పోకిరి తర్వాత ఇలియానా టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసింది. యువతకి నచ్చే విధంగా నాజూగ్గా ఆమె కనిపించడంతో ఇలియానా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ టైంలో ఇలియానానే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్. ఇలియానా టాలీవుడ్ లో మహేష్, పవన్, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా స్టార్ హీరోలందరితో నటించింది.