర్వాతే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 1985లో వెంకటేష్ వివాహం జరిగింది. వెంకటేష్ డెబ్యూ మూవీ కలియుగ పాండవులు 1986లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 

Also Read: లావణ్య మైండ్ సెట్ గురించి ఆర్జీవీ తప్ప ఇంకెవరూ ఇలా చెప్పలేరు..ఆడియో క్లిప్స్ గురించి సంచలనం


బాలకృష్ణ -సింహం నవ్వింది, సాహసమే జీవితం : నందమూరి బాలకృష్ణ, వసుంధరల వివాహం 1982లో జరిగింది. పెళ్లి తర్వాత బాలయ్య నటించిన మొదటి చిత్రం సింహం నవ్వింది. ఈ చిత్రంలో బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ తో కలసి నటించారు. బాలయ్య సోలో హీరోగా మొట్టమొదట నటించిన చిత్రం సాహసమే జీవితం. ఈ చిత్రం పెళ్లి తర్వాతే వచ్చింది. 

చిరంజీవి - అగ్ని సంస్కారం : అగ్ని సంస్కారం చిత్రం మెగాస్టార్ చిరంజీవికి చాలా స్పెషల్. ఎందుకంటే చిరంజీవి, సురేఖల వివాహం 1980 ఫిబ్రవరి 20న జరిగింది. ఆ మరుసటి రోజే ఫిబ్రవరి 21న చిరంజీవి హీరోగా నటించిన అగ్ని సంస్కారం చిత్రం రిలీజ్ అయింది. 

ఎన్టీఆర్ - ఊసరవెల్లి : యంగ్ టైగర్ ఎన్టీఆర్ , లక్ష్మి ప్రణతి ల వివాహం 2011లో జరిగింది. ఎన్టీఆర్ పెళ్లి తర్వాత విడుదలైన చిత్రం ఊసరవెల్లి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. 

మహేష్ బాబు - అతడు : మహేష్ బాబు, నమ్రత వివాహం 2005లో జరిగింది. మహేష్ పెళ్లి తర్వాత విడుదలైన ఫస్ట్ మూవీ అతడు. మహేష్ కెరీర్ లో బెస్ట్ మూవీలో అతడు కూడా ఉంటుంది. 

రాంచరణ్ - నాయక్ : రాంచరణ్, ఉపాసన 2012లో పెళ్లి చేసుకున్నారు. చరణ్ వివాహం తర్వాత రిలీజ్ అయిన మొదటి చిత్రం నాయక్. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది. 

అల్లు అర్జున్ - బద్రీనాథ్ : అల్లు అర్జున్, అల్లు స్నేహ 2011 మార్చి 6న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. బన్నీ పెళ్లి తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ బద్రీనాథ్. బద్రీనాథ్ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. 

నాగార్జున - విక్రమ్, అంతం : నాగార్జున కూడా పెళ్లి తర్వాతే హీరో అయ్యారు. నాగార్జున 1984లో దగ్గుబాటి లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. 1986లో నాగార్జున నటించిన తొలి చిత్రం విక్రమ్ రిలీజ్ అయింది. ఆమెతో విడిపోయిన తర్వాత అమలని రెండో పెళ్లి చేసుకున్నారు. అమలని పెళ్లి చేసుకున్న తర్వాత నాగార్జున నటించిన మొదటి చిత్రం అంతం. 

Latest Videos

click me!