దర్శకుల కెరీర్ ని ముంచేసిన చిత్రాలు.. కోలుకోవడం కష్టమే?

First Published Aug 8, 2019, 11:23 AM IST

సినీ రంగాల్లో ప్లాప్ వస్తే కోలుకోవడం చాలా కష్టం. ఒకప్పుడు సక్సెస్ అందుకున్న దర్శకులకి ఊహించని విధంగా ఫెయిల్యూర్స్ ఎదురవ్వడంతో మరో అవకాశం అందుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. అలాంటి దర్శకులపై ఓ లుక్కేద్దాం.. 

శ్రీను వైట్ల: ఆగడు సినిమా నుంచి ఈ దర్శకుడికి అపజయాలు మొదలయ్యాయి. ఆ సినిమా ఆడియెన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. పైగా గబ్బర్ సింగ్ ఫార్మాట్ ని ఫాలో అయ్యారని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అనంతరం శ్రీను వైట్ల చేసిన ఏ సినిమా కూడా యూ టర్న్ ఇవ్వలేకపోయింది.
undefined
గుణశేఖర్: 2003లో ఒక్కడు సినిమా తరువాత చేసిన సినిమాలేవీ ఈ డైరెక్టర్ కి అనుకున్నంతగా గుర్తింపు తీసుకురాలేదు. ముఖ్యంగా నిప్పు సినిమా గుణశేఖర్ కి ఉన్న కాస్త క్రేజ్ ని కూడా చెడగొట్టేసింది. ఆ తరువాత రుద్రమదేవి చేసినప్పటికీ నష్టాలూ రాకుండా సేవ్ అయ్యారే గాని అనుకున్నంతగా లాభాలు అందుకోలేకపోయారు.
undefined
వివి.వినాయక్: మాస్ చిత్రాలతో యూత్ కి బాగా కనెక్ట్ అయిన వినాయక్ ఖైదీ నెంబర్ 150తో సెట్టయ్యాడు అనుకునేలోపే సాయి ధరమ్ తో చేసిన ఇంటిలిజెంట్ గట్టి దెబ్బె కొట్టింది. ఆ తరువాత ఆఫర్స్ రావడమే కష్టంగా మారింది. ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్ లో హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు.
undefined
శ్రీకాంత్ అడ్డాల: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో ఈ తరానికి మల్టీస్టారర్ ట్రెండ్ ని స్టార్ట్ చేసిన శ్రీకాంత్ ని బ్రహ్మోత్సవం సినిమా గట్టి దెబ్బె కొట్టింది. ఆ తరువాత మరో అవకాశం ఇవ్వడానికి ఎవరు దైర్యం చేయడం లేదు.
undefined
బి.గోపాల్: నరసింహుడు సినిమా తరువాత ఈ దర్శకుడు కోలుకోవడానికి నాలుగేళ్లు పట్టింది. ఆ సినిమా ఎఫెక్ట్ ఇప్పటికి ఎవరు మర్చిపోలేరు. ఆ తరువాత మస్కా సినిమా చేసిన అది వర్కౌట్ కాలేదు. అలాగే గోపీచంద్ తో తీసిన ఆరడుగుల బుల్లెట్ రిలీజ్ కాకుండానే అటకెక్కింది.
undefined
మెహర్ రమేషే: బిల్లా సినిమాతో బారి ప్రాజెక్టులను డీల్ చేయగల సత్తా ఉన్న దర్శకుడని రమేష్ ని నమ్మిన నిర్మాతలు కోలుకొని దెబ్బ తిన్నారు. ముఖ్యంగా శక్తి సినిమా పెద్ద డిజాస్టర్ కావడంతో ఈ దర్శకుడికి ఆఫర్స్ తగ్గిపోయాయి. ఆ తరువాత ఎదో కష్టపడి చేసిన షాడో కూడా మరింత పెద్ద దెబ్బ కొట్టగానే ఇండస్ట్రీకి దూరం అయ్యాడు.
undefined
కృష్ణ వంశీ: మహాత్మ సినిమా ముందు వరకు కృష్ణ వంశీకి ఉన్న క్రేజ్ వేరు. కానీ మొగుడు సినిమా తరువాత ఆయన స్టామినా తగ్గిందనే కామెంట్స్ జోరుగా వినిపించాయి. ఇక గోవిందుడు అందరివాడే - నక్షత్రం సినిమాలు మరింత దెబ్బ కొట్టాయి
undefined
దశరథ్ : సంతోషం - మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దశరథ్ గ్రీకు వీరుడు సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ అందుకున్నాడు. ఆ తరువాత చేసిన శౌర్య కూడా ప్లాప్ కావడంతో మరో అవకాశం దక్కలేదు.
undefined
కరుణాకరన్: తొలిప్రేమ సినిమాతో టాలీవుడ్ కి సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ఈ దర్శకుడు డార్లింగ్ వరకు బాగానే మెప్పించాడు. కానీ ఆ తరువాత చేసిన ఎందుకంటె ప్రేమంట సినిమా బెడిసికొట్టింది. అలాగే చిన్నదాన నీ కోసం - తేజ్ ఐ లవ్ యూ సినిమాలు కూడా డిజాస్టర్ కావడంతో అవకాశాలు రావడం లేదు.
undefined
సంకల్ప్ రెడ్డి: మొదటి సినిమా ఘాజి తోనే నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్ ఆ తరువాత అంతరిక్షం అనే సినిమా చేశాడు. అయితే ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఏ మాత్రం ఆకట్టుకోకపోవడంతో అంతకుముందు వచ్చిన ఆఫర్స్ కూడా సంకల్ప్ కి దూరమయ్యాయి.
undefined
click me!