పక్కా స్కెచ్ తో బ్యాంక్ నుంచి 40 కోట్లు లేపేసిన తెలుగు సినీ నిర్మాత ఫ్రాడ్ కేసు

First Published | Jul 31, 2024, 6:15 AM IST

సినీ నిర్మాత గా.., రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా.. నటుడుగా అందరికీ పరిచయం అయ్యాడు. తనకు తాను పరిచయం చేసుకుంలూ మోసాలు మొదలు పెట్టారు.


ఓవర్ నైట్ ఎదిగిపోవాలి. అడ్డదారుల్లో  డబ్బు సంపాదించి నిర్మాత కావాల‌నే ఆశ‌తో.. అతను బయిలుదేరాడు! చేయని మోసం లేదు..తనపై లేని కేసు లేదు అన్నట్లు ముందుకు వెళ్లాడు. ఫైనాన్సియల్ క్రైమ్ లకు అలవాటు పడ్డాడు. మధ్యలో సినిమాలు చేసాడు కానీ ఏమీ ఆడలేదు. చివరకు హీరోగా కూడా ట్రై చేసాడు. అది వర్కవుట్ కాలేదు. తాజాగా బ్యాంక్ స్టాఫ్ ని మేనేజ్ చేసి 40 కోట్లు లేపేసాడు. కానీ అందులో అతని ప్రమేయం బయిటపడటంతో పోలీస్ లు వెతుకుతున్నారు. వివరాల్లోకి వెళితే..
 


 హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చెందిన షేక్‌ బషీద్‌ అనేక తెలుగు చిత్రాల్లో నటించడంతోపాటు నిర్మించాడు. హైదరాబాద్‌ సీసీఎస్‌ సహా పలు పోలీస్‌ స్టేషన్లలో ఆయనపై 10 చీటింగ్‌ కేసులున్నాయి. గతంలో  ఖ‌రీదైన ప్రాంతాల్లోని విలువైన  ఇళ్లు త‌న‌వేన‌ని నకిలీ ధ్రువ‌ప‌త్రాలు సృష్టించేశాడు! త‌ర్వాత వాటిపై వివిధ బ్యాంకుల్లో రుణం తీసుకుని.. దానిని సినిమాల‌కు పెట్టుబ‌డిగా పెట్టి సినిమాలు తీసేశాడు!! ఇలా తప్పుడు ధ్రువ‌ప‌త్రాలు సృష్టించి.. బ్యాంకుల‌కు కోట్ల‌లోనే టోక‌రా వేశాడు ఈ  టాలీవుడ్ నిర్మాత‌. చివ‌ర‌కు అత‌ని మోసం బ‌ట్ట‌బ‌య‌లైంది. చివ‌రికి క‌ట‌క‌టాలు లెక్క‌పెట్టాడు.  

Latest Videos



 నిందితుడు గుంటూరు వేజెండ్ల ప్రాంతానికి చెందిన షేక్‌ బషీద్‌ అలియాస్‌ బాసిత్‌. ఎవడ్రా హీరో.. చిత్ర హీరో గా నటించారు. బీకాం చదివిన బషీద్‌ తొలుత గుంటూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు. 2008లో హైదరాబాద్‌ వచ్చి ఎస్‌బీకే గ్రూప్‌ పేరుతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం, ముంబై, చెన్నై, బెంగళూరు, దుబాయ్‌లలో ఫైనాన్స్‌ సంస్థలను ప్రారంభించాడు.
 


చిన్నపాటి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు గ్యారెంటర్‌గా ఉండి రుణం ఇప్పిస్తానని చెప్పి మోసాలకు పాల్పడటానికి అలవాటు పడ్డారు. సినీ నిర్మాత గా.., రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా.. నటుడుగా అందరికీ పరిచయం అయ్యాడు. తనకు తాను పరిచయం చేసుకుంలూ మోసాలు మొదలు పెట్టారు.


ఇప్పుడు బషీద్ తనను తాను  సినీ నిర్మాతగా పరిచయం చేసుకుని,  తెరవెనుక ఉండి ఒక క్రైమ్ ప్లాన్ చేసాడు. బ్యాంకు మేనేజర్, ఉద్యోగి సహకారంతో రూ.40 కోట్లు కొల్లగొట్టాడు. ఇండస్‌ఇండ్‌ బ్యాంకు ఖాతాలో నుంచి రూ.40 కోట్లను దారి మళ్లించిన కేసును సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) పోలీసులు ఛేదించారు. 

ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ డీసీపీ ప్రసాద్‌ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారుఇండస్‌ఇండ్‌ బ్యాంకు శంషాబాద్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ కనుగుల రామస్వామితో కలిసి బషీద్‌ మోసానికి పథకం రచించాడు. దాని మేరకు ఆదిత్య బిర్లా హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థకు ముంబయిలోని నరీమన్‌ పాయింట్‌ ప్రాంతంలోని ఇండస్‌ఇండ్‌ బ్యాంకు శాఖలో ఉన్న ఖాతా నుంచి జులై 12న శంషాబాద్‌ బ్రాంచ్‌లో కుకునూరు ఉదయ్‌కుమార్‌రెడ్డి పేరుతో ఉన్న ఖాతాకు ఓసారి రూ.25 కోట్లు, మరోసారి రూ.15 కోట్లు రామస్వామితో పాటు బ్యాంకు ఉద్యోగి ఎస్‌.రాజేశ్‌ బదిలీ చేశారు. తర్వాత ఆ డబ్బును ఇతర ఖాతాలకు బషీద్‌ బదిలీ చేశాడు.
 


 వాటిని విత్‌డ్రా చేసుకుని.. రెండు కార్లు కొన్నాడు. రామస్వామికి ఓ కారు ఇచ్చాడు. లావాదేవీలు జరగడానికి 8 రోజుల ముందే ఉదయ్‌కుమార్‌రెడ్డి పేరుతో ఖాతా తెరవడం గమనార్హం. అనుమానాస్పద లావాదేవీ కావడంతో బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా.. విషయం బయటపడింది. జులై 15 నుంచి రామస్వామి విధులకు హాజరు కాకపోవడం, ఆచూకీ తెలియకపోవడంతో సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ పోలీస్‌స్టేషన్‌లో బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. 
 


దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. రామస్వామి, రాజేశ్‌లను ఈ నెల 24న హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. వారిని విచారించగా.. బషీద్‌ పేరు బయటపడింది. ఈవోడబ్ల్యూ ఏసీపీ మురళీకృష్ణ నేతృత్వంలోని బృందం అతన్ని సోమవారం దిల్లీలో అరెస్టు చేసి.. హైదరాబాద్‌కు తరలించింది.
 

click me!