తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షోకి ఊపు తెచ్చిన నేషనల్‌ క్రష్‌.. వాళ్లు పాటలు, రష్మిక డాన్స్ ఉర్రూతలూగిపోయిందిగా..

Published : Jul 30, 2024, 11:41 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఫస్ట్ టైమ్‌ సింగింగ్‌ షోలో పాల్గొంది. ఆమె తెలుగు ఇండియన్ ఐడల్‌ సీజన్‌ 3 షోలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.   

PREV
16
తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షోకి ఊపు తెచ్చిన నేషనల్‌ క్రష్‌.. వాళ్లు పాటలు, రష్మిక డాన్స్ ఉర్రూతలూగిపోయిందిగా..

సింగర్స్ ని వెలికితీసే ఉద్దేశ్యంతో ప్రారంభించిన `తెలుగు ఇండియన్ ఐడల్‌` షో బాగా రన్‌ అవుతుంది. `ఆహా`లో దీన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు షోలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు మూడో సీజన్‌ రన్‌ అవుతుంది. 
 

26

ఈ షోలో ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. దీంతో హాట్‌ హాట్‌గా మారింది. ఎలిమినేషన్‌ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో షో హీటెక్కిపోతుంది. ఈక్రమంలో ఆ హీటు నుంచి రిలాక్స్ చేసేందుకు టీమ్‌ ప్లాన్‌ చేసింది. నేషనల్‌ క్రష్‌ని దించింది. 
 

36

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా.. తాజాగా ఈ తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 3కి గెస్ట్ గా రావడం విశేషం. ఆమె తనదైన గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తూనే హుందాగా కనిపించింది. షోలో రచ్చ రచ్చ చేసింది. ఆమెని సింగర్స్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. అదిరిపోయేలా రష్మిక కి వెల్‌కమ్‌ చెప్పడం విశేషం. 
 

46

అంతేకాదు వచ్చీ రాగానే ఆమెతో డాన్స్ చేయించారు. ఇందులో అదిరిపోయే డాన్స్ తో ఉర్రూతలూగించింది రష్మిక. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్‌ అవుతుంది. గెస్ట్ జడ్జ్ గా రష్మిక ఇందులో పాల్గొంది. ఈ షో శుక్ర, శనివారంలో 16, 17వ ఎపిసోడ్‌గా ప్రసారం కానుంది. 
 

56

తెలుగు ఇండియన్‌ ఐడల్ 3 వ సీజన్‌ షోకి రష్మిక మందన్నా రావడంతో ఈ షోకి ప్రత్యేకమైన ఆకర్షణ నెలకొంది. ఇందులో ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ షోలో శ్రీరామ్‌ చంద్ర యాంకర్‌గా ఉన్నాడు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌, గీతా మాధురీ జడ్జ్ లు గా ఉన్నారు.
 

66

ప్రస్తుతం రష్మిక మందన్నా ఓ వైపు గ్లామర్‌ రోల్స్ చేస్తుంది. మరోవైపు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తుంది. అందులో భాగంగా ఆమె `పుష్ప 2`, `సికందర్‌`, `కుబేర`, `ది గర్ల్ ఫ్రెండ్`, `రెయిన్‌బో` చిత్రాలు చేస్తుంది. నటిగా ఫుల్‌ బిజీగా ఉంది.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories