పవన్ ప్రకటనతో షూటింగ్స్ కి హైపర్ ఆది దూరం.. జబర్దస్త్ నుంచి ఎవరెవరంటే..

First Published Apr 10, 2024, 10:44 PM IST

బుల్లితెర క్రేజీ కమెడియన్ హైపర్ ఆది సందర్భం వచ్చినప్పుడల్లా మెగా ఫ్యామిలీపై తన అభిమానం చాటుకుంటుంటాడు. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి హైపర్ ఆది విధేయుడు. ఒక రకంగా చెప్పాలంటే హైపర్ ఆది జనసేన పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉంటున్నాడు.

బుల్లితెర క్రేజీ కమెడియన్ హైపర్ ఆది సందర్భం వచ్చినప్పుడల్లా మెగా ఫ్యామిలీపై తన అభిమానం చాటుకుంటుంటాడు. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి హైపర్ ఆది విధేయుడు. ఒక రకంగా చెప్పాలంటే హైపర్ ఆది జనసేన పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉంటున్నాడు. హైపర్ ఆది మైక్ పట్టుకుంటే ప్రత్యర్థులపై విమర్శలు పంచ్ డైలాగ్స్ రూపంలో జాలువారుతుంటాయి. 

హైపర్ ఆదికి జనసేన పార్టీపై ఉన్న అభిమానాన్ని, అతడి విధేయతని జనసేనాని తాజాగా గుర్తించారు. హైపర్ ఆదితో పాటు జనసేన పార్టీలో ఉన్న కొందరు సినీ సెలెబ్రెటీలకు పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయినర్లని నియమించారు. 

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుతో పాటు.. స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు, హైపర్ ఆది, మొగలిరేకులు సాగర్, కమెడియన్ పృథ్వీ, గెటప్ శ్రీను అదే విధంగా డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తారని జనసేన పార్టీ ప్రకటించింది. 

జనసేన పార్టీ నుంచి ప్రకటన రాగానే హైపర్ ఆది పిఠాపురంలో వాలిపోయారు. తనని స్టార్ క్యాంపైనర్ గా ప్రకటించడం పట్ల హైపర్ ఆది సంతోషం వ్యక్తం చేశాడు. ఎన్నికలయ్యే వరకు తాను షూటింగ్స్ కి దూరంగా ఉండబోతున్నట్లు హైపర్ ఆది సంచలన ప్రకటన చేశాడు. అంటే హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటి షోలకు దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. 

తన సాటి జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీనుకి కూడా జనసేన పార్టీ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపైనర్ గా అవకాశం లభించింది. గెటప్ శ్రీను కూడా బుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై అవకాశాలు అందుకుంటున్నాడు. 

ఇక కమెడియన్ పృథ్వీ చాలా కాలంగా జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. జానీ మాస్టర్ అయితే ఆల్రెడీ జనసేన పార్టీ కోసం  తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం షురూ చేశారు. జానీ మాస్టర్ జనసేన పార్టీ కోసం ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేసి పెర్ఫామ్ చేశాడు. జంగ్ సైరన్ అనే సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇక మొగలిరేకులు టీవీ సీరియల్ తో పాపులర్ అయిన సాగర్ కూడా జనసేన కోసం రంగంలోకి దిగనున్నారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు కూడానా జనసేన పార్టీ స్టార్ క్యాంపైనర్ గా నియమితులయ్యారు. మొదట వైసిపిలో చేరిన రాయుడు కొన్ని కారణాల వల్ల ఆ పార్టీకి విభేదించాడు. అనంతరం బయటకి వచ్చి జనసేనలో చేరారు. వీళ్లంతా నాగబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీకి ప్రచారం చేస్తారు. 

click me!