సుడిగాలి సుధీర్ కి పోటీ... హీరోగా మరో జబర్దస్త్ కమెడియన్, ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్!

First Published | Apr 3, 2024, 10:03 AM IST


జబర్దస్త్ కమెడియన్స్ ఒక్కొక్కరిగా హీరోలుగా మారుతున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ఇప్పటికే ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ముక్కు అవినాష్ హీరో అవుతున్నట్లు సమాచారం అందుతుంది. 
 

Sudigali Sudheer


జబర్దస్త్ వేదికగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, అనసూయ, రష్మీ గౌతమ్ తో పాటు పలువురు స్టార్స్ అయ్యారు. అటు బుల్లితెరను ఇటు వెండితెరను షేక్ చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. ఆయన నటించిన గాలోడు మూవీ సూపర్ హిట్ కొట్టింది. వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.

తాజాగా ముక్కు అవినాష్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. అవినాష్ ఏళ్ల తరబడి జబర్దస్త్ వేదికగా అలరించారు. తన కామెడీ పంచులతో ఆకట్టుకున్నాడు. 2020లో ఆయన జబర్దస్త్ వీడాడు. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న అవినాష్ జబర్దస్త్ కి దూరం కావాల్సి వచ్చింది. 
 



అగ్రిమెంట్ బ్రేక్ చేసి బిగ్ బాస్ షోకి వెళ్లినందుకు మల్లెమాల సంస్థకు రూ. 10 లక్షలు చెల్లించినట్లు ముక్కు అవినాష్ తెలియజేశాడు. ఆ సంస్థతో అవినాష్ కి విభేదాలు ఏర్పడిన నేపథ్యంలో మరలా జబర్దస్త్ కి రాలేదు. పూర్తిగా ఈటీవీ కి దూరం అయ్యాడు. 
 


కొన్నాళ్లుగా అవినాష్ స్టార్ మా లో మాత్రమే కనిపిస్తున్నాడు. శ్రీముఖితో పాటు పలు షోలలో సందడి చేస్తున్నాడు. కాగా అవినాష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మేరకు ఆయన స్వయంగా వివరాలు వెల్లడించాడు.  


ఓ కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ ని మీరు హీరోగా నటిస్తున్నారట కదా అని అడగ్గా... హీరో అనే ట్యాగ్ నాకు సూట్ కాదు. ఆ మాట కూడా భరించలేను. నేను ఆ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నానని మాత్రం చెప్పగలను. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో షూటింగ్ మొదలవుతుంది... అని అన్నారు. 
 

ఈ క్రమంలో సుడిగాలి సుధీర్ కి పోటీగా అవినాష్ రంగంలోకి దిగుతున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గెటప్ శ్రీను సైతం హీరోగా మారాడు. రాజు యాదవ్ టైటిల్ తో ఆయన ఒక చిత్రం చేస్తున్నాడు. జబర్దస్త్ కమెడియన్స్ ఒక్కొక్కరిగా హీరోలుగా మారడం విశేషం. 
 

Latest Videos

click me!