కల్కి కథ ఇదే, యుద్ధం వారి మధ్యే... ట్రైలర్ లో హైలెట్స్ ఏంటంటే?

Published : Jun 10, 2024, 08:47 PM IST

కల్కి 2829 AD  ట్రైలర్ వచ్చేసింది.  ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ట్రైలర్ లో కథపై హింట్ ఇచ్చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రభాస్ నటించిన కల్కి చిత్ర ట్రైలర్ హైలెట్స్ ఏమిటో చూద్దాం..   

PREV
19
కల్కి కథ ఇదే, యుద్ధం వారి మధ్యే... ట్రైలర్ లో హైలెట్స్ ఏంటంటే?
Kalki 2829 AD Trailer

కల్కి మూవీ కథపై మొదటి నుండి ఒక కన్ఫ్యూషన్ ఉంది. ఇది టైం మెషీన్ కథ అని, హీరో కాలాల్లో ప్రయాణం చేస్తాడని మొదట్లో ప్రచారం జరిగింది. ఇటీవల కల్కి మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ అని మేకర్స్ తెలియజేశారు. 
 

29
Kalki 2829 AD Trailer

కాగా కల్కి మూవీ కథ ఏమిటి ? ఎలా ఉండబోతుంది? అనే విషయాలపై ట్రైలర్ అవగాహన కల్పించేదిగా ఉంది. రెండు నిమిషాలకు పైగా నిడివి కలిగిన ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. 

 

39
Kalki 2829 AD Trailer

ట్రైలర్ ప్రకారం కల్కి కథ ఏమిటంటే... విశ్వంలో కాంప్లెక్స్ ఒక అందమైన ప్రపంచం. దానికి యాస్ అధిపతి. భైరవ(ప్రభాస్) కాంప్లెక్స్ కి వెళ్లాలని కలలు కంటూ ఉంటాడు. అందుకు భైరవకు వన్ మిలియన్ యూనిట్స్ కావాలి. ఆ యూనిట్స్ సంపాదించే పనిలో ఉంటాడు. 

49
Kalki 2829 AD Trailer

యాస్ కి పద్మ(దీపికా పదుకొనె) కావాలి. ఆమె కోసం వెతుకుతూ ఉంటాడు. పద్మకు ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు అశ్వద్ధామ(అమితాబ్) రక్షకుడిగా ఉంటాడు. యాస్ కి పద్మను తెచ్చి అప్పగిస్తానని భైరవ మాట ఇస్తాడు. 

 

59
Kalki 2829 AD Trailer

ఈ క్రమంలో భైరవ-అశ్వద్ధామ మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు? యాస్ కి పద్మ ఎందుకు కావాలి? భైరవ కాంప్లెక్స్ కి వెళ్లాడా? అనేది మిగతా కథ.. 
 

69
Kalki 2829 AD Trailer

ట్రైలర్ లో విజువల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఆ మాత్రం బడ్జెట్ లో ఈ రేంజ్ విజువల్స్ ఇవ్వడం గొప్ప విషయం. అలాగే ఒక బలమైన కథను రాసుకున్నాడు అనిపిస్తుంది. 

79
Kalki 2829 AD Trailer

సినిమాటోగ్రఫీ, విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ట్రైలర్ లో హైలెట్ అని చెప్పాలి. అయితే ఫక్తు హాలీవుడ్ తరహా మేకింగ్ తెలుగు ఆడియన్స్ కి ఎక్కుతుందా అనే సందేహాలు ఉన్నాయి. సాహో తరహాలో తెలుగు ఆడియన్స్ రిజెక్ట్ చేసే ప్రమాదం లేకపోలేదు. 

89
Kalki 2829 AD Trailer

బలమైన పాత్రల మధ్య ఎమోషనల్ కనెక్షన్ ఉండాలి. అది మిస్ అయితే సినిమా ఎంత విజువల్ వండర్ గా ఉన్నా ఆడియన్స్ మెచ్చకపోవచ్చు. దీపికా పదుకొనె, అమితాబ్, దిశా పటాని,  వంటి ప్రధాన పాత్రలతో పాటు రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం వంటి కొత్త పాత్రలు పరిచయం చేశారు. 

 

99
Kalki 2829 AD Trailer

కల్కి జూన్ 27న వరల్డ్ వైడ్ పలు భాషల్లో విడుదల కానుంది. ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. 

Read more Photos on
click me!

Recommended Stories