ప్రైవేట్ జెట్ కలిగి ఉన్న టాలీవుడ్ హీరోలు
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు సినిమాల కోసం ఎంత కష్టపడతారో, ఆతరువాత వారు అంత లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. సినిమాల రెమ్యునరేషన్, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్స్, బిజినెస్ పెట్టుబడులతో కోట్ల రూపాయలు సంపాదించే ఈ స్టార్‌లు తమ ప్రయాణాల కోసం సొంతంగా ప్రైవేట్ జెట్‌లను కలిగి ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి ప్రముఖుల దగ్గర విలువైన ప్రైవేట్ విమానాలు ఉన్నట్లు సమాచారం. వీటిని వారు తమ సినిమా ప్రమోషన్లు, వ్యక్తిగత ప్రయాణాలు, రాజకీయ కార్యక్రమాల కోసం ఉపయోగిస్తున్నారు.