నా ఫ్యాన్స్ రచ్చ మొదలెట్టారు.. 'హంబుల్' లాంచ్ లో మహేష్ బాబు(ఫొటోస్)

First Published Aug 7, 2019, 9:08 PM IST

మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మహర్షి చిత్రంలో మహేష్ ఘనవిజయం సొంతం చేసుకున్నాడు. మహేష్ బాబు వ్యాపారరంగంలో కూడా బిజీగా మారుతున్నారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ టాప్ హీరోగానే కాదు బిజినెస్ మ్యాన్ గా కూడా దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా తాను వస్త్ర వ్యాపారరంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు మహేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
undefined
మహేష్ బాబు స్పాయిల్ సంస్థ భాగస్వామ్యంతో హంబుల్ బ్రాండ్ పేరుతో దాదాపు 160 రకాల దుస్తుల్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
undefined
హంబుల్ బ్రాండ్ లాంచింగ్ కార్యక్రమం బుధవారం రోజు పార్క్ హయత్ హోటల్ లో గ్రాండ్ గా జరిగింది.
undefined
మహేష్ బాబు ఈ ఈవెంట్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఈ ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ.. మరో రెండు రోజుల్లో నా పుట్టినరోజు ఉంది. నా అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో హంబుల్ బ్రాండ్ ని లాంచ్ చేయడం సంతోషంగా ఉందని మహేష్ బాబు తెలిపాడు.
undefined
మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ చిత్రంలో నటించాడు. కానీ ఇప్పుడు క్రమంగా రియల్ బిజినెస్ మ్యాన్ గా మారుతున్నాడు. మహేష్ బాబు ఇప్పటికే ఏఎంబి సినిమాస్ పేరుతో మల్టిప్లెక్స్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
undefined
ఈ కార్యక్రమంలో మహేష్ బాబు మీడియాతో పలు విషయాలు పంచుకున్నాడు.
undefined
చెక్స్ షర్టులు, లైట్ జీన్స్ ధరించడం తనకు ఇష్టం అని మహేష్ బాబు తెలిపాడు.
undefined
సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక ఈ చిత్రంలో హీరోయిన్.
undefined
click me!