హీరోలకు మాత్రమే కాదు.. డైరెక్టర్లకి కూడా కొందరు లక్కీ హీరోయిన్లు ఉన్నారు. రాజమౌళి, త్రివిక్రమ్, పూరి జగన్నాధ్, అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్లు తమ లక్కీ హీరోయిన్లని రిపీట్ చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఆ వివరాలు ఇవే.
హీరోలకు మాత్రమే కాదు.. డైరెక్టర్లకి కూడా కొందరు లక్కీ హీరోయిన్లు ఉన్నారు. రాజమౌళి, త్రివిక్రమ్, పూరి జగన్నాధ్, అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్లు తమ లక్కీ హీరోయిన్లని రిపీట్ చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఆ వివరాలు ఇవే.
210
Mangalavaram
అజయ్ భూపతి - పాయల్ రాజ్ పుత్
క్రేజీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ డైరెక్టర్ అజయ్ భూపతికి ఎంత లక్కీనో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఎక్స్ 100, గత ఏడాది వచ్చిన మంగళవారం చిత్రాలు మంచి విజయం సాధించాయి.
310
ఇలియానా- త్రివిక్రమ్
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇలియానా జులాయి, జల్సా చిత్రాల్లో నటించింది. జల్సా సూపర్ హిట్ కాగా.. జల్సా కూడా మంచి సక్సెస్ నే అందుకుంది. అందుకే ఇలియానా త్రివిక్రమ్ కి లక్కీ హీరోయిన్.
410
పూరి జగన్నాధ్- రక్షిత
రక్షిత టాలీవుడ్ లో నటించింది తక్కువ చిత్రాల్లోనే. కానీ ఆమె పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇడియట్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. శివమణి చిత్రంలో కూడా రక్షిత సెకండ్ హీరోయిన్ గా నటించింది.
510
శేఖర్ కమ్ముల- సాయి పల్లవి
సాయి పల్లవి లోని నటనా నైపుణ్యాన్ని బాగా వాడుకున్న డైరెక్టర్ అంటే శేఖర్ కమ్ముల అని చెప్పొచ్చు. ఫిదా చిత్రంలో సాయి పల్లవి నటన డామినేటింగ్ గా ఉంటుంది. ఆ మూవీ సూపర్ హిట్. అదే విధంగా లవ్ స్టోరీ చిత్రం కూడా మంచి సక్సెస్ గా నిలిచింది.
610
సమంత- త్రివిక్రమ్
త్రివిక్రమ్ సమంతని కూడా రిపీట్ చేసి విజయాలు అందుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో అత్తారింటికి దారేది, అ..ఆ.., సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు వచ్చాయి. వీటిలో సన్నాఫ్ సత్యమూర్తి పర్వాలేదనిపించగా మిగిలిన రెండు సూపర్ హిట్స్ గా నిలిచాయి.
710
వెంకీ కుడుముల - రష్మిక
రష్మికని టాలీవుడ్ కి పరిచయం చేసిన దర్శకుడు వెంకీ కుడుముల. దీనితో రష్మికకి వెంకీతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఛలో వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మిక నటించిన ఛలో, భీష్మ రెండు చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి.
810
f2 movie
అనిల్ రావిపూడి - మెహ్రీన్
అనిల్ రావిపూడికి కలిసొచ్చిన హీరోయిన్ మెహ్రీన్ కౌర్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెహ్రీన్ రాజా ది గ్రేట్, ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాల్లో నటించింది. ఎఫ్ 3 నిరాశపరిచింది కానీ మిగిలిన రెండు విజయం సాధించాయి.
910
హరీష్ శంకర్ - పూజా హెగ్డే
హరీష్ శంకర్ దర్శకత్వంలో పూజా హెగ్డే డీజే, గద్దలకొండ గణేష్ లాంటి చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాల్లో పూజా హెగ్డే తన గ్లామర్ తో యువత ఫేవరిట్ గా మారిపోయింది.
1010
రాజమౌళి - అనుష్క
దర్శక ధీరుడు రాజమౌళి హీరోయిన్లని రిపీట్ చేసేది చాలా అరుదు. ఆయన రిపీట్ చేసిన హీరోయిన్ అంటే అనుష్క మాత్రమే. విక్రమార్కుడు, బాహుబలి చిత్రాల్లో అనుష్క నటించింది. వాటి రిజల్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.