నాగ చైతన్య మరదలు ప్రొఫైల్ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది... అందంలో అక్క శోభిత సరిపోదు!

Published : Aug 11, 2024, 01:54 PM ISTUpdated : Aug 11, 2024, 02:38 PM IST

సడన్ గా శోభిత ధూళిపాళ్ల చెల్లెలు మీడియాలో హైలెట్ అవుతుంది. అందుకు కారణం ఆమె పేరు సమంత కావడమే. కాగా సమంత ధూళిపాళ్ల ప్రొఫైల్ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది.   

PREV
15
నాగ చైతన్య మరదలు ప్రొఫైల్ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది... అందంలో అక్క శోభిత సరిపోదు!
Samantha Dhulipala


ఒక సమంత నాగ చైతన్య జీవితంలో నుండి వెళ్ళిపోతే మరొక సమంత వచ్చి చేరింది. ఇప్పుడిదే హాట్ టాపిక్. నాగ చైతన్య మాజీ భార్య సమంత 2021లో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం నాగ చైతన్య, సమంత ఎవరి దారిలో వారు పోతున్నారు. ఎలాంటి సంబంధాలు లేవు. సమంత నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ విడుదలకు సిద్ధం అవుతుంది. హనీ బన్నీ టైటిల్ తో నవంబర్ 7 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. 
 

25
Samantha Dhulipala

మరోవైపు నాగ చైతన్య తండేల్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దర్శకుడు చందు మొండేటి ఎమోషనల్ లవ్ డ్రామాగా తండేల్ తెరకెక్కిస్తున్నాడు. తండేల్ చిత్రంలో నాగ చైతన్య జాలరి రోల్ చేయడం విశేషం. భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. తండేల్ దసరా కానుకగా విడుదల కానుందని సమాచారం. 
 

35
Samantha Dhulipala

కాగా నాగ చైతన్య రెండో వివాహానికి సిద్దమయ్యాడు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఆయనకు నిశ్చితార్థం జరిగింది. కొన్నాళ్లుగా నాగ చైతన్య-శోభిత రహస్య ప్రేమాయణం నడిపారు. వీరి రిలేషన్ పై కథనాలు వచ్చినా ఖండించారు. సడన్ గా నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు. హీరోయిన్ శోభితకు తెలుగులో అంత ఫేమ్ లేదు. రెండు చిత్రాలు మాత్రమే చేసింది. నాగ చైతన్యను వివాహం చేసుకోబుతున్న నేపథ్యంలో ఆమె టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. 
 

45
Samantha Dhulipala

అనూహ్యంగా శోభిత చెల్లెలు ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. అందుకు కారణం శోభిత సిస్టర్ పేరు సైతం సమంత కావడమే. మాజీ భార్యగా ఒక సమంత నాగ చైతన్య జీవితం నుండి వెళ్ళిపోయింది. అయితే మరదలు రూపంలో మరొక సమంత ఆయన లైఫ్ లోకి వచ్చినట్లు అయ్యింది. సమంత అందంలో అక్కకు పోటీ ఇస్తుంది. సమంత ధూళిపాళ్లకు పెళ్లైంది. ఆమె విదేశాల్లో సెటిల్ అయ్యింది. 
 

55
Samantha Dhulipala

సమంత ధూళిపాళ్ల వృత్తిరీత్యా డాక్టర్. రేడియో డయాగ్నసిస్ ఎఫ్ ఆర్ సి ఎస్ చేసింది. యూనివర్సిటీ ఆఫ్ బార్సిలోనా నుండి మెటర్నల్-ఫీటల్ మెడిసిన్ అందుకుంది. ఇక సోషల్ మీడియాలో సమంత ధూళిపాళ్ల చాలా యాక్టీవ్. గ్లామరస్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంది. సమంత దూళిపాళ్ల మంచి డాన్సర్ కూడాను. అలాగే ఆమె ట్రావెలర్. సాహసాలు చేసేందుకు ఇష్టపడుతుంది. సమంత ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని 17 వేల మంది ఫాలో అవుతున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories