బాలకృష్ణ- కిరణ్ కుమార్ రెడ్డి నుంచి నాని- యాంకర్ ప్రదీప్ వరకు..కలిసి చదువుకున్న సెలెబ్రిటీలు, ఎవరిదారి వారిదే

Published : Oct 16, 2025, 03:42 PM IST

tollywood celebrities: టాలీవుడ్ లో కొందరు సెలెబ్రిటీలు క్లాస్ మేట్స్ గా ఉన్నారు. కొందరు టాలీవుడ్ హీరోలకు రాజకీయ నాయకులు కూడా క్లాస్ మేట్స్ గా ఉన్నారు. బాలకృష్ణ- కిరణ్ కుమార్ రెడ్డి ఒకే కాలేజీలో చదువుకున్నారు. 

PREV
18
కలిసి చదువుకున్న సెలెబ్రిటీలు 

టాలీవుడ్ లో చాలా మంది సెలెబ్రిటీలు కలిసి చదువుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ- మురళి మోహన్, బాలకృష్ణ - కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు ఇంకా చాలా మంది కలసి చదువుకున్న సెలెబ్రిటీలు ఉన్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

28
సూపర్ స్టార్ కృష్ణ - మురళి మోహన్ 

సూపర్ స్టార్ కృష్ణ, మురళి మోహన్ సినిమాల్లోకి రాకముందు బెజవాడలోని ఓ కాలేజీలో క్లాస్ మేట్స్. కృష్ణని తామంతా ముద్దుగా దేవుడు అని పిలిచేవాళ్ళం అని మురళి మోహన్ తెలిపారు. తామిద్దరం ఫస్ట్ బెంచ్ లో బుద్ధిమంతులు లాగా కుర్చునేవాళ్ళం. అస్సలు అల్లరి చేసేవాళ్ళం కాదు అని మురళి మోహన్ గుర్తు చేసుకున్నారు. 

38
నందమూరి బాలకృష్ణ - కిరణ్ కుమార్ రెడ్డి 

నట సింహం నందమూరి బాలకృష్ణ, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నిజాం కాలేజీలో కలిసి చదువుకున్నారు. కాకపోతే బాలయ్య కిరణ్ కుమార్ రెడ్డి కంటే ఒక సంవత్సరం సీనియర్. కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా పదవీ భాద్యతలు స్వీకరించినప్పుడు బాలయ్య అర్ధరాతి ఫోన్ చేసి అభినందించారట. బాలయ్య ఇప్పటికీ తనకు మంచి మిత్రుడు అని కిరణ్ కుమార్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

48
వైఎస్ జగన్ - సుమంత్

హీరో సుమంత్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇద్దరూ స్కూల్ మేట్స్. హైదరాబాద్ లో వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. సుమంత్ ఏమో సినిమా నటుడు కాగా.. వైఎస్ జగన్ రాజకీయాల్లో రాణిస్తున్నారు.

58
మహేష్ బాబు - దళపతి విజయ్ 

చెన్నైలో ఉన్నప్పుడు మహేష్ బాబు.. దళపతి విజయ్ తో కలిసి చదువుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు టాలీవుడ్ లో అగ్ర హీరోగా రాణిస్తున్నారు. దళపతి విజయ్ కోలీవుడ్ లో అగ్ర హీరో. అదే విధంగా విజయ్ పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చారు. 

68
జూనియర్ ఎన్టీఆర్ - మంచు మనోజ్ 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరూ హైదరాబాద్ లో ఒకే స్కూల్ లో కలిసి చదువుకున్నారు. ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నారు. మంచు మనోజ్ కూడా నటుడిగా మంచి గుర్తింపు పొందారు. 

78
రాంచరణ్ - రానా దగ్గుబాటి - శర్వానంద్

మెగా పవర్ స్టార్ రాంచరణ్, రానా దగ్గుబాటి, శర్వానంద్ ముగ్గురూ ఒకే స్కూల్ లో కలిసి చదువుకున్నారు. ఇప్పటికీ వీరు ముగ్గురూ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు.

88
నాని - యాంకర్ ప్రదీప్ 

నేచురల్ స్టార్ నాని, యాంకర్ ప్రదీప్ కూడా క్లాస్ మేట్స్ అనే సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. నాని, ప్రదీప్ ఇద్దరూ హైదరాబాద్ లో కలిసి చదువుకున్నారు. నాని హీరో అయినప్పుడు మా ఫ్రెండ్స్ అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయినట్లు ప్రదీప్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories