హరికృష్ణతో పోల్చుతూ జూ.ఎన్టీఆర్ ని ఎగతాళి చేసిన కమెడియన్..తారక్ ఎలా సమాధానం చెప్పాడో తెలుసా

Published : Apr 03, 2024, 11:09 AM ISTUpdated : Apr 03, 2024, 12:02 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ని ఒకసారి గమనిస్తే టాలీవుడ్ లో సునామి గుర్తుకు వస్తుంది. వరదలా మొదలైన ఎన్టీఆర్ కెరీర్ సింహాద్రి చిత్రంతో సునామిగా మారింది. సింహాద్రి చిత్రంతో తారక్ పీక్ స్టేజ్ కి వెళ్ళాడు.

PREV
17
హరికృష్ణతో పోల్చుతూ జూ.ఎన్టీఆర్ ని ఎగతాళి చేసిన కమెడియన్..తారక్ ఎలా సమాధానం చెప్పాడో తెలుసా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ని ఒకసారి గమనిస్తే టాలీవుడ్ లో సునామి గుర్తుకు వస్తుంది. వరదలా మొదలైన ఎన్టీఆర్ కెరీర్ సింహాద్రి చిత్రంతో సునామిగా మారింది. సింహాద్రి చిత్రంతో తారక్ పీక్ స్టేజ్ కి వెళ్ళాడు. ఆ తర్వాత అనేక పరాజయాలతో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. 

27

మరోసారి రాజమౌళితో యమదొంగ చిత్రం చిత్రం చేసేవరకు తారక్ కి ఇబ్బందులు తప్పలేదు. ఒక దశలో ఎన్టీఆర్ ట్రోలింగ్ కూడా ఎదురుకొన్నాడు. రాఖీ చిత్రం సమయంలో తారక్ బరువుపై అనేక కామెంట్స్ వినిపించాయి.  కొందరు నేరుగా తారక్ కే చెప్పారట. 

37

ఆ సమయంలో కమెడియన్ అలీతో జరిగిన సంఘటన గుర్తొచ్చి తారక్ ఒక సందర్భంలో రివీల్ చేశాడు. అలీ, ఎన్టీఆర్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. యమదొంగ చిత్రంలో వీళ్లిద్దరి మధ్య సన్నివేశాలు భలే ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. గతంలో జయప్రదతో జరిగిన ఇంటర్వ్యూలో ఆమె తారక్ ని అడిగింది. యమదొంగకి ముందు ఎన్టీఆర్.. యమదొంగ తర్వాత ఎన్టీఆర్ ని పోల్చుకుంటే ఎలా అనిపిస్తోంది అని జయప్రద అడిగింది. 

47

దీనికి తారక్ ఫన్నీగా బదులిస్తూ ఆయన మా అన్నయ్య.. నేను తమ్ముడిని అని చెప్పాడు. ఇక అలీతో జరిగిన సంఘటన వివరిస్తూ.. యమదొంగ షూటింగ్ జరుగుతుండగా.. అలీ అన్నా ఇప్పుడు ఎలా ఉన్నాను అని అడిగా. అలీ అన్న నాపై కౌంటర్ వేశారు. ఇంతకు ముందు హరికృష్ణ గారికి తండ్రిలా ఉండేవాడివి.. ఇప్పుడు జూ ఎన్టీఆర్ కికొడుకులా ఉన్నావు అన్నాడు. దీనితో నవ్వేశాడట. 

57

ఆ తర్వాత ఏంటన్నా నేను ఇంతకు ముందు అంత చెండాలంగా ఉన్నానా.. హరికృష్ణ తండ్రిలా ఉన్నాను అన్నావు.. పోనిలే హరికృష్ణ తండ్రి అంటే రామారావు గారేగా.. ఆయనతో పోల్చినందుకు నేను హ్యాపీ అంటూ సింపుల్ గా బదులిచ్చాడట.  

67

యమదొంగ చిత్రం కోసం తారక్ ఒక్కసారిగా బరువు తగ్గి ఆశ్చర్యపరిచాడు. ఆ చిత్రంతో తారక్ పై వచ్చిన విమర్శలన్నింటికీ చెక్ పెట్టినట్లు అయింది. యమదొంగ చిత్రం నుంచి తారక్ ఎప్పుడూ ఫిట్ నెస్ కోల్పోలేదు. పర్ఫెక్ట్ ఫిజిక్ మైంటైన్ చేస్తూ అబ్బురపరుస్తున్నాడు. 

77

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ మాస్ లుక్ లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. నాన్నకు ప్రేమతో లాంటి చిత్రాల్లో స్టైలిష్ గా కనిపించాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీలో నటిస్తున్నాడు. 

click me!

Recommended Stories