మహేష్ బాబు ఫ్యాన్స్ పై డైరెక్టర్ కృష్ణవంశీ ఫైర్, సంస్కృతి నాశనం చేస్తున్నారన్న దర్శకుడు..

First Published | Aug 11, 2024, 1:13 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ పై మండిపడ్డారు దర్శుకుడు కృష్ణ వంశీ. మన సంస్కృతిని అపహాస్యం చేస్తున్నారంటూ.. ఫైర్ అయ్యారు. ఇంతకీ విషయం ఏంటంటే..? 
 

మహేష్ బాబుకు సూపర్ హిట్ సినిమా ఇచ్చిన దర్శకుడు కృష్ణ వంశీ ఏంటి.. మహేష్ బాబు ఫ్యాన్స్ పై మండి పడటం ఏంటి..? వింటానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. మహేష్ బాబు ఫ్యాన్స్ పై సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు కృష్ణ వంశీ. ఇంతకీ అసలు విషయం ఏంటి..? ఎందుకు ఆయన అలా అన్నారు కారణం ఏంటి..? వివరాల్లోకి వెళ్తే.. 
 

All So Read: అక్టోబర్ నుంచి రంగంలోకి పవన్ కళ్యాణ్... తోడుగా కమల్ హాసన్ కూడా..?

రీసెంట్ గా  ఆగస్టు 9న  సూపర్ స్టార్  మహేష్ బాబు  49వ పుట్టిన రోజును చాలా ఘనంగా సెలబ్రేట్ చేశారు అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహేష్ అభిమానులు మొత్తం సంబరాలు చేసుకున్నారు. ఈక్రమంలోనే మహేష్ బాబు గతంలో నటించి సూపర్ డూపర్ హిట్ అయిన మురారి సినిమాను ఆయన భర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు భారీగా రెస్పాన్స్ రావడంతో థియేటర్లలో సందడి వాతావరణం ఏర్పడింది.  ఈ సినిమా ఇప్పటికీ టీవీలలోనే కొన్ని వందల సార్లు వచ్చి ఉంటుంది. అయినా రీరిలీజ్ క్రేజ్ తో ఫ్యాన్స్ థియేటర్లకు పరుగులు తీశారు. 

All So Read:  జూనియర్ ఎన్టీఆర్ పాడిన సాంగ్స్ ఎన్నో తెలుసా..? అన్నీ సూపర్ హిట్ పాటలే..


ఇంతకు ముందు ఈ సినిమాను థియేటర్లలో చూడలేనివారంత.. అక్కడ  హంగామా చేశారు. భారీ రెస్పాన్స్ దో మురారి సినిమా 5 కోట్లకు పైగా రీరిలీజ్ కలెక్షన్లు సాధించింది.  ఇక ఇవన్నీ పక్కన పెడితే. థియేటర్లకు వెళ్ళిన జనం అక్షంతలు చల్లడం.. పూలు చల్లడం.. ఇక  ఓ ప్రేమ జంట అయితే ఏకంగా  థియేటర్‌లోనే ఈ సినిమా ప్లే అవుతుండగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  థియేటర్‌లోకి తాళిబొట్టును తీసుకువచ్చిన అబ్బాయి.. మురారి పెళ్ళి పాట వస్తున్న టైమ్ లో.. మహేష్  ఫ్యాన్స్‌ ముందే మూడు ముళ్లు వేశాడు. 

All So Read:  రీరిలీజ్ లో కూడా రికార్డ్ బ్రేక్ చేసి మహేష్ బాబు, మురారి ఎంత రాబట్టిందంటే..?

Murari

ఈ పెళ్లిని చూసిన ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో చాలామంది నెటిజన్లు ఈ పైత్యపు పెళ్ళిపై ఫైర్ అవుతున్నారు. యువత ఇలా తయారయ్యారేంటి అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటివి పెరిగితే.. సమాజానికి మంచింది కాదు అంటున్నారు. ఇక ఈ విషయంలో మురారి సినిమా దర్శకుడు కృష్ణ వంశీ కూడా స్పందించారు. ఈ విషయంలో ఆయన కూడా అసహనం వ్యక్తం చేశారు.

All So Read:  రజినీకాంత్ ప్రియురాలిగా ‌- తల్లిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా..? షాక్ అవుతారు

సోషల్ మీడియాలో ఓ నెటిజన్ కృష్ణ‌వంశీని ప్రశ్నించాడు. డైరెక్టర్  గారు.. మురారి మూవీలో ప్రేమ జంట మాదిరి.. థియేటర్ లో ఓ ప్రేమ జంట పెళ్లి చేసుకుంది. మీరు అది చూశారా.?' అంటూ ఓ అభిమాని కృష్ణవంశీని ఎక్స్‌లో ప్రశ్నించాడు.  దీనికి కృష్ణవంశీ రియాక్టయ్యారు. 'థియేట‌ర్‌లో పెళ్లి చేసుకోవ‌డం మంచిది కాదు. ఇలా చేసి మన గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను అపహాస్యం చేసి అవమానించకండి ప్లీజ్' అంటూ కృష్ణ‌వంశీ  రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. 

All So Read: పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా..? ఎలా మిస్ అయ్యిందబ్బా..?

Latest Videos

click me!