రష్మి క్రేజ్‌ ముందు తేలిపోతున్న సుడిగాలి సుధీర్‌.. ఆ రేటింగ్‌లో వెనకబడిపోయిన మాజీ జబర్దస్త్ కమెడియన్‌..

Published : Jul 30, 2024, 11:13 PM IST

యాంకర్‌ రష్మి గౌతమ్‌ బుల్లితెరపై జోరు చూపిస్తుంది. అయితే ఆమె క్రేజ్‌ ముందు మాత్రం సుడిగాలి సుధీర్‌ తేలిపోతున్నాడు. ఆయన క్రేజ్‌ పనిచేయడం లేదు.   

PREV
15
రష్మి క్రేజ్‌ ముందు తేలిపోతున్న సుడిగాలి సుధీర్‌.. ఆ రేటింగ్‌లో వెనకబడిపోయిన మాజీ జబర్దస్త్ కమెడియన్‌..
Rashmi Gautam

 యాంకర్‌ రష్మి గౌతమ్‌.. జబర్దస్త్ షోకి, అలాగే `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోలకు యాంకర్ గా చేస్తుంది. పదేళ్లుగా అదే జోరుని చూపిస్తుంది. జబర్దస్త్ షోతోపాటు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీతోనూ తనదైన స్టయిల్‌లో అందాల విందుతోపాటు వినోదాన్ని పంచుతుంది రష్మి. ముద్దు ముద్దు మాటలతో అలరిస్తుంది. ఇప్పటికీ ఎవర్‌ గ్రీన్‌గా నిలుస్తుంది. 

25

అయితే జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్‌ తనతో పులిహోర కలిపారు. ఇద్దరు పడిపోయారు. కెమిస్ట్రీ నడిపించారు. కానీ సడెన్‌గా షోని వదిలేశాడు సుధీర్‌. హీరోగా బిజీ కావడంతో బుల్లితెరకి గుడ్‌ బై చెప్పాడు. హీరోగా రెండు సినిమాలు చేశారు. ఒకటి బాగానే ఆకట్టుకోగా, రెండోది డిజాస్టర్‌ అయ్యింది. దీంతో లెక్కలన్నీ మారిపోయాయి. ఓటీటీల ప్రభావం, థియేటర్‌ మార్కెట్‌ పడిపోవడంతో అది సుధీర్‌ సినిమాలపై ఎఫెక్ట్ పడింది. ఆయనతో చేయాల్సిన మూవీస్‌ కూడా ఆగిపోయినట్టు తెలుస్తుంది. 
 

35
photo-sarkaar4

దీంతో మళ్లీ బ్యాక్‌ వచ్చాడు సుడిగాలి సుధీర్‌. బుల్లితెరపై షోస్‌ చేస్తున్నాడు. ఈటీవీలో `ఫ్యామిలీ స్టార్స్` చేస్తున్నాడు. ఆహాలో `సర్కార్‌ 4` చేస్తున్నాడు. అయితే జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్‌ స్కిట్లు ఇచ్చిన కిక్‌ ఆయన యాంకర్‌గా చేస్తున్న షోస్‌ ఇవ్వడం లేదనే కామెంట్స్ వస్తుంది. ఓటీటీలో వచ్చే `సర్కార్‌ 4` బాగానే ఆకట్టుకుంటుంది. కానీ బుల్లితెరపై మాత్రం ఆయన సత్తా చాటలేకపోతున్నాడు. ఈ విషయంలో రష్మి కంటే వెనకబడిపోతున్నాడు. 
 

45

సుడిగాలి సుధీర్‌కి యూత్‌లో, ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి క్రేజ్‌ ఉంది. అది ఆయన షోకి హెల్ప్ కావాలి. కానీ రష్మి ముందు తేలిపోతుండటం గమనార్హం. ఇటీవల లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌ సర్వేలో రష్మి కంటే వెనకబడి పోయాడు సుధీర్‌. రష్మి యాంకర్‌గా చేస్తున్న `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి అర్బన్‌, రూరల్‌లో 3.94 రేటింగ్‌ ఉండగా, సుధీర్‌ `ఫ్యామిలీ స్టార్` 3.57 రేటింగ్‌ సాధించింది. ఇక అర్బన్‌లో రష్మి షోకి 5 టీఆర్‌పీ రేటింగ్‌ నమోదు అయితే సుధీర్‌ షోకి 2.9 రేటింగ్‌ వచ్చింది.  ఏరకంగానూ చూసిన రష్మి కంటే సుధీర్‌ వెనకబడిపోయాడని చెప్పొచ్చు. 
 

55

సుడిగాలి సుధీర్‌ జబర్దస్త్ లో చేసినంత కామెడీ `ఫ్యామిలీ స్టార్‌`లో చేయలేకపోతున్నాడు. షోకి వచ్చే వాళ్లు కూడా ఆ స్థాయిలో అలరించలేకపోతున్నాడు. సుధీర్‌ మాత్రమే తన భుజాలపై వాటిని మోయాల్సి వస్తుంది. పైగా షో కూడా రక్తికట్టేలా లేదు. చాలా వరకు డబుల్ మీనింగ్‌ డైలాగ్‌లతోనే నడిపిస్తున్నాడు. మిగిలిన కంటెస్టెంట్లు, తన మరదళ్లుగా చేస్తున్న స్రవంతి, భాను కూడా అలరించలేకపోతున్నారు. కానీ రష్మి మరింత జోరు పెంచి దూసుకుపోతుంది. ఇటు జబర్దస్త్ తో, మరోవైపు శ్రీ దేవి డ్రామా కంపెనీతో దుమ్మురేపుతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories