క్రేజీ డైరెక్టర్లకు పీడకల లాంటి చిత్రాలు.. కష్టం మొత్తం బూడిదపాలు

First Published Apr 11, 2024, 8:26 AM IST

సినిమాని విజయవంతం చేయడంలో దర్శకుడి శ్రమ వెలకట్టలేనిది. తన విజన్ కి తగ్గట్లుగా చిత్రాలని మలిచేందుకు దర్శకుడు స్క్రిప్ట్ స్టేజి నుంచి రిలీజ్ అయ్యే వరకు కష్టపడతారు. తప్పకుండా హిట్ కొట్టాలి అని కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా వారికి ఆ విజయం దక్కదు. సినిమా నేపథ్యాన్ని బట్టి దర్శకులు ఇంకాస్త ఎక్కువ కష్టపడుతుంటారు. అంత శ్రమ తీసుకున్నప్పటికీ అట్టర్ ఫ్లాప్ అయిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. టాలీవుడ్ దర్శకుల కష్టాన్ని వృధా చేసిన కొన్ని చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

అంజి :ఫాంటసీ ఫిక్షన్ చిత్రాలకు టాలీవుడ్ లో కోడి రామకృష్ణ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి చిత్రానికి కోడి రామకృష్ణ పడ్డ కాష్టం అంతా ఇంతా కాదు. ఈ మూవీ చిత్రీకరణలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. వాటన్నింటిని తట్టుకుని కోడి రామకృష్ణ ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. కానీ అంజి చిత్రం నిరాశాపరిచింది. కానీ ఈ చిత్రానికి సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. అంజి కనుక ఈ టైంలో రిలీజ్ అయి ఉంటే అద్భుతాలు సృష్టించేది అని చాలా మంది అంటుంటారు. 

లైగర్ :  పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలనుకున్న పూరి జగన్నాధ్ కి నిరాశే ఎదురైంది. విజయ్ దేవరకొండ హీరోగా భారీ మొత్తం ఖర్చు చేసి తెరకెక్కించిన లైగర్ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.  పూరి జగన్నాధ్ ఈ చిత్రం కోసం వెచ్చించిన డబ్బు, సమయం అంతా వృధా అయ్యాయి. 

1 నేనొక్కడినే : సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రాన్ని అభిమానులు మరచిపోలేరు. ఆ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ ఫ్యాన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. డైరెక్టర్ సుకుమార్ తో పాటు మహేష్ కూడా ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు. దురదృష్టవశాత్తూ ఆ సమయంలో ఆడియన్స్ కి ఈ మూవీ ఎక్కలేదు. 

అఖిల్ : అక్కినేని వారసుడు అఖిల్ ని తొలి చిత్రంతోనే స్టార్ హీరోగా నిలబెట్టాలని డైరెక్టర్ వివి వినాయక్ ఎంతో కష్టపడ్డారు. 'అఖిల్' టైటిల్ తో నితిన్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం తీవ్ర నష్టాలు మిగిల్చింది. 

కంచె : దేశాల మధ్య యుద్దాలని.. మనుషుల మధ్య కులాలు అనే కంచెల్ని రూపు మాపాలి అంటూ డైరెక్టర్ క్రిష్ చేసిన ప్రయత్నం కంచె చిత్రం. ఈ చిత్రంలో క్రిష్ చెప్పాలనుకున్న సందేశం చాలా బలంగా ఉంటుంది. హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ క్రిష్ ఇద్దరూ ఈ చిత్రం కోసం ఎంతో కాష్టపడ్డారు. కానీ ఫలితం దక్కలేదు. 

సాహో : బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం సాహూ. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్.. పైగా బాహుబలి తర్వాత నటిస్తున్న చిత్రం. దీనితో ఈ మూవీ భారీగా ఉండాలని డైరెక్టర్ సుజీత్ యాక్షన్ సీన్స్ తో ఏదో ట్రై చేసాడు కానీ వర్కౌట్ కాలేదు. 

శాకుంతలం :పౌరాణిక చిత్రాలపై తనకున్న మక్కువని డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం చిత్రంతో ప్రదర్శించాడు. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం వర్కౌట్ కాలేదు. గుణశేఖర్ పెట్టిన డబ్బు, సమయం పూర్తిగా వృధా అయ్యాయి. సమంత మయోసైటిస్ తో బాధపడుతూ కూడా ఈ చిత్రంలో నటించింది. 

ఆరెంజ్ : రాంచరణ్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఆరెంజ్. ఈ చిత్రంలోని కథని చూస్తే అంతగా కష్టపడాల్సిన మూవీ కాదని అనిపిస్తుంది. కానీ మగధీర తర్వాత చరణ్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో బొమ్మరిల్లు భాస్కర్ కొత్తగా ప్రయత్నించాలని చాలా కష్టపడ్డారు. ఆ టైంలో ఆ ఆడియన్స్ కి ఈ చిత్రం కనెక్ట్ కాలేదు. 

శక్తి :ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ భారీ బడ్జెట్ లో చేసిన ప్రయత్నం శక్తి చిత్రం. అప్పటికి ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని కమర్షియల్ గా వర్కౌట్ చేయాలని డైరెక్టర్ తీవ్రంగా శ్రమించారు. కానీ ఈ మూవీలో కథ ఎవరికీ నమ్మశక్యంగా అనిపించలేదు. ఫలితంగా డిజాస్టర్ అయింది. 

click me!